Sharwanand Is Favorite Hero Of Our Family: Prabhas
Sharwanand and Mehreen Kaur starrer Mahanubhavudu is directed by Maruthi and produced by Vamshi and Pramod under UV Creations Banner. The film’s pre-release function was held on Sunday in Hyderabad. And rebel star Prabhas attended the event as chief guest.
While speaking on the occasion, music director SS Thaman said, “Maruthi is an extraordinary human being. He grabbed best work from me and I thank him for giving me the opportunity to be part of this fine project. I also thank producers Vamshi and Pramod. Mahanubhavudu is my first film with Sharwanand. I’m really happy that Prabhas who launched audio of Brindavanam for which I composed music for has graced as chief guest for Mahanubhavudu audio release function as well. I wish audience will make this movie for which many good people worked for a super hit.”
Director Maruthi said, “Prabhas always encourage his friends. I’m happy for him gracing the function as the chief guest. Vamshi and Pramod are like life time friends to me. When we were in dilemma to choose a hero who can suit aptly to the subject, Sharwanand hasn’t just accepted to do the film but he gave life to it with his acting. You will see Sharvanand’s acting prowess in theaters. He just nailed it with his performance. I excited much more working with Sharwa to how I exaggerated working with Nani for Bhale Bhale Magadivoy. He gave full support to every technician and artist and took the movie to the next level. Everyone gave full justice to the story penned by me with their maximum efforts. It’s a product of complete team work. Mahanubhavudu will be releasing on September 29th. Such concepts will come rarely. And we should not miss them. It’s a wholesome entertainer with high family emotions. I will always be grateful to the UV Creations which encouraged me to make a good film. I will definitely make a film with Prabhas one day. Thanks to everyone.”
Hero Sharwanand said, “If I’m a Mahanubhavudu in the film, Prabhas anna is the real Mahanubhavudu in real life. It’s because we get only 4 to 5 people who love us to the core. However, Prabhas anna has a minimum of 25 best friends. In fact, it’s Prabhas anna who feels more tension than me, before release of my every film. After I did Run Raja Run, he excited me saying you achieved big hit, so enjoy to the fullest. Such good human being Prabhas is. He wishes his co-stars too to attain success. Coming to film, Mahanubhavudu has come out really well. You will definitely love it. There have been many instants that I slept happily for doing excellent scenes regularly. I thank Maruthi for making such good film. I also thank producers for making me part of this great venture.”
Prabhas said, “Sharwanand is favorite hero of our family. When we were mulling over hero for Run Raja Run, Vamshi suggested me Sarwanand’s name. He also stated that Sharwa has excellent attitude. When I told Sharwa that he didn’t do entertaining characters earlier, he replied saying let’s try, if you are happy, then let’s go further. We all became fans for his words. From that day, Sharwa has become a brother to me. I really like Maruthi’s Prema Katha Chitram. He also entertained us with Bhale Bhale Magadivoy. I hope, this movie will be far better to his previous movies. The entire unit is in full confident. I think the movie will turn out to be a blockbuster and Sharwanand will become a Superstar.”
Technicians: Music - SS Thaman, Cinematographer - Nizar Shafi, Art-Ravinder, Fights-Venkat, Editing - Kotagiri Venkateswara Rao, Choreography: Raju Sundaram, Lyricists: Sirivennela Sitarama Sastry, Bhaskar Bhatla, KK, Executive Producer- N Sedeep,
Co-Producer- SKN, Producers- Vamshi, Pramod,
Story, Dialogues, Screenplay, Direction - Maruthi.
శర్వానంద్ హీరోగా, మెహరీన్ హీరోయిన్ గా, మారుతి దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమొద్ లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్న చిత్రం `మహనుభావుడు`. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా...
ఎస్.ఎస్.థమన్ మాట్లాడుతూ - ``మారుతి ఎక్స్‌ట్రార్డినరీ హ్యుమన్ బీయింగ్. నా నుండి బెస్ట్ వర్క్‌ను రాబట్టుకున్నారు. ఇంత మంచి సినిమాలో అవకాశం ఇచ్చినందుకు మారుతిగారికి థాంక్స్. నిర్మాతలు ప్రమోద్, వంశీలకు థాంక్స్. శర్వానంద్‌తో చేసిన తొలి సినిమా. నేను వర్క్ చేసిన బృందావనం సినిమా ఆడియో విడుదల చేసిన ప్రభాస్ ఈ సినిమా ఆడియో ముఖ్య అతిథిగా రావడం ఆనందంగా ఉంది. చాలా మంది మహానుభావులు పనిచేసిన ఈ సినిమాను ప్రేక్షక మహానుభావులు సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
దర్శకుడు మారుతి మాట్లాడుతూ - ``ప్రభాస్‌గారు ఆయన మిత్రులను ఎంకరేజ్ చేస్తున్నారు. ఆయన ముఖ్య అతిథిగా హాజరుకావడం ఆనందంగా ఉంది. నాకు వంశీ, ప్రమోద్‌లు లైఫ్ టైమ్ ఫ్రెండ్స్. ఈ కథకు హీరోగా ఎవరైతే బావుంటుందోనని అనుకుంటున్న తరుణంలో శర్వానంద్ హీరోగా చేస్తానని ఒప్పుకోవడమే కాకుండా తన నటనతో పాత్రకు ప్రాణం పోశాడు. శర్వానంద్ విశ్వరూపాన్ని థియేటర్‌లో చూస్తారు. చాలా అద్భుతంగా చేశాడు. భలే భలే మగాడివోయ్‌లో నానితో ఎంత ఎగ్జయిట్ అయ్యానో అంత కంటే ఎక్కువ ఎగ్జయిట్‌మెంట్ కలిగింది. ప్రతి టెక్నిషియన్, ఆర్టిస్టులు చక్కగా సపోర్ట్ చేసి సినిమాను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లారు. నేను రాసుకున్న కథకు అందరూ తమ వర్క్‌తో ప్రాణం పోశారు. ఒక టీం వర్క్. సెప్టెంబర్ 29న విడుదలవుతుంది. ఇలాంటి కాన్సెప్ట్స్ అరుదుగా వస్తుంటాయి. ఇలాంటి కాన్సెప్ట్స్ సినిమాలు అరుదుగా వస్తుంటాయి. వచ్చినప్పుడు అసలు మిస్ కాకూడదు. మంచి ప్యామిలీ ఎమోషనల్ మూవీ. ఇలాంటి మంచి సినిమా తీసే అవకాశం ఇచ్చిన యువి క్రియేషన్స్‌కు రుణపడి ఉంటాను. ప్రభాస్‌గారితో ఎప్పటికైనా సినిమా తీస్తాను. అందరికీ థాంక్స్`` అన్నారు.
హీరో శర్వానంద్ మాట్లాడుతూ - ``నేను సినిమాలో మహానుభావుడని అయితే రియల్ లైఫ్‌లో ప్రభాస్ అన్న మహానుభావుడు. ఎందుకంటే, మన జీవితంలో మనల్ని ప్రేమించేవాళ్లు నలుగురైదుగురు ఉంటారు. కానీ ప్రభాస్ అన్నకు మాత్రం బెస్ట్ ఫ్రెండ్స్ ఓ పాతిక మంది పైనే ఉంటారంటే అర్థం చేసుకోవచ్చు. నా సినిమా రిలీజ్ టైంలో నాకంటే ఎక్కువ టెన్షన్ పడేది ప్రభాస్ అన్న. నేను రన్ రాజా రన్ చేసినప్పుడు, నువ్వు హిట్ కొట్టావురా ఎంజాయ్ చెయ్ అన్నారు. అలా పక్కవాడు కూడా పైకి రావాలని కోరుకునే మంచి వ్యక్తి. ఇక సినిమా గురించి చెప్పాలంటే సినిమా బాగా వచ్చింది. సినిమా చూసి అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. చాలా రోజుల తర్వాత ఈరోజు డైరెక్టర్ నాతో మంచి సీన్ చేయించుకున్నాడురా అని నిద్రపోయిన రోజులెన్నో ఉన్నాయి. అలా సినిమాను చక్కగా డైరెక్ట్ చేసిన మారుతిగారికి థాంక్స్. ఓ గ్రేట్ ఫిలిం చేసే అవకాశం ఇచ్చిన దర్శకుడు, నిర్మాతలకు థాంక్స్`` అన్నారు.
ప్రభాస్ మాట్లాడుతూ - ``శర్వానంద్ మా ఇంటి హీరో. రన్ రాజా రన్ సినిమాను ఎవరితో చేయాలనుకున్నప్పుడు వంశీ శర్వానంద్ పేరు చెప్పాడు. తన యాట్యిట్యూడ్ బావుంటుందని కూడా చెప్పాడు. తనెప్పుడూ ఎంటర్‌టైన్మెంట్ క్యారెక్టర్ చేయలేదు కదా అని అంటే, ట్రై చేయండన్నా, నచ్చితే కంటిన్యూ చేద్దాం అన్నాడు. ఆ మాటలకు నేను, వంశీ, ప్రమోద్ సహా అందరం తనకు ఫ్యాన్స్ అయిపోయాం. ఆరోజు నుండి శర్వా, నాకు బ్రదర్ అయిపోయాడు. మారుతిగారి దర్శకత్వంలో వచ్చిన ప్రమకథాచిత్రమ్ అంటే నాకు చాలా ఇష్టం. అలాగే భలే భలే మగాడివోయ్ సినిమాలో కూడా అద్భుతంగా నవ్వించారు. ప్రేమకథాచిత్రమ్, భలే భలే మగాడివోయ్ సినిమాలకంటే, ఈ సినిమా ఇంకా బావుండాలని కోరుకుంటున్నాను. యూనిట్ అందరూ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. యూనిట్ అంతా చక్కగా కుదిరింది. సినిమా బ్లాక్‌టస్టర్ అవుతుందని భావిస్తున్నాను. రేపు పొద్దున సూపర్‌స్టార్ శర్వానంద్`` అన్నారు. నటీనటులు.. శర్వానంద్, మెహరిన్, వెన్నెల కిషోర్, నాజర్, భద్రం, కళ్యాణి నటరాజ్, పిజ్జాబాయ్, భాను, హిమజ, వేణు, సుదర్శన్, సాయి, వెంకి, శంకర్‌రావు, రామాదేవి, మధుమణి, రాగిణి, రజిత, అబ్బులు చౌదరి, సుభాష్, ఆర్.కె తదితరులు..సాంకేతిక నిపుణులు.. సంగీతం- ఎస్.ఎస్.థమన్, సినిమాటోగ్రాఫర్- నిజార్ షఫి, ఆర్ట్-రవిందర్, ఫైట్స్-వెంకట్, ఎడిటింగ్- కొటగిరి వెంకటేశ్వరావు, కోరియోగ్రఫి : రాజు సుందరం , గీత రచయితలు : సిరివెన్నెల సీత రామ శాస్త్రి , భాస్కర్ భట్ల, కె కె , ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్- ఎన్.సందీప్, కొ-ప్రోడ్యూసర్- ఎస్.కె.ఎన్, ప్రోడ్యూసర్స్- వంశి-ప్రమోద్, స్టోరి, మాటలు,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం- మారుతి.