pizza
Ninnu Kori pre-release function
`నిన్ను కోరి` ఆడియో ఆవిష్కరణ
You are at idlebrain.com > News > Functions
Follow Us

29 June 2017
Hyderabad

వరుస సక్సెస్‌లతో డబుల్‌ హ్యాట్రిక్‌ సాధించిన నేచురల్‌ స్టార్‌ నాని తాజాగా 'నిన్ను కోరి' చిత్రంతో ట్రిపుల్‌ హ్యాట్రిక్‌కి శ్రీకారం చుట్టబోతున్నారు. నాని, నివేద థామస్‌ సూపర్‌హిట్‌ కాంబినేషన్‌లో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌.ఎల్‌.పి., కోన ఫిల్మ్‌ కార్పోరేషన్‌ సంయుక్తంగా శ్రీమతి డి. పార్వతి సమర్పణలో శివ నిర్వాణని దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాత దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'నిన్నుకోరి'. గోపీ సుందర్‌ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలోని పాటలకి అదిరిపోయే రెస్పాన్స్‌ వస్తోంది. ముఖ్యంగా 'బ్రేకప్‌,, అడిగా.. అడిగా, 'ఒన్స్‌ అప్‌ ఆన్‌ ఎ టైమ్‌' పాటలు సూపర్‌హిట్‌ అయి సంగీత ప్రియుల్ని విశేషంగా అలరిస్తున్నాయి. ఈ చిత్రం థియేట్రికల్‌ ట్రైలర్‌కి ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ వస్తోంది. దాంతో రిలీజ్‌కి ముందే ఈ చిత్రంపై ఇండస్ట్రీలోనూ, ఆడియన్స్‌లో పాజిటివ్‌ బజ్‌ ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం జూలై 7న గ్రాండ్‌గా రిలీజ్‌ అవుతుంది. కాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ జూన్‌ 29న హైదరాబాద్‌ జె.ఆర్‌.సి. కన్వెన్షన్‌ సెంటర్‌లో చిత్ర ప్రముఖులు, అభిమానుల మధ్య అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆలిండియా డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.రాజమౌళి, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ, ప్రముఖ దర్శకులు కళ్యాణ్‌ కృష్ణ, హను రాఘవపూడి, బి.వి.ఎస్‌.రవి, అవసరాల శ్రీనివాస్‌, ప్రముఖ నిర్మాతలు డి.సురేష్‌బాబు, కె.ఎల్‌.దామోదరప్రసాద్‌, ఎన్‌.వి.ప్రసాద్‌, జెమిని కిరణ్‌, సాయి కొర్రపాటి, కృష్ణలతో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.

'నిన్ను కోరి' చిత్రంలోని ఒక్కొక పాటను ఒక్కో అతిథి రిలీజ్‌ చేయగా, పాటల విజువల్స్‌ని స్క్రీన్‌పై ప్రజెంట్‌ చేశారు. ఈ పాటల్ని గాయనీగాయకులు ఆలపించి వీక్షకుల్ని అలరించారు. సూపర్‌హిట్‌ అల్బమ్‌నిచ్చిన సంగీత దర్శకుడు గోపీ సుందర్‌, ఆయన సతీమణిని నిర్మాత దానయ్య, కోన వెంకట్‌ శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. 'నిన్ను కోరి' ఆడియో సీడిని సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ రిలీజ్‌ చేయగా మ్యాంగో మ్యూజిక్‌ ద్వారా ఆడియో మార్కెట్‌లో రిలీజ్‌ అయ్యింది. 'నిన్ను కోరి' పెన్‌ డ్రైవ్‌ పోస్టర్‌ని స్టార్‌ ప్రొడ్యూసర్‌ డి.సురేష్‌బాబు లాంచ్‌ చేశారు. జూలై 7న రిలీజ్‌ కానున్న 'నిన్ను కోరి' చిత్రం ఫస్ట్‌ డే ఉదయం 8.45 షో ఫస్ట్‌ టిక్కెట్‌ని ఎస్‌.ఎస్‌.రాజమౌళి లాంచ్‌ చేశారు.

ఆలిండియా డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.రాజమౌళి మాట్లాడుతూ - ''ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో టికెట్‌ లాంచ్‌ చేసే ఐడియా చాలా బాగుంది. 'నిన్ను కోరి' థియేట్రికల్‌ ట్రైలర్‌ రిలీజ్‌ అయిన వెంటనే చూశాను. ఇమ్మీడియెట్‌గా రెండోసారి, మూడోసారి, నాలుగోసారి చూశాను. ఆ తర్వాత ఏంటి ఇన్నిసార్లు చూస్తున్నానని నా బ్రెయిన్‌ అంచనా వేయడం మొదలు పెట్టింది. ప్రొడక్షన్‌ వేల్యూస్‌ చాలా బాగున్నాయి. ట్రైలర్‌ చాలా రిచ్‌గా వుంది. మా దానయ్యగారు బాగా ఖర్చుపెట్టి తీశారు అనుకున్నాను. ఈ ట్రైలర్‌ ఎందుకని ఇన్నిసార్లు చూడాలనిపిస్తుంది అని ఎనలైజ్‌ చేశా. ట్రైలర్‌ చూసిన వెంటనే సినిమా చూడాలనిపించడానికి మెయిన్‌ రీజన్‌ నాని తాలూకా కాన్ఫిడెన్స్‌ అన్పించింది. సూపర్‌ కాన్ఫిడెంట్‌గా కన్పించారు నాని. తను చాలా మంచి యాక్టర్‌ అని అందరికీ తెలుసు. అతని కాన్ఫిడెన్స్‌ లెవెల్స్‌ చాలా బాగా పెరిగాయి. నాని కాన్ఫిడెంట్‌గా యాక్ట్‌ చేయడం బాగా నచ్చింది. నానికి పోటీగా నటించగలిగే అమ్మాయి నివేదా. ఆది చాలా బాగున్నాడు. అతని లుక్స్‌ ఫెంటాస్టిక్‌గా వున్నాయి. సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తోంది. డైరెక్టర్‌ శివ ట్రైలర్‌ చాలా బాగా కట్‌ చేశారు. సాంగ్స్‌ అన్నీ చాలా బాగున్నాయి. గోపీసుందర్‌ ఫెంటాస్టిక్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. సినిమా డెఫినెట్‌గా చాలా పెద్ద హిట్‌ అవుతుంది. ఆల్‌రెడీ దానయ్యగారికి మంచి లాభాలు వచ్చి వుంటాయి. సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్‌, బయ్యర్స్‌ అందరికీ డబ్బులు మిగలాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ మాట్లాడుతూ - ''బెస్ట్‌ టాలెంట్‌ అంతా కలిసి ఒక సినిమాకి పని చేస్తే అది 'నిన్ను కోరి' అవుతుంది. తెలుగు ఇండస్ట్రీలో అమేజింగ్‌ టాలెంట్‌ వున్న హీరో నాని. రెండున్నర గంటలు పాటు నాని సినిమా చూస్తూ నేను చాలా ఎంజాయ్‌ చేస్తాను. సంవత్సరానికి నాని చాలా ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. నేను విన్న మంచి పాటల్లో ఈ ఆల్బమ్‌ ఒకటి. గోపీ సుందర్‌ ఎక్స్‌లెంట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. దానయ్యగారు, కోనగారు ఈ సినిమా లైన్‌ ఒక ఐడియాగా చెప్పారు. చాలా బాగుంది. ఫెంటాస్టిక్‌ స్టోరి. విజువల్స్‌, సాంగ్స్‌ చాలా బాగున్నాయి. సాంగ్స్‌లో కూడా కథ చెప్పారు డైరెక్టర్‌ శివ. ఈ సినిమా చాలా పెద్ద హిట్‌ అవ్వాలి. దానయ్యగారికి, కోనగారికి ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

స్టార్‌ ప్రొడ్యూసర్‌ డి.సురేష్‌బాబు మాట్లాడుతూ - ''జి.ఎస్‌.టి. వచ్చిన తర్వాత తెలుగులో రిలీజ్‌ అవుతున్న ఫస్ట్‌ ఫిల్మ్‌ ఇది. దీని వల్ల ఇండస్ట్రీకి ఎంత మేలు జరుగుతుందనేది ఇంకా డిస్కషన్స్‌ జరుగుతున్నాయి. ఈ సినిమా మా వాళ్లే కొన్నారు. ఈ సినిమా బాగా ఆడాలి. నాని సక్సెస్‌ఫుల్‌ హీరో. దానయ్యగారికి, కోనాకి ఈ సినిమా పెద్ద హిట్‌ కావాలి. టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

ప్రముఖ నిర్మాత ఎన్‌.వి.ప్రసాద్‌ మాట్లాడుతూ - ''నాని నిర్మాతల హీరో. చిన్నప్పుడు ఎన్‌.టి.రామారావుగారి సినిమాలు, కృష్ణగారి సినిమాలు నెలకొకటి రిలీజ్‌ అయితే చూశాం. ఇప్పుడు నాని సంవత్సరానికి 4 సినిమాలు చేస్తున్నాడు. ఇంకా 5 సినిమాలు చేసి నిర్మాతలని ఫుల్‌ఫిల్‌ చేసి ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చెయ్యాలి. ఈ సినిమా సెన్సేషనల్‌ హిట్‌ అయ్యి నిర్మాత దానయ్యగారికి, కోన వెంకట్‌గారికి మంచి లాభాలు రావాలి'' అన్నారు.

దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ - ''కృష్ణగాడి వీర ప్రేమగాథ' తర్వాత నేనొక లవ్‌స్టోరీ చేద్దామని నానికి కథ చెప్పాను. అప్పుడే నాని 'నిన్ను కోరి' సినిమా ఐడియా గురించి చెప్పాడు. అందులో స్పెషల్‌గా ఒక సీన్‌ అద్భుతంగా వుంది. అది విన్నప్పుడు నాకు హృషికేష్‌ ముఖర్జీ గుర్తొచ్చారు. శివ ఎక్స్‌ట్రార్డినరీగా ఆ సీన్‌ రాశాడు. చాలా చాలా మంచి సినిమా ఇది'' అన్నారు.

దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ మాట్లాడుతూ - ''టాలెంట్‌, హార్డ్‌వర్క్‌తో నాని వరుసగా సక్సెస్‌లు సాధిస్తున్నాడు. ఆడియన్స్‌కి లవబుల్‌ హీరో, నిర్మాతలకి ప్రాఫిటబుల్‌ హీరో. డైరెక్టర్స్‌కి డిపెండబుల్‌ హీరో నాని అని నేను ఫీలవుతున్నాను. ఏ క్యారెక్టర్‌ అయినా నానిని చూసి రాసుకోవచ్చు. డైరెక్టర్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేసిన దానికన్నా ఎక్కువగా చేస్తాడు అని నా నమ్మకం. రైటర్స్‌, డైరెక్టర్స్‌ ఒక క్యారెక్టర్‌ అనుకొని ఆదిని ఊహించుకుంటే ఇంకా ఎక్కువ రాయడానికి ఇన్‌స్పిరేషన్‌ కలుగుతుంది'' అన్నారు.

Nivetha Thomas Glam gallery from the event

నేచురల్‌ స్టార్‌ నాని మాట్లాడుతూ - ''గోపీసుందర్‌గారు నా మూడు సినిమాలకి మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. దానయ్యగారు, కోనగారు, శివ, కార్తీక్‌, ప్రవీణ్‌, చిన్నా మా యాక్టర్స్‌ అందరికీ థాంక్స్‌. కొన్ని సినిమాలు చూసి అక్కడే వదిలేస్తారు. ఈ సినిమాని ఇంటికి తీసుకెళ్లి మనసులో దాచుకుంటారు. ఇది నిజం కాకపోతే అందరికీ అడిగే హక్కు వుంటుంది. ఆ ఛాన్స్‌ ఎవరికీ రాదు. నేను ఇంతవరకూ చేసిన సినిమాల్లో ఎక్కువ ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయి చేసిన సినిమా ఇదే'' అన్నారు.

నటుడు ఆది పినిశెట్టి మాట్లాడుతూ - ''నిన్ను కోరి' నా లైఫ్‌లో వెరీ స్పెషల్‌ జర్నీ. 'సరైనోడు' తర్వాత తమిళ్‌ ఫిలింస్‌ చేస్తున్నప్పుడు చాలా కథలు వినడం జరిగింది. డిఫరెంట్‌ ఫిలింస్‌, మంచి సినిమాలు చేయాలనుకుంటున్న సమయంలో ఒకరోజు శివ, కోన వెంకట్‌ ఇద్దరూ వచ్చి కథ చెప్పారు. విన్న వెంటనే ఈ సినిమా నేను చేస్తున్నాను అని చెప్పి వెళ్లిపోయాను. ఇట్స్‌ ఎ అన్‌టోల్డ్‌ స్టోరి. ప్రతి సినిమా ఒక చోట ఎండ్‌ అవుతుంది. ఈ సినిమా అక్కడ నుండి స్టార్ట్‌ అవుతుంది. జూలై 7న రిలీజ్‌ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

సంగీత దర్శకుడు గోపీసుందర్‌ మాట్లాడుతూ - ''నిన్ను కోరి' సబ్జెక్ట్‌ వినగానే చాలా ఇన్‌స్పైర్‌ అయ్యాను. డైరెక్టర్‌ శివ తనకి కావాల్సిన ట్యూన్స్‌ని రాబట్టుకున్నారు. నానితో నాకు మూడవ సినిమా. మా కాంబినేషన్‌లో వచ్చిన 'భలే భలే మగాడివోయ్‌' 'మజ్ను' సినిమాలు మ్యూజికల్‌ హిట్స్‌ అయ్యాయి. ఇప్పుడు 'నిన్ను కోరి' చేశాను. ఈ సినిమా రిలీజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాను. టెక్నీషియన్స్‌ అందరూ ఈ చిత్రానికి చాలా కష్టపడి వర్క్‌ చేశారు'' అన్నారు.

హీరోయిన్‌ నివేద థామస్‌ మాట్లాడుతూ - ''జెంటిల్‌మెన్‌' తర్వాత నానితో చేస్తున్న సెకండ్‌ ఫిల్మ్‌ ఇది. నానికి నేను పెద్ద ఫ్యాన్‌ని. డైరెక్టర్‌ శివ ఫెంటాస్టిక్‌గా డైరెక్ట్‌ చేశారు. శివ నుండి నేను చాలా నేర్చుకున్నాను. ఈ చిత్రంలో కొత్త ఆదిని చూస్తారు. ఒక మంచి ఫిల్మ్‌ చేసామన్న నమ్మకం వుంది'' అన్నారు.

కోన ఫిల్మ్‌ కార్పోరేషన్‌ అధినేత కోన వెంకట్‌ మాట్లాడుతూ - ''ఈ సినిమాకి మెయిన్‌ పిల్లర్స్‌ నలుగురు. డైరెక్టర్‌ శివ, హీరో నాని, నివేద థామస్‌, ఆది వీళ్ల నలుగురి కాంబినేషన్‌లో సినిమా రన్‌ అవుతూ వుంటుంది. యు.ఎస్‌.లోనే 40 డేస్‌ షూటింగ్‌ చేశాం. సినిమా విజువల్స్‌ చాలా బాగా వచ్చాయి. దానయ్యగారు కమర్షియల్‌ ఫిలింస్‌ తియ్యడంలో దిట్ట. హార్ట్‌ టచ్చింగ్‌, లవబుల్‌ ఫిలింస్‌ తీయడంలో కూడా ఆయనకొక డిఫరెంట్‌ టేస్ట్‌ వుంది. ఈ సినిమా ఇంత బాగా రావడానికి గొప్ప సపోర్ట్‌ చేశారు'' అన్నారు.

చిత్ర దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ - ''6, 7 సంవత్సరాలుగా నాని నా కథలతో జర్నీ చేస్తూనే వున్నాడు. ఫైనల్‌గా ఈ సంవత్సరం నానితో సినిమా కుదిరింది. ఆయనతో ఎక్కడో ఏదో ఒక ఎమోషనల్‌ కనెక్షన్‌ వుండేది. ఈ కథ నానికి చెప్పినప్పుడు ఆయన కళ్లలోంచి ఒక నీటి చుక్క చూసాను. ఈ చిత్రంలో నాని నటించిన ఉమామహేశ్వరరావు క్యారెక్టర్‌, ఆది క్యారెక్టర్‌, నివేద క్యారెక్టర్‌ ప్రేక్షకులను కొన్నేళ్ల వరకు వెంటాడుతూనే వుంటాయి. ముగ్గురూ క్యారెక్టర్స్‌లో ఇన్‌వాల్వ్‌ అయి నటించారు. కార్తీక్‌ ఘట్టమనేని అద్భుతమైన ఫొటోగ్రఫీ అందించారు. విజువల్స్‌ చాలా బాగా వచ్చాయి. గోపీ సుందర్‌గారు బ్యూటిఫుల్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. కోనగారు ఎంతో సపోర్ట్‌ చేశారు. ఆదిగారు వెర్సటైల్‌ ఆర్టిస్ట్‌. ఏ క్యారెక్టర్‌ ఇచ్చినా ఫెంటాస్టిక్‌గా చేయగల యాక్టర్‌ ఆది. నాని, నివేదితల మధ్య కెమిస్ట్రీ సీన్స్‌ బాగా వర్కవుట్‌ అయ్యాయి. దానయ్యగారు ఫస్ట్‌నుండి ఎంకరేజ్‌ చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. అందరికీ నచ్చుతుంది'' అన్నారు.

ఆది పినిశెట్టి, మురళీశర్మ, తనికెళ్ళ భరణి, పృథ్వీ, రాజశ్రీనాయర్‌, నీతు, భూపాల్‌రాజ్‌, కేదార్‌శంకర్‌, పద్మజ, ప్రియాంక నాయుడు, మాస్టర్‌ నేహంత్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు: కోన వెంకట్‌, సంగీతం: గోపీసుందర్‌, ఫోటోగ్రఫీ: కార్తీక్‌ ఘట్టమనేని, ఆర్ట్‌: చిన్నా, స్టైలింగ్‌: నీరజ కోన, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీజో, కో-డైరెక్టర్‌: లక్ష్మణ్‌ ముసులూరి, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: సత్యం గుగ్గిల, నిర్మాత: దానయ్య డి.వి.వి., కథ, దర్శకత్వం: శివ నిర్వాణ.



Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved