సుధీర్ బాబు, నబా నటేశ్ జంటగా.. సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఆర్.ఎస్.నాయుడు దర్శకత్వం వహించిన చిత్రం `నన్ను దోచుకుందువటే`. ఈ చిత్రం సెప్టెంబర్ 21న విడుదలవుతుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో..
నిర్మాత రాజీవ్ మాట్లాడుతూ - ``నిర్మాతగా సుధీర్ చేస్తున్న తొలి చిత్రమిది. తనకు హీరో, నిర్మాతగా సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను.ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్`` అన్నారు.
రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ - ``సుధీర్ `సమ్మోహనం` తర్వాత మరో లవ్‌స్టోరీ చేయడం బావుంది. ప్యాషన్‌తో హీరోగానే కాదు.. సినిమా ప్రొడ్యూస్ చేసినందుకు సుధీర్‌ను అభినందిస్తున్నాను. డైరెక్టర్ రాజశేఖర్ సహా ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్`` అన్నారు.
కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ - ``నటుడిగానే కాదు.. కొత్తగా ప్రొడక్షన్‌లో ఎంట్రీ ఇస్తున్న సుధీర్‌గారికి అభినందనలు. మంచి సక్సెస్‌ను అందుకోవాలి`` అన్నారు.
శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ - ``మా బ్యానర్‌లో సమ్మోహనం వంటి హిట్ తర్వాత సుధీర్‌గారు తన స్వంత బ్యానర్‌లో చేస్తున్న చిత్రమిది. సినిమా సాంగ్స్, లుక్ బావుంది. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ - ``సుధీర్ నా దృష్టిలో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్. అతని పొటెన్షియల్‌ను తెలుగు ఇండస్ట్రీ తక్కువగా వాడుకుంటుందని అనుకుంటున్నాను. తన పొటెన్షియల్ బయటపెట్టే మంచి స్క్రిప్ట్స్ రావాలని కోరుకుంటున్నాను. చాలా మంది బ్రిలియంట్ యాక్టర్స్ ఉన్నారు. అలాంటి వాళ్లలో సుధీర్ ఒకరు. వారి కోసం మంచి కథలు రాయాలని కోరుతున్నాను. తను ఇప్పుడు నిర్మాతగా కూడా జర్నీ స్టార్ట్ చేశాడు. దర్శకుడు ఆర్.ఎస్.నాయుడుగారికి, టీమ్‌కు అభినందనలు`` అన్నారు.
అనీల్ సుంకర మాట్లాడుతూ - ``నిర్మాతగా సుధీర్‌బాబుకి అభినందనలు. తనకున్న ప్యాషన్‌తో కచ్చితంగా సక్సెస్ అవుతాడు. సమ్మోహనం తర్వాత నెక్స్‌ట్ లెవల్‌కు రీచ్ అయ్యాడు. సమ్మోహనంకు కంటిన్యూస్‌గా చేస్తున్న సినిమా. సినిమాపై మంచి అంచనాలున్నాయి. యూనిట్ సభ్యులందరికీ అభినందనలు`` అన్నారు.
సందీప్‌కిషన్ మాట్లాడుతూ - ``నటుడు ప్రొడ్యూసర్ అయితే.. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కారు. అదే దారిలో ఈ కథకు ఎంత బెస్ట్ చేయగలరో అంతే చేసుంటారని తెలుసు. దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు సినిమాను చక్కగా హ్యాండిల్ చేశాడు. నభా మంచి ఎక్స్‌ప్రెసివ్ అమ్మాయి. ఈ సినిమా బాగా వచ్చిందని ఎడిటర్ ప్రసాద్ చెప్పాడు. తను చెప్పాడంటే కచ్చితంగా సినిమా పెద్ద హిట్ అవుతుంది`` అన్నారు.
హరీశ్ శంకర్ మాట్లాడుతూ - ``సాఫ్ట్‌వేర్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేసి నన్నుదోచుకుందువటే అనే టైటిల్ పెట్టాడంటే... డైరెక్టర్ స్పాన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. బాగి సినిమాలో సుధీర్ స్క్రీన్ ప్రెజన్స్‌కి నేను ఫ్యాన్ అయితే.. సమ్మోహనం సినిమాలో తన పెర్ఫామెన్స్‌కు ఫ్యాన్ అయ్యాను. అజనీష్ ట్యూన్ సెన్స్ బావుంది. సురేశ్ ఫోటోగ్రఫీ కాంటెంపరరీగా ఉంది. నభా నటేశ్ చాలా ఎక్స్‌ప్రెసివ్ హీరోయిన్. సుధీర్ ప్యాషన్‌తోనే సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇదే ప్యాషన్ తనను ఇంకా ముందుకు తీసుకెళుతుంది. తెలుగు సినిమా మారుతుంది. మంచి కంటెంట్ సినిమాలు మంచి సక్సెస్‌లు సాధిస్తున్నాయి. ఈ సినిమా విషయానికి వస్తే కామెడీగా స్టార్టయ్యి ఎమోషనల్‌గా ఎండ్ అయింది. సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలి`` అన్నారు.
చిత్ర దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు మాట్లాడుతూ - ``సినిమా చాలా బాగా తీశాం. నేను చేసిన పదిహేను నిమిషాల షార్ట్‌ఫిలిం చూసి నచ్చడంతో సుధీర్‌బాబుగారు సినిమా ప్రొడ్యూస్ చేశారు. ఆల్ రెడీ ప్రూవ్ చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత సుధీర్‌బాబు నటుడిగా సమ్మోహనంతో తనెంటో నిరూపించారు. ఈ సినిమాతో ఆయన పెర్ఫామెన్స్ గురించి ఇంకా మాట్లాడుకుంటారు. నభా నటేశ్ ఎనర్జిటిక్ గర్ల్. మంచి పెర్ఫామర్. మా కెమరామెన్ సురేశ్, ఎడిటర్ ఛోటా కె.ప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ అందరూ చక్కగా సపోర్ట్ చేశారు`` అన్నారు.
నభా నటేశ్ మాట్లాడుతూ - ``ఇంత మంచి సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన సుధీర్‌బాబుగారికి థాంక్స్. ఎంతో కంఫర్ట్ జోన్ ఇచ్చారు. మంచి పెర్ఫామరే కాదు.. మంచి నిర్మాత కూడా. నా కోసం సిరి అనే రోల్‌ను రాసిన డైరెక్టర్‌గారికి థాంక్స్. టీమ్ అందరూ ఎంతగానో సపోర్ట్ చేశారు. అందరికీ థాంక్స్`` అన్నారు.
సుధీర్ బాబు మాట్లాడుతూ - ``మా ప్రొడక్షన్‌లో తొలి సినిమా. ఆర్.నాయుడుగారు కథ చెప్పినప్పుడు హీరో సుధీర్‌తో పాటు ప్రొడ్యూసర్ సుధీర్‌కి కూడా కథ బాగా నచ్చేసింది. నభా నటేశ్ చాలా మంచి పెర్ఫామర్. హీరోగా చేస్తూ నిర్మాతగా చేయడం అంటే డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్. బాగాఎంజాయ్ చేశాను. నాకొక కొడుకో, కూతురో పుట్టినట్టుగా ఉంది. మా అమ్మగారి పేరు పెట్టి సినిమా చేస్తున్నాననే టెన్షన్ ఉండేది. సినిమా అవుట్‌పుట్ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. డైరెక్టర్ ఆర్.ఎస్.నాయుడు చాలా మెతక మనిషి అనుకుంటాం. కానీ సినిమా చూసిన తర్వాత ఏం సినిమా చేశాడు అనుకుంటాం. అంత చక్కగా మూవీని డైరెక్ట్ చేశాడు. చందమామ కథలకు సినిమాటోగ్రఫీ అందించిన సురేశ్.. మా సినిమాకు పనిచేయడం ఆనందంగా ఉంది. టెరిఫిక్ విజువల్స్ అందించాడు. అలాగే ఆర్ట్ డైరెక్టర్ శ్రీకాంత్‌కి, ఎడిటర్ ఛోటా కె.ప్రసాద్‌కి థాంక్స్. అజనీష్ ప్రతి సాంగ్‌ను డిఫరెంట్‌గా కంపోజ్ చేసిచ్చాడు. అద్భుతమైన ఆర్.ఆర్‌తో సినిమాను నెక్స్‌ట్ లెవల్‌కు తీసుకెళ్లాడు. నభా బ్రిలియంట్ పెర్ఫామర్. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్`` అన్నారు.