13 March 2018
Hyderabad
ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మించిన చిత్రం `కిరాక్ పార్టీ`. నిఖిల్ సిద్ధార్థ్, సిమ్రన్ పరీన్జా, సంయుక్తా హెగ్డే, బ్రహ్మాజీ, సిజ్జు, రఘు కారుమంచి, సాయాజీ షిండే, హనుమంత గౌడ, రాఘవ, ప్రమోదిని, రాకేందు మౌళి, రాఘవేంద్ర, ఆర్.జె. హేమంత్, సమీర్, నవీన్, కార్తిక్, మౌర్య కీలక పాత్రధారులు. షరణ్ కొప్పిశెట్టి దర్శకుడు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. ఈ సినిమా మార్చి 16న విడుదలవుతుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. కిరాక్ పార్టీ థియేట్రికల్ ట్రైలర్‌ను కిషన్ రెడ్డి విడుదల చేశారు.
సుధీర్ వర్మ మాట్లాడుతూ - ``సినిమా రెండు కారణాలతో పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. అందులో మొదటిది అనీల్ సుంకరగారికి సినిమాలంటే ఉన్న ప్యాషన్ అయితే.. రెండో కారణం నిఖిల్, శరణ్ ఈ సినిమా కోసం పడ్డ కష్టం. నిఖిల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా సినిమా నిలుస్తుంది`` అన్నారు.
రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ - ``అజనీశ్ బ్యూటీఫుల్ ఆల్బమ్ ఇచ్చాడు. తనకు మంచి ఫ్యూచర్ ఉంది. మంచి అవుట్ పుట్ కుదిరింది. ఇందులో మూడు సాంగ్స్ రాశాను. కాలేజ్ పొలిటికల్ సాంగ్, సంయుక్తా హెగ్డేపై తీసిన సాంగ్, క్లైమాక్స్ లో భైరవ పాడిన పాట. నిఖిల్ ఎనర్జీని థియేటర్స్‌లో ఇంకా ఎక్కువగా చూస్తారు. శరణ్ డైరెక్టర్ కావడానికి నిఖిల్ కారణం. తను భవిష్యత్‌లో పెద్ద దర్శకుడు అవుతాడు. కిరాక్ పార్టీ రిలీజ్ తర్వాత కొత్త దర్శకులు ఈ హ్యాంగ్ ఓవర్‌లో ఉంటారు`` అన్నారు.
Naga Shourya మాట్లాడుతూ - ``హీరో నిఖిల్ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఎదిగాడు. నాకు మంచి స్నేహితుడు. తను హ్యాపీడేస్‌లో చేసిన పాత్ర నాకు వచ్చి ఉంటే బావుండేది కదా! అని ఆలోచించిన రోజులు కూడా ఉన్నాయి. కిరాక్ పార్టీ నిఖిల్‌కి చాలా పెద్ద హిట్ అవుతుంది. ఆ ఎనర్జీ నిఖిల్, అతని ఫ్రెండ్స్‌లో కనపడుతుంది. హ్యాపీడేస్ ఎన్ని రోజులు ఆడిందో.. ఈ సినిమా అంత కంటే ఎక్కువ రోజులే ఆడుతుంది. ఈ సినిమాతో వచ్చిన డబ్బులతో మరో నాలుగైదు సినిమాలు చేసే ధైర్యం వస్తుంది. అనిల్, కిషోర్‌గారు క్రేజీ ప్రొడ్యూసర్స్. అద్వైత గురుమూర్తి కెమెరా వర్క్.. అజనీశ్ లోక్‌నాథ్ సంగీతం చాలా బావున్నాయి. సిమ్రాన్, సంయుక్త చాలా చక్కగా నటించారు. శరణ్ కోపిశెట్టికి ఆల్ ది బెస్ట్`` అన్నారు.
చందు మొండేటి మాట్లాడుతూ - ``కార్తికేయ సినిమాకు శరణ్ నాతో వర్క్ చేశాడు. ఇప్పుడు తను డైరెక్షన్‌లో నేను వర్క్ చేశాను. మేమిద్దరం కలిసి చేసిన చిత్రమిది.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ - ``నేను సినిమాలు తక్కువగా చూస్తాను. చైతన్య కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో నిఖిల్ చేసిన `కిరాక్‌పార్టీ` సినిమా చూశాను. నిఖిల్ ఎనర్జిటిక్ హీరో. బాగా కష్టపడతాడు. సినిమాకు 24 క్రాఫ్ట్స్ డేడికేషన్‌తో కష్టపడుతున్నారు. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న సినిమా ఇది. అప్పట్లో రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో వరుస సినిమాలు వచ్చాయి. ఈమధ్య దెయ్యాల సినిమాలు వరుసగా వస్తున్నాయి. ఈ కిరాక్‌పార్టీతో మళ్లీ కాలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీలు రావాలి. సినిమా ఎంత కిరాక్‌గా ఉన్నా కూడా మంచి మెసేజ్ కూడా ఉంటుందని భావిస్తున్నాం. సినిమా పెద్ద విజయవంతం అయ్యి 100 రోజులు ఆడాలి. దర్శకుడు పెద్ద దర్శకుడు కావాలి.. నిర్మాతకు మంచి లాభాలను తేవాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
సిమ్రాన్ పరింజ మాట్లాడుతూ - ``నిఖిల్ చాలా మంచి కో ఆర్టిస్ట్. డైరెక్టర్ శరణ్‌గారు నన్ను సినిమా ఆసాంతం చక్కగా గైడ్ చేశారు. సినిమాలో మీరా అనే అమ్మాయి పాత్రలో కనపడతాను. ఈ సినిమాలో చేసిన అనుభవం మరచిపోలేను. సంయుక్తతో వర్క్‌చేయడం ఫన్‌గా అనిపించింది. నా కాలేజ్ డేస్ గుర్తుకు వచ్చింది. ప్రతి ఒక్కరికీ వారి కాలేజ్ డేస్ గుర్తుకొస్తాయి`` అన్నారు.
సంయుక్తా హెగ్డే మాట్లాడుతూ - ``నాకు చాలా స్పెషల్ మూవీ. కన్నడ, తెలుగులో కిరాక్ పార్టీ నాకు డెబ్యూ మూవీ అయ్యింది. నిఖిల్, అనిల్, శరణ్ నాకు మంచి సపోర్ట్‌ను అందించారు. చాలా కంఫర్ట్‌గా సినిమా చేశాను. అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాను`` అన్నారు.
డైరెక్టర్ శరణ్ మాట్లాడుతూ - ``అనిల్, కిషోర్, రాజాగారికి, చందు అన్న, సుధీర్ అన్నగారికి థాంక్స్. అన్నలిద్దరూ నాకు సపోర్ట్ చేశారు. నిజాయితీగా కష్టపడి..యంగ్ టీంతో కష్టపడి చేసిన సినిమా ఇది. నాతో పాటు సాయి, సతీష్, రోహిత్ అందరూ నాతో పాటు బాగా కష్టపడ్డారు. మార్చి 16న సినిమా విడుదలవుతుంది`` అన్నారు.
ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్ అనీల్ సుంకర మాట్లాడుతూ - ``కన్నడంలో కిరిక్ పార్టీ సినిమా చూడగానే తెలుగులోరీమేక్ చేయాలనుకున్నాం. అలాగే మంచి అవుట్‌పుట్‌తో స్క్రిప్ట్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేసిన సినిమా ఇది. ప్రేక్షకుల అంచనాలను రీచ్ అవుతుంది. సినిమా చూసిన వారందరూ..సినిమాతో ప్రేమలో పడతారు. ప్రతి ఒక్కరికి రిలేట్ అయ్యే సినిమా. సినిమా చూడకుండానే.. నేను ఫోన్ చేయగానే తప్పకుండా చేస్తానండి అన్నాడు. అలాగే ఈ సినిమాకు చందు మొండేటి, సుదీర్ వర్మ వర్క్ చేయడం మాకు, శరణ్‌కు అదృష్టంగా భావిస్తున్నాం. ఇద్దరు దర్శకులు (సుధీర్ వర్మ, చందు మొండేటి) వారి అసిస్టెంట్ డైరెక్టర్‌ను డైరెక్టర్ కావడానికి ఎంతో సహకారం అందించారు. ఈ ఇద్దరు దర్శకుల్లా మిగిలిన దర్శకులు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. హీరోయిన్స్ సిమ్రాన్, సంయుక్తలు చక్కగా నటించారు. టూర్ కండెక్ట్ చేశాం...దానికి వారెంతో సహకారం అందించారు. సినిమాలో నటించిన కిరాక్ గ్యాంగ్‌కు థాంక్స్. ఈ సినిమాలో వారితో కలిసి పది మంది హీరోలున్నారు. చివరి క్షణాలు సినిమాలో ది బెస్ట్ గా అనిపిస్తాయి. కిషోర్‌గారు ప్రొడక్షన్‌లో ఎంతో సహకారం అందించారు. అనుకున్న అవుట్‌పుట్ వచ్చింది. మంచి సినిమా రావడానికి అందరం కష్టపడ్డారు. సినిమా చూసిన వారికి వారి కాలేజీ రోజులు గుర్తుకు వస్తాయి.
నిఖిల్ మాట్లాడుతూ - ``సుధీర్ వర్మ మంచి డైలాగ్స్ అందించారు. చందు ఈ సినిమా కోసం బౌండెడ్ స్క్రిప్ట్‌ను రెడీ చేసి ఇచ్చారు. కాలేజ్ అబ్బాయిలు అమ్మాయిల గురించి చాలా ఈజీగా ఏదో అనేస్తున్నారు. కానీ అలా అనకూడదు. మహిళలకు గౌరవం ఇవ్వాలనే మెసేజ్‌తో సినిమాను చేశాం. అనిల్‌గారు, కిషోర్‌గారి వల్లే ఈ సినిమాస్టార్టయ్యింది. ఎప్పటి నుండో ఈ బ్యానర్‌లో చేయాలని అనుకుంటున్నాను. ఇప్పటికీ కుదిరింది. నేను స్వామిరారా, కార్తికేయ సినిమాలు సహా నేను చేసిన సినిమాలకు మంచి ప్రశంసలు దక్కాయి. కానీ ఈ సినిమాలోని వేరియేషన్స్‌ను మరే సినిమాలో చేయలేదు. ఇది స్టూడెంట్ సినిమా. కె.ఎల్.యూనివర్సిటీ, గైడ్, ఆదిత్య కాలేజ్, ఉషా రామా కాలేజీస్‌లో షూటింగ్ చేసినప్పుడు అక్కడి స్టూడెంట్స్ మాకు ఎంతో సహకారం అందించారు. సినిమా పూర్తయ్యింది. సినిమాకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను. సినిమా పూర్తయ్యింది.. చాలా బాధగా ఉంది. మా కిరాక్ గ్యాంగ్ మూవీ ఇది. సినిమాలోనే కాదు గ్యాంగ్‌లోని అందరం నిజ జీవితంలో కూడా మంచి స్నేహితులయ్యాం. ఈ సినిమాకు కాలేజ్ ఓ హీరో అయితే.. చిత్ర దర్శకుడు శరణ్ మరో హీరో. ఎక్కడా టెన్షన్ పెట్టలేదు. సినిమాను అద్భుతంగా తీశాడు.
బస్ టూర్‌కు ఆడియెన్స్ నుండి చాలా మంచి స్పందన వచ్చింది. సినిమా సక్సెస్ తర్వాత మరోసారి టూర్‌కు వస్తాం. సినిమాలో చాలా మంచి ఎమోషన్స్, ఫన్, ఎంటర్‌టైన్మెంట్ ఉంది. కిరాక్ పార్టీ.. ఇదొక ఎమోషన్ మూవీ`` అన్నారు.