యూత్‌స్టార్ నితిన్ హీరోగా వెంకట్ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం 'లై' (లవ్ ఇంటెలిజెన్స్ ఎన్‌మిటి). ఈ చిత్రం ఆగస్ట్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ శనివారం హైదరాబాద్‌లోజరిగింది.
సుకుమార్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. బిగ్ సీడీని, ఆడియో సీడీలను త్రివిక్రమ్ శ్రీనివాస్ విడుదల చేశారు. తొలి సీడీని సుకుమార్ అందుకున్నారు. ఈ సందర్భంగా...
శ్రీకాంత్ మాట్లాడుతూ - ``ప్రతి మనిషి జీవితంలో అబద్ధాలు చెబుతుంటాడు. కొన్ని మంచి విషయాలు జరగాలంటే అబద్ధాలు చెప్పాల్సిందే. నేను చాలాసార్లు అబద్ధాలు చెప్పాను. ఇక లై సినిమా విషయానికి వస్తే, చాలా మంచి విషయాలు జరిగాయి. కొత్త కథ, నితిన్ కొత్త లుక్. ఇందులో లై అనే టైటిల్ తప్ప అన్ని నిజాలే. మంచి ఎక్స్‌పీరియెన్స్. బాగా ఎంజాయ్ చేశాం. హనురాఘవపూడికి థాంక్స్. నితిన్‌తో వర్క్ చేయడం ఎంజాయ్ చేశాను. తను చాలా బాగా పెర్ఫామెన్స్ చేశాడు`` అన్నారు.
సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ - ``సినిమా ఎలా ఉంటుందో నాకు తెలుసు. రిలీజ్ తర్వాత మాట్లాడుతాను`` అన్నారు.
జెమిని కిరణ్ మాట్లాడుతూ - ``సినిమా హాలీవుడ్ రేంజ్‌లోకనపడుతుంది. నితిన్, హను రాఘవపూడి సహా యూనిట్‌కు ఆల్ ది బెస్ట్`` అన్నారు.
తరుణ్ ఆదర్శ్ మాట్లాడుతూ - ``బాహుబలి సినిమాతో ఇండియన్ సినిమా గర్వంగా ఫీలయ్యేలా చేసింది. దీంతో టాలీవుడ్ సినిమాల గురించి బాలీవుడ్ సహా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక లై సినిమాల విషయానికి వస్తే సినిమా మేకింగ్ ఎంతో రిచ్‌గా ఉంది. నిర్మాతలకు ఆల్ ది బెస్ట్`` అన్నారు.
సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ - ``నాకు 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్ హోం బ్యానర్‌తో సమానం. ఈ బ్యానర్‌లో హైపర్ మూవీ చేశాను. నిర్మాతలకు అన్నదమ్ములతో సమానం. లై విషయానికి వస్తే, హను ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. క్వాలిటీ తెరపై కనపడుతుంది. అందరి కష్టం కనపడతుంది. సినిమా పెద్ద హిట్ కావాలి. నితిన్, మేఘా ఆకాష్ సహా అందరికీ అభినందనలు`` అన్నారు.
యువరాజ్ మాట్లాడుతూ - `` సినిమా చాలా బాగా వచ్చింది. నాకు హను రాఘవపూడి ఇష్టమైన దర్శకుడు. సినిమా పెద్ద హిట్ అవుతుంది`` అన్నారు.
Megha Akash interviewgallery
సుకుమార్ మాట్లాడుతూ - ``ట్రైలర్ అదిరిపోయింది. డైరెక్టర్స్ సాధారణంగా రెండు రకాలుంటారు. ఎడిటింగ్ రూంలో డైరెక్ట్ చేసేవాళ్లు, సెట్‌లో డైరెక్ట్ చేసేవాళ్లు. అంతా షూట్ చేసేసి ఎడిటింగ్ చేసే డైరెక్టర్‌ని నేను. హను రాఘవపూడి విషయానికి వస్తే, తను సీన్‌ను సెట్‌లోనే ఊహించేస్తాడు. తన షాట్ డివిజన్ చాలా బావుంటుంది. విష్ యు ఆల్ ది బెస్ట్. ఇక నిర్మాతలు నాకు చాలా ఫేవరేట్. వాళ్లు మేకింగ్ కాంప్రమైజ్ కారు. రామ్‌గారి ప్రేమ, గోపీగారి నిశ్శబ్దం, అనీల్‌గారి దూకుడు కలిస్తే 14 రీల్స్. ఇప్పుడు వెంకట్‌గారు వచ్చి వీరితో జత కలిశారు. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. గురువుగారి దగ్గర మెప్పు పొందడం గొప్ప విషయం. ఇప్పుడు యువరాజ్ తన గురువు రత్నవేలు నుండి బాగా చేశాడని మెప్పు పొందాడు. మణిశర్మగారి మ్యూజిక్ బావుంది. నిర్మాతల కోసం సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. నేను దిల్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌ని. ఆ సమయంలో నేను తనతో బాగా ట్రావెల్ చేశాను. అలాగే నేను తొలిసారి డైరెక్ట్ చేసిన ఆర్య తొలి ప్రేక్షకుడు కూడా నితినే. నితిన్‌ను లుక్ పరంగా చాలా టఫ్‌గా ఉండాలని కోరుకునే వాడిని. ఈ లుక్‌లో నితిన్ చాలా బావున్నాడు. తను పవన్‌కు పెద్ద ఫ్యాన్. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
నికిత మాట్లాడుతూ - ``నితిన్ కొత్త లుక్ కోసం చాలా కేర్ తీసుకున్నాడు`` అన్నారు.
హను రాఘవపూడి మాట్లాడుతూ - ``ఇది ఆరు నెలల జర్నీ. సినిమా అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం యు.ఎస్‌కు వచ్చిన క్రూ 28 మంది రేయింబగళ్లు 70 మంది పని చేశారు. అందరికీ థాంక్స్. కథ ప్లాట్ నా దగ్గర ఉన్నప్పుడు రామ్‌గారు విని విలన్ తరపున సినిమాను ఓపెన్ చేస్తే బావుంటుందని ఆయన ఐడియా ఇచ్చారు. ఆ ఆలోచన సినిమా లుక్‌నే మార్చేసింది. నితిన్ విషయానికి వస్తే, నేను సినిమాను నమ్మిన దానికంటే నితిన్ ఎక్కువ నమ్మాడు. హై పీవర్‌లో కూడా చాలా కష్టపడ్డాడు. కొత్త నితిన్‌ను ఈ సినిమాలో చూస్తారు. మేఘా ఆకాష్ చాలా ఫ్రెండ్లీ. చాలా కష్టపడింది. యువరాజ్‌తో నాలుగేళ్లుగా ప్రయాణిస్తున్నాను. ఈ సినిమా తన ఎంత ఎఫర్ట్ పెట్టాడంటే, అతి తక్కువ టైంలో షూట్ చేశాం. క్వాలిటీ అదిరిపోయింది. నేను చాలెంజ్‌గా చెబుతున్నాను. ఈ క్వాలిటీని మరెవరూ ఇవ్వలేరు. తనకు థాంక్స్. ఎడిటర్ శేఖర్ ఎంతో సపోర్ట్ చేశారు. తను ఎమోషనల్ బ్యాలెన్స్ విషయంలో నాకు సపోర్ట్ చేశాడు. బ్రదర్‌లా సపోర్ట్ చేశాడు. మణిశర్మగారు ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చారు. ఆయన ఆర్.ఆర్ సినిమాకు పెద్ద ప్లస్. అర్జున్‌గారికి థాంక్స్`` అన్నారు.
హీరో నితిన్ మాట్లాడుతూ - ``నా హృదయానికి దగ్గరైన సినిమా `లై`. ఈ సినిమా అవుట్‌పుట్ ఇంత బాగా రావడానికి టీమ్ పడ్డ కష్టమే కారణం. లై ఫస్ట్‌లుక్ నుండి పాజిటివ్ టాక్‌తో మొదలైంది. నీరజకోన, నా హెయిర్ స్టైలిష్ట్ విజయ్ ఎంతో కేర్ తీసుకున్నారు. ఎడిటర్ శేఖర్ సినిమాను ఎంతో ప్రేమించి టీజర్ కట్ చేశాడు. టీజర్‌కు ఎంత మంచి పేరు వచ్చిందో మీకు తెలుసు. ఈ సినిమా కోసం నలబై రోజుల పాటు తన సినిమాలను వదిలేసుకుని కష్టపడ్డాడు. సినిమాటోగ్రాఫర్ యువరాజ్ మంచి విజువల్స్ ఇచ్చాడు. ఇక నిర్మాతలు ఎంతో ప్యాషనేట్. 75 రోజుల పాటు అమెరికాలో షూట్ చేయించారు. ఇప్పటి వరకు సౌత్‌లో ఏ సినిమా అన్ని రోజులు అక్కడ షూటింగ్ జరుపుకోలేదు. మేఘాకు ఆల్ ది బెస్ట్. హను రాఘవపూడి, నేను ఈ సినిమా జర్నీలో చాలా క్లోజ్ అయ్యాం. యు.ఎస్‌లో లాంగ్ షెడ్యూల్‌లో 40 రోజుల పాటు ఏ అసిస్టెంట్ డైరెక్టర్ లేకుండా పనిచేశాడు. సినిమా అంటే తనకు పిచ్చి. హను భవిష్యత్‌లో పెద్ద డైరెక్టర్ అవుతాడు. మణిశర్మగారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆయన మ్యూజిక్ లెజెండ్. రీ రికార్డింగ్ ఇంటర్నేషనల్ రేంజ్‌లో ఉంటుంది. కల్యాణ్‌గారి ప్రొడక్షన్‌లో నేను 25వ సినిమా చేస్తున్నాను. ఒక ఫ్యాన్‌గా ఇంత కంటే నాకు ఏం కావాలి. నేను చాలా హ్యాపీ. అవకాశం ఇచ్చిన త్రివిక్రమ్, పవన్‌గారికి థాంక్స్`` అన్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ - ``నేను మణిశర్మగారికి ఫ్యాన్. ఆయనతో్ నేను కూడా పనిచేశాను. ఆయన గురించి మాట్లాడేంత స్థాయి నాకు లేదు. ట్రైలర్ చూసిన తర్వాత సినిమా పెద్ద హిట్ అవుతుందనడంలో సందేహం లేదు. నిర్మాతలంటే చాలా ఇష్టం. ఎందుకంటే వీళ్లలా సినిమాను ప్రేమించి తీసే నిర్మాతలు తక్కువ. లై సినిమా ఆడితే ఇలాంటి మంచి సినిమాలు చేయాలనే ధైర్యం నిర్మాతలకు కలుగుతుంది. క్రింద పడ్డ ప్రతిసారి అంతకంటే బలంగా పైకి లేచే నిర్మాతలు. లై సినిమా 14 రీల్స్ బ్యానర్ గౌరవాన్ని పెంచుతుంది. సినిమా పేరే అబద్ధం(లై) కానీ సినిమాను ఎంకరేజ్ చేయడానికి వచ్చిన వారందరూ నిజంగా మంచి హృదయం ఉన్నవారే. ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్`` అన్నారు.