శ్రీమతి బొడ్డు లక్ష్మి సమర్పణలో ఈస్ట్‌వెస్ట్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్‌కార్తీక్, సనాఖాన్ హీరో హీరోయిన్లుగా విశాఖ థ్రిల్లర్ వెంకట్ దర్శకత్వంలో వరప్రసాద్ బొడ్డు నిర్మిస్తున్న చిత్రం `మామ..ఓ..చందమామ`. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ..
ప్రముఖ రచయిత చిన్నికృష్ణ మాట్లాడుతూ - ``డైరెక్టర్ వెంకట్ టేకింగ్ చూస్తే తప్పకుండా తను పెద్ద డైరెక్టర్ అవుతాడు. పాటలు కూడా విన్నాను. చాలా బావున్నాయి. చందమామ అనే పేరు పాపులర్ టైటిల్. అందరికీ త్వరగా రీచ్ అవుతుంది. ఈ సినిమా పెళ్ళిచూపులు కంటే పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
గీతాంజలి మాట్లాడుతూ - ``ఈ సినిమాలో నేను సుమన్‌గారి అమ్మ పాత్రలో నటించాను. దర్శక నిర్మాతలు చక్కగా రిసీవ్ చేసుకున్నారు. ఓ మంచి సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. హీరో, హీరోయిన్ జంట చక్కగా ఉంటుంది. దర్శకుడు వెంకట్‌కి ఈ సినిమా పెద్ద హిట్ సాధించి మంచి పేరు తెస్తుంది`` అన్నారు.
డా.రాజశేఖర్ మాట్లాడుతూ -``నేను చదువుకునే రోజుల్లో సుమన్‌గారికి చాలా మంది అమ్మాయిల ఫ్యాన్స్ ఉండేవారు. నాకు మంచి స్నేహితుడు. హీరో రామ్ కార్తీక్ మా పిల్లలకు మంచి ఫ్రెండ్. అతని తల్లిదండ్రులు తనని హీరోగా చూడాలని కష్టపడుతుంటారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. సినిమా చాలా బాగా వచ్చిందని తెలిసింది. సినిమా మ్యూజిక్ బావుంది. సనాఖాన్ ఎట్రాక్టివ్ పర్సన్. ఈ సినిమాకు అన్ని పాజిటివ్ అంశాలే కనపడుతున్నాయి`` అన్నారు.
జీవిత మాట్లాడుతూ - ``కార్తీక్‌కి ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. నిర్మాత వరప్రసాద్‌గారు గరుడవేగ యు.ఎస్. రిలీజ్‌లో మాకెంతో సపోర్ట్ చేశారు. ప్రతి సినిమాను అందరూ కష్టపడే తీస్తాం. అలాంటి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేది మీడియానే. రివ్యూలపై ఆధారపడి సినిమాలు చూడొద్దు`` అన్నారు.
రాజ్ కందుకూరి మాట్లాడుతూ - ``దర్శకుడు వెంకట్, మున్నాకాశీ, రామ్ కార్తీక్, సనాఖాన్ సహా యూనిట్ సభ్యులందరికీ అభినందనలు`` తెలిపారు.
సుమన్ మాట్లాడుతూ - ``చాలా క్లీన్ ఫిలిం. కుటుంబ సభ్యులంతా కలిసి చూసేలా సినిమా ఉంటుంది. అన్ని ఎలిమెంట్స్ కలయికతో రూపొందిన సినిమా. తల్లి, భార్య, కూతురు మధ్య నలిగే ఓ పాత్రలో నటించాను. సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా పెద్ద హిట్ సాధిస్తుంది`` అన్నారు.
దర్శకుడు విశాఖ థ్రిల్లర్ వెంకట్ మాట్లాడుతూ ``ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులు చూసేలా ఉంటుంది. కామెడీ, లవ్ సహా అన్ని ఎలిమెంట్స్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే సినిమా. నవ రసాలున్న సినిమా. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత వరప్రసాద్‌గారికి థాంక్స్. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు చాలా సంతృప్తితో బయటకు వస్తారు. డ్యాన్సర్‌గా ఉన్న నేను రాంగోపాల్ వర్మగారిని ఆదర్శంగా తీసుకుని దర్శకుడిగా మారాను. డిసెంబర్ 15న సినిమా విడుదలవుతుంది. అందరూ ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను`` అన్నారు.
రామ్ కార్తీక్ మాట్లాడుతూ - ``సుమన్ వంటి సీనియర్ యాక్టర్‌తో కలిసి నటించడం మరచిపోలేని అనుభూతి. నన్ను నమ్మి నాతో సినిమాచేసిన నిర్మాతలు మురళి, వర ప్రసాద్‌గారికి థాంక్స్. వెంకట్‌గారు చాలా మంచి కథతో సినిమా చేశారు. సనాఖాన్ సహా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులకు థాంక్స్`` అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ - ``18 సంవత్సరాలుగా యు.ఎస్‌లోనే ఉంటున్నాతెలుగు సినిమాలను ఫాలో అవుతూ వస్తున్నాం. అలాగే రెండు షార్ట్ ఫిలింస్ కూడా చేశాం. ఆ అనుభవంతో పాటు డైరెక్టర్ వెంకట్ చెప్పిన కథ నచ్చడంతో తెలుగులో సినిమా చేయడానికి రెడీ అయ్యాం. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే బంధాలు, అనుబంధాలతో సాగే చిత్రమిది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పల్లెటూర్లతో పాటు వైజాగ్ లేదా హైదరాబాద్‌లో సినిమాను చిత్రీకరించాం. సినిమా చాలా బాగా వచ్చింది. బాబుగారి సినిమాటోగ్రఫీ, మున్నా కాశీ సంగీతం సినిమాకు పెద్ద ఎసెట్ అవుతుంది. సుమన్‌గారు, గీతాంజలి, రామ్ కార్తీక్, సనాఖాన్ ఇలా ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు ఎంతో సపోర్ట్ చేశారు. సినిమాను డిసెంబర్ 15న విడుదల చేస్తున్నాం`` అన్నారు.