pizza
Naa Peru Surya Naa Illu India pre release function
`నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

29 April 2018
Hyderabad

స్టైలిష్‌స్టార్‌ అల్లుఅర్జున్‌ హీరోగా రామలక్ష్మి సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'. కె.నాగబాబు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. లగడపాటి శిరీషా శ్రీధర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో...

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ మాట్లాడుతూ - ''సినిమా ట్రైలర్‌ చూశాను. బన్ని డేడికేషన్‌ గురించి, పెర్ఫామెన్స్‌ గురించి, బన్నికున్న ఆకలి గురించి మాకు తెలుసు. చిన్నప్పుడు ఇంట్లో ఏదైనా ఫంక్షన్‌ జరిగినప్పుడు నేను పెద్దగా డాన్సులు వేసే వాడిని కాను కానీ.. మా ఇంట్లోవాళ్లనందరినీ ఎంటర్‌టైన్‌ చేసే వ్యక్తి బన్ని. తనలో చిన్నప్పట్నుంచి అతృత ఎక్కువగా ఉండేది. నాన్న కూడా వాడ్ని చూసి నేర్చుకోరా! అని తిడుతుండేవారు కూడా. చిరుత రిలీజ్‌ కాలేదు.. డాడీ ఒకసారి బన్నిని పిలిచి వీడికి డాన్సు వస్తుందా? రాదా? మన పరువు తీస్తాడా? అని అంటే ఆరోజు నాన్నగారికి ధైర్యం ఇచ్చిన వ్యక్తి బన్ని. ఆరోజు నుండి నాన్న తిట్టడం మానేశాడు. సాధారణంగా తమిళ దర్శకులు సెన్సిబుల్‌ సినిమాలు తీస్తారని మనం అనుకుంటూ ఉండేవాళ్లం. మనకు క్రిటికల్‌ అండ్‌ కమర్షియల్‌ సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయి. కానీ గత రెండేళ్లుగా గమనిస్తే విమర్శనాత్మక చిత్రాలు పెద్ద విజయాలను సాధిస్తున్నాయి. నా 'రంగస్థలం' కూడా అలాంటి చిత్రమే. అలాంటి మరో చిత్రంగా 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' విడుదల కానుంది. చాలా నిజాయతీగా తీసిన సినిమా అనిపిస్తుంది. నా 'ఎవడు' సినిమాకు రచయితగా చేసిన వంశీగారు ఈ సినిమాకు దర్శకుడిగా పనిచేశారు. ఈ సినిమా చూస్తుంటే ఇన్‌స్పైరింగ్‌గా అనిపిస్తుంది. ఒక నటుడిగా ఓ ఆర్మీ సినిమాలో చేయాలని ఎప్పటి నుండో కోరుకున్నాను. అందువల్లనేమో 'ధృవ' సినిమా చేశాను. నా బ్రదర్‌ బన్ని అలాంటి ఇన్‌స్పైరింగ్‌ మూవీ చేయడం ఆనందంగా ఉంది. మనకు ఎందరో నిజాయతీగల దర్శకులున్నారు. భవిష్యత్‌లో అలాంటి నిజాయతీతో ఉన్న దర్శకుల్లో వంశీ ఒకరు కావాలని కోరుకుంటున్నాను. రాజీవ్‌ రవి, నిర్మాతలు, అను ఇమ్మాన్యుయేల్‌ సహా అందరికీ కంగ్రాట్స్‌. అర్జున్‌గారు నా ఫేవరేట్‌ వ్యక్తి. ఆయనతో నెలకొకసారి అయినా మాట్లాడుతుంటాను. అలాంటి మంచి వ్యక్తి నా సోదరుడి సినిమాలో ఉండటం ఆనందంగా ఉంది. ప్రపంచంలో కరెప్షన్‌ అనేది లేని ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది సినిమా ఇండస్ట్రీ మాత్రమే. ఎందుకంటే ఓ దర్శకుడు, నిర్మాత, నటుడు ఎవరైనా సరే.. పొద్దున లేవగానే జిమ్‌కు వెళతాం. రోజు ఎండా! వానా! అని చూడకుండా పనిచేస్తుంటాం. బన్నికి ఎన్నిసార్లు గాయమైందో తెలుసు. మహేశ్‌, తారక్‌ ఇలా అందరికీ గాయాలయ్యాయి. ప్రభాస్‌కి రెండుసార్లు భుజానికి గాయాలయ్యాయి. మా నాన్నగారి భుజానికి కూడా రీసెంట్‌గా గాయమైంది. బాలకృష్ణగారి భుజానికి కూడా గాయమైంది. ఇలా ఒళ్లు హునం చేసుకుంటున్నాం. ఇంత కష్టపడి ఖాలీ సమయంలో కుటుంబంతో గడిపి మళ్లీ పొద్దున్నే సినిమా షూటింగ్‌లకు వెళుతుంటాం. ఇందులో కరెప్షన్‌ ఎక్కడుంది. ఏదో మీడియా రెండు నెలలుగా ఇండస్ట్రీ గురించి రాస్తుంటే మేం చూస్తున్నాం. నిజానికి నిజమైన వ్యక్తి అలాంటి వార్తలను నమ్మరు. మీరు హ్యాపీగా ఉండండి.. మమ్మల్ని కూడా హ్యాపీగా ఉండనివ్వండి. బన్ని ఇప్పటి వరకు మంచి పెర్ఫామర్‌గా, డాన్సర్‌గా తెలుసు. తను ఇన్‌టెన్స్‌తో కూడిన పాత్రలను చేయాలని కోరకుంటూ ఉంటాడు. అలా చేసిన పాత్రే గోనగన్నారెడ్డి. ఆ పాత్ర నిడివి తక్కువే. అలాంటి పాత్రకు ఎన్నో ప్రశంసలు, అవార్డులు వచ్చాయి. ఇప్పుడు అలాంటి పాత్ర రెండున్నర గంటలు ఉంటే ఎలా ఉంటుందనేది ఈ సినిమాలో చూడొచ్చు. ఈ సినిమాకు ఎన్ని ప్రశంసలు, అవార్డులు రానున్నాయో చూడాలి. మే 4 కోసం నేను కూడా మీలాగే అతృతగా ఎదురుచూస్తున్నాను'' అన్నారు.

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ మాట్లాడుతూ - ''ఈ సినిమా పరంగా నేను ముందు థాంక్స్‌ చెప్పాల్సింది ఇండియన్‌ ఆర్మీకి. వారు సినిమా షూటింగ్‌లో ఎంతగానో సపోర్ట్‌ చేశారు. వాళ్లు లేకుంటే సినిమా ఇంత బాగా వచ్చుండేది కాదు. ఈ కథను నా వద్దకు తీసుకొచ్చింది నల్లమలుపు బుజ్జి తీసుకొచ్చారు. నేను అడగ్గానే.. నా కోసం కథను ఇచ్చేశారు. ఆయనకు తప్పకుండా నా తరపున సపోర్ట్‌ అందిస్తాను. ఈ సినిమా శ్రీధర్‌గారు చేస్తే బావుంటుందని ఆయన్ను అడిగాను. ఆయన్నే ఎందుకు అడిగానంటే.. ఆయన స్టైల్‌ మూవీ నుండి తెలుసు. మంచి సినిమాలు చేస్తున్నారు. సినిమాల్లో డబ్బులు పొగొట్టుకుంటున్నారు. అయినా ప్యాషన్‌తో సినిమాలు చేస్తున్న ఆయన్ను చూసి ఇలాంటి వ్యక్తికి సినిమా చేస్తే బావుటుందని ఆయన్ను అడిగాను. అడగ్గానే ఒప్పుకున్నందుకు ఆయనకు థాంక్స్‌. ఓ డెబ్యూ డైరెక్టర్‌ని నమ్మి.. ఓస్టార్‌ డైరెక్టర్‌తో సినిమాకు ఎంత ఖర్చు పెడతారో.. అంతకంటే రూపాయి ఎక్కువగానే ఖర్చు పెట్టారు. అలాగే మనుషుల్లో నాకు ఇష్టమైన వ్యక్తి నాగబాబుగారు. నాకు నచ్చిన వ్యక్తికి సినిమా చేసే స్థాయికి వచ్చాను. అందుకు కారణం అభిమానులే. బన్నీ వాసు నేను పెట్టే ఇబ్బందులను భరించి సినిమాకు సపోర్ట్‌ చేశాడు. తనకు కూడా ఈ సందర్భంగా థాంక్స్‌. టెక్నీషియన్స్‌లో రైటర్స్‌ సీతారామశాస్త్రిగారు, రామజోగయ్యశాస్త్రిగారికి థాంక్స్‌. ఆర్ట్‌ డైరెక్టర్‌ రాజీవ్‌గారు, సినిమాటోగ్రాఫర్‌ రాజీవ్‌రవిగారికి థాంక్స్‌. విశాల్‌ శేఖర్‌గారు మేం ఊహించిన దానికంటే అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇప్పటి వరకు అర్జున్‌గారిని ఈ సినిమాలో చూస్తారు. ఆయనతో పనిచేయడాన్ని గౌరవంగా భావిస్తారు. శరత్‌కుమార్‌, రావు రమేశ్‌, అనూప్‌ సింగ్‌, హరీశ్‌ ఉత్తమన్‌ సహా అందరికీ థాంక్స్‌. ఒక హానెస్ట్‌ సినిమా చేయాలనే కోరిక చాలా రోజులుగాఉండేది. ఆయన కథ చెప్పిన క్షణం, నా కథ కలిసిన క్షణమే అదృష్టం. రేపు సినిమా సక్సెస్‌ అయితే వంద కారణాలుంటే.. ఆ కారణాలన్నీ ఆయనే. ఆయన్ను బ్లైండ్‌గా నమ్మి సినిమా చేశాను. సక్సెస్‌ఫుల్‌ మూవీ వస్తే ఆ క్రెడిట్‌ అంతా ఆయనకే దక్కుతుంది. ఈ సినిమా చేయడం పట్ల గర్వంగా ఫీలవుతున్నాను. చరణ్‌ ఈ వేడుకకి ముఖ్య అతిథిగా వచ్చినందుకు తనకు స్పెషల్‌ థాంక్స్‌. తను చేసిన రంగస్థలం సినిమా వల్ల బయ్యర్స్‌లో ఓ పాజిటివ్‌ మూడ్‌ క్రియేట్‌ అయ్యింది. అలాగే దాన్ని కంటిన్యూగా భరత్‌ అనే నేను సక్సెస్‌ అయ్యింది. మహేశ్‌గారికి, కొరటాలగారికి ఈ సందర్భంగా అభినందనలు. అలాగే రేపు రాబోయే నా సినిమా కూడా మంచి సక్సెస్‌ను సాధిస్తుందని నమ్మకంగా ఉన్నాను. మా సినిమాయే కాదు. మా తర్వాత రాబోయే సినిమాలు మహానటి, మెహబూబా సినిమాలకు ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

వక్కంతం వంశీ మాట్లాడుతూ - ''ఒక మనిషిగా కల కంటే.. ఆ కలను నేరవేర్చడానికి ఎన్నో చేతులు కలిస్తే కానీ ఇక్కడ నిలబడ్డాను. మంచి కథ రాసుకున్నాను. బన్నిగారికి కథ ఎలా చెప్పాలని అనుకుంటూ ఉంటే మా అన్న నల్లమలుపు బుజ్జిగారే కారణం. ఆయనకు థాంక్స్‌. ఈ సందర్భంగా నా తల్లిదండ్రులు, నా భార్యతో పాటు నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన గురువుగారు దర్శకరత్న దాసరిగారికి థాంక్స్‌. ఆయన ఈ సినిమాని చూస్తారని అనుకున్నాను. కానీ మన మధ్య లేరు. అయితే ఆయన పుట్టినరోజున సినిమా విడుదలవుతుండటం ఆనందంగా ఉంది. ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్‌లో ముందుగా చెప్పుకోవాల్సిన వ్యక్తి రాజీవ్‌ రవి. ఎన్నో గొప్ప సినిమాలు చేసిన వ్యక్తి. ఎంతో సపోర్ట్‌ చేశారు. అలాగే ప్రొడక్షన్‌ డిజైనర్‌ రాజీవన్‌గారికి థాంక్స్‌. నా చీఫ్‌ కో డైరెక్టర్‌ శివకు థాంక్స్‌. అలాగే బన్నీవాసుగారు ఎంతో కంఫర్ట్‌ను క్రియేట్‌ చేసి టెన్షన్‌ తనే తీసుకున్నారు. అలాగే బన్నితో సినిమా చేయాలని ఏరోజు ఎంత ఖర్చు పెడుతున్నామని కాకుండా మంచి సినిమా తీయాలని నన్ను నమ్మి సినిమా చేసిన లగడపాటి శ్రీధర్‌గారికి, నాగబాబుగారికి థాంక్స్‌. ఇంత పెద్ద లెక్కలు వేసుకునే ఈరోజుల్లో బన్ని ఓ కొత్త డైరెక్టర్‌ని నమ్మి..వాడి చేతిలో మెగాఫోన్‌ పెట్టి సినిమా చేయడమంటే చిన్న విషయం కాదు. కథ నచ్చింది.. నమ్మారు. సినిమా చేశారు. మంచి సినిమా చేశాననే తృప్తిగా ఉంది. ఆయన నమ్మకాన్ని నిలబెట్టాననే అనుకుంటున్నాను. బన్నీ పని రాక్షసుడు. ప్రతిషాట్‌ను కష్టపడి సొంతంగా చేశారు. ఒక ఆకలితో ఉన్న పులిలా కనపడతారు. సినిమాలో బోర్డర్‌కి వెళ్లాలనే ఆయన లక్ష్యం కోసం ఆయన పడ్డే కష్టమే ఈ సినిమా. ఇక ప్రత్యేకంగా యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌గారి గురించి చెప్పాలి. ఆయన కథ విన్న తర్వాత.. ఎంతో సపోర్ట్‌ చేశారు. అలాగే శరత్‌కుమార్‌, నదియా, బోమన్‌ ఇరాని, హరీశ్‌ ఉత్తమన్‌, అనూప్‌సింగ్‌ ఇలా మంచి నటీనటులు నటించారు. అందరినీ అలరించే కమర్షియల్‌ అంశాలున్న సినిమా. ప్రేక్షకులు గర్వంగా తలెత్తుకుని బయటకు వస్తారు. నేను మంచి సినిమా చేశానని నమ్మకంగా చెబుతున్నాను. అందుకు కారనం బన్నీ గారే'' అన్నారు.

కె.నాగబాబు మాట్లాడుతూ - ''సినిమా నిర్మాణం మానేద్దాం అని అనుకుంటున్నప్పుడు.. అరవింద్‌గారు పిలిచి నువ్వు శ్రీధర్‌గారితో కలిసి సినిమా చేయమని చెప్పారు. ఆయన కేవలం సినిమానే కాదు.. నమ్మకాన్ని కూడా ఇచ్చాడు. నేను బన్ని మినహా మా ఫ్యామిలీలో అందరితో సినిమాలు చేశాను. బన్నితో సినిమా చేయలేనేమో అనుకున్నాను. ఇప్పటికీ కుదిరింది. తను చాలా మంచి వ్యక్తి. తన మంచితనమే తనకు రక్షణనిస్తుంది. వంశీ మంచి స్క్రిప్ట్‌ రైటర్‌. కథ విన్నాను. చాలా బాగా స్క్రిప్ట్‌ చేశాడు. తొలి సినిమానే అయినా మంచి విజువల్స్‌తో సినిమా చేశాడు. ఈ సినిమాలో బన్ని ఆకలితో ఉన్న పులిలాగా కనపడతాడు'' అన్నారు.

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ మాట్లాడుతూ - ''నేను ప్రతి ఇండస్ట్రీలో తిరుగుతుంటాను. ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీ గురించే అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అందుకు కారణం మన సక్సెస్‌ రేట్‌.. అందుకు కారణం ప్రేక్షకులే. ఈ సినిమాలో భిన్నమైన క్యారెక్టర్‌లో కనపడతాను. మంచి పాత్ర ఇచ్చినందుకు డైరెక్టర్‌గారికి థాంక్స్‌. వండర్‌ఫుల్‌ కమర్షియల్‌ స్టైలిష్‌ మీనింగ్‌ఫుల్‌ మూవీ. వంశీగారు సక్సెస్‌ఫుల్‌ రైటర్‌గానే కాదు.. దాన్ని అంత కంటే చక్కగా తెరపై ప్రెజంట్‌ చేశారు. జెంటిల్‌మేన్‌లో శంకర్‌తో చేసిన ఫీలింగ్‌ వచ్చింది. బన్ని వండర్‌ఫుల్‌, డేడికేటర్‌ యాక్టర్‌. వారి డేడికేషన్‌ కారణంగానే ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నారు. బన్ని అద్భుతంగా చేశాడు. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్‌'' అన్నారు.

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ - ''కథను విన్న బన్ని ఎగ్జయిట్‌ అయ్యి ఈ సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. వంశీ సినిమాను ఇంత బాగా చేస్తాడని మేం అనుకోలేదు. డైరెక్టర్‌ని నమ్మి సినిమా చేశాడు బన్ని. దాసరినారాయణరావుగారి పుట్టినరోజున సినిమా విడుదల కావడం ఆనందంగా ఉంది. డైరెక్టర్స్‌ డేరోజు సినిమా విడుదలవుతుంది. ఫిలిమ్‌ ఇండస్ట్రీ బాధపడేలా కొన్ని విషయాలు జరిగాయి. ఆ విషయాలపై కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఆ నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొందరు ఈ సినిమాను తప్పు దోవ పట్టించడానికో, విమర్శించడానికో ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నాన్ని ప్రేక్షకులే దాటించాలి.. దాటిస్తారు. అర్జున్‌గారు అద్భుతమైన క్యారెక్టర్‌ చేశారు. మిగిలిన విషయాలను సక్సెస్‌ మీట్‌లో మాట్లాడుతాను'' అన్నారు.

నిర్మాత లగడపాటి శ్రీధర్‌ మాట్లాడుతూ - ''ఇంత మంచి సినిమా చేసే అవకాశం వచ్చినదానికి కారణం బన్నియే. నన్ను నా వెనుక ఉండి.. మా అమ్మ రామలక్ష్మిగారు, శిరీషాగారు ప్రోత్సాహం అందిస్తున్నారు. 'ఎవడి గోలవాడిదే', 'స్టైల్‌' సినిమాలు చూసిన బన్ని ఓ పార్టీలో నాకు కాంప్లిమెంట్‌ ఇస్తే 'ఏం చేస్తాం బన్ని మీలాంటిస్టార్స్‌తో సినిమాలు చేస్తే బావుంటుంద'ని నేను అన్నాను. పదేళ్ల క్రితం బన్ని ఇచ్చిన మాట కోసం ఈ సినిమా చేశారు. అంత కన్నా గొప్ప అవార్డు మరోటి లేదనిపించింది. నా తుది శ్వాస వరకు సినిమాల్లోనే ఉండాలనిపించింది. ఈ సినిమాను తెలుగు సినిమా చరిత్రలోనే నిలిచిపోయేలా ప్రేక్షకులు చేస్తారు. వక్కంతం వంశీగారు అద్భుతమైన కథ ఇచ్చారు. అంతే కాదు.. చక్కగా తెరకెక్కించారు. సామాజిక బాధ్యత ఉన్న సినిమా ఇది. వారికి జీవితాంతం రుణపడి ఉంటాను. భవిష్యత్‌లో తను ఎప్పుడంటే అప్పుడు ఎంత పెద్ద బడ్జెట్‌ మూవీ అయినా చేద్దామంటే నేను సిద్ధంగా ఉంటాను'' అన్నారు.



Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved