pizza
Sammohanam pre release function
'సమ్మోహనం' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


10 June 2018
Hyderabad

సుధీర్‌బాబు, అదితీరావు హైదరి జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మించిన చిత్రం 'సమ్మోహనం'.

జూన్‌ 15న ఈ చిత్రం విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఆదివారం ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ హైదరాబాద్‌ జె.ఆర్‌.సి.కన్వెన్షన్‌లో జరిగింది. సినిమా రిలీజింగ్‌ డేట్‌ పోస్టర్‌ను కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సూపర్‌స్టార్‌ మహేశ్‌ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సుధీర్‌ బాబు, అదితిరావు హైదరి, ఇంద్రగంటి మోహనకృష్ణ, శివలెంక కృష్ణ ప్రసాద్‌, కొరటాల శివ, హరీశ్‌ శంకర్‌, వంశీ పైడిపల్లి, దిల్‌రాజు, వివేక్‌ సాగర్‌, ఎస్‌.వి.కృష్ణారెడ్డి, కె.అచ్చిరెడ్డి, తనికెళ్లభరణి, విజయ్‌, వెంకట్‌ రెడ్డి, సీనియర్‌ నరేశ్‌, పవిత్రా లొకేష్‌, అమిత్‌ పురోహిత్‌, కాదంబరి కిరణ్‌, రామజోగయ్యశాస్త్రి, రమేశ్‌ రెడ్డి, పి.జి.విందా, శ్రీరామ్‌ రెడ్డి, రాజశేఖర్‌ నాయుడు, అబ్బూరి రవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా..

సూపర్‌స్టార్‌ మహేశ్‌ మాట్లాడుతూ - ''సుధీర్‌ నా ఫంక్షన్స్‌లో బాగా మాట్లాడుతుంటాడు. ఏమో తన ఫంక్షన్స్‌లో సెంటిమెంటల్‌ అయిపోతున్నాడు. సినిమాలో సూపర్‌హిట్‌ వైబ్స్‌ కనపడుతున్నాయి. నరేశ్‌గారు ఈ ఏడాది వన్‌ ఆఫ్‌ ది బిగ్గెస్ట్‌ హిట్‌ అవుతుందని నాకు ఇప్పుడే చెప్పారు. సినిమా గురించి మంచి రిపోర్ట్స్‌ క్యారీ అవుతున్నాయని పొద్దున దిల్‌రాజుగారు కూడా చెప్పారు. చాలా ఆనందంగా ఉంది. ఇలా ఆడియో ఫంక్షన్స్‌కి రావడం తప్ప.. సుధీర్‌కి మేమేం ఎలాంటి సపోర్ట్‌ ఇవ్వలేదు. తనకు తాను పని చేసుకుంటూ ఇక్కడి వచ్చాడు. ఆ విషయంలో నేను తన గురించి గర్వంగా ఫీల్‌ అవుతున్నాను. మోహనకృష్ణగారు డైరెక్ట్‌ చేసిన అష్మాచెమ్మా నాకు ఫేవరేట్‌ ఫిలిం. అలాగే ఆయన డైరెక్ట్‌ చేసిన జెంటిల్‌మన్‌ కూడా చూశాను. అదితిరావుకు టాలీవుడ్‌లోకి వెల్‌కమ్‌ చెబుతున్నాను. ఎంటైర్‌ యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

సుధీర్‌ బాబు మాట్లాడుతూ - ''జనాలకు ఈ సినిమా రీచ్‌ అవుతుందో లేదోనని చిన్న సందేహం ఉండేది. అయితే మహేశ్‌ ఎప్పుడైతే తన కొత్త లుక్‌తో ఈ వేడుకకి వస్తాడని తెలిసిందో.. మంచి నమ్మకం వచ్చింది. ఇంద్రగంటి మోహనకృష్ణగారుతో మంచి ఎక్స్‌పీరియెన్స్‌ ఇచ్చిన సినిమా. 'సమ్మోహనం' వంటి మంచి సినిమాను నాకు ఇచ్చారు'' అన్నారు.

అదితిరావు హైదరి మాట్లాడుతూ - ''తెలుగులో నా తొలి చిత్రం. సమీర అనే చాలా మంచి పాత్ర చేశాను. ఇంద్రగంటిగారు అద్భుతమైన సమీర పాత్రను నాతో చేయించినందుకు ఆయనకు థాంక్స్‌. సుధీర్‌ అమేజింగ్‌ కోస్టార్‌. విందా, వివేక్‌సాగర్‌ సహా టీమ్‌ సభ్యులకు థాంక్స్‌'' అన్నారు.

ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ - ''2008లో నేను రైలులో వెళుతుంటే ఓ చిన్నపిల్ల పోకిరి డైలాగ్స్‌ చెబుతుంది. ఆ ఐడియాతోనే అష్టాచెమ్మా కథ రాశాను. ఆ సినిమా రాసేటప్పుడు ఓ మ్యాజికల్‌ నేమ్‌ ఉండాలనుకున్న సందర్భంలో ఆ చిన్నపిల్ల మీ పేరుని నాకు ఇన్‌డైరెక్ట్‌గా చెప్పింది. అదే ఏడాది మహేశ్‌గారు పెళ్లి కూడా చేసుకున్నారు. ఆయన పేరులో స్టైల్‌, మత్తు, వైబ్రేషన్స్‌ ఉన్నాయి. ఆ సినిమాకు ఆయన పేరు మ్యాజిక్‌ చేసింది. నా సినిమాకు అంత సపోర్ట్‌ చేసిన మహేశ్‌గారిని నేను వ్యక్తిగతంగా కలిసి ఎప్పుడూ థాంక్స్‌ చెప్పలేదు. ఇప్పటికీ కుదిరింది... థాంక్స్‌ టు మహేశ్‌గారు. 'సమ్మోహనం' నా మనసుకి నచ్చి, ఇష్టపడి చేసిన సినిమా. సుధీర్‌ ఈ సినిమా చేసినందుకు తనకు థాంక్స్‌. తను మాత్రమే చేయగల పాత్ర ఇది. అదితి నటనకు నేను ఫ్యాన్‌ అయ్యాను. కృష్ణప్రసాద్‌గారు నన్ను నమ్మి సినిమాచేశారు. నరేశ్‌గారి రూపంలో మంచి స్నేహితుడు దొరికాడు. వివేక్‌ బ్రిలియంట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. తను తన సంగీతంలో ఈ సినిమాను డిఫైన్‌ చేశారు. ఈ సినిమాలో నటించిన నటీనటులు, పనిచేసిన సాంకేతిక నిపుణులకు థాంక్స్‌. జూన్‌ 15న సినిమా విడుదలవుతుంది'' అన్నారు.

చిత్ర నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్‌ మాట్లాడుతూ - ''మా ప్రిన్స్‌ మహేశ్‌బాబుగారు మా వేడుకకి అతిథిగా రావడం ఆనందంగా ఉంది. బాధ్యతలను మా యూనిట్‌ చక్కగా నిర్వహించి ఓ మంచి సినిమా చేశాం. నెక్స్‌ట్‌ లెవల్‌ మూవీగా అనిపించింది. మంచి పేరు, పేరుతో పాటు డబ్బులు కూడా తెచ్చి పెట్టే సినిమా ఇది. ఈ సినిమాను నిర్మించినందుకు ఆనందంగా ఉంది. థాంక్యూ టు ఆల్‌'' అన్నారు.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ వివేక్‌ సాగర్‌ మాట్లాడుతూ - ''ఇది నాకు స్పెషల్‌ మూవీ. లిరికల్‌ వేల్యూ, మ్యూజికల్‌ వేల్యూ ఉన్న సినిమా చేసే అవకాశం ఇచ్చారు ఇంద్రగంటిగారు. బ్యూటీఫుల్‌ మూవీ'' అన్నారు.

దిల్‌రాజు మాట్లాడుతూ - ''ఇంద్రగంటి మోహనకృష్ణ తీసిన అష్టాచెమ్మా, జెంటిల్‌మన్‌ వంటి ఎన్నో మంచి చిత్రాలను మనకు అందించారు. ఓ సినిమా హీరోయిన్‌ని ఓ సాధారణ కుర్రాడు ప్రేమిస్తే ఏంటి? అనేదే సమ్మోహనం కథ. సినిమా చాలా బావుందని టాక్‌ వినపడుతుంది. డైరెక్టర్‌, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌గారికి, సుధీర్‌బాబు, అదితిరావు హైదరిలకు ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

వంశీ పైడిపల్లి మాట్లాడుతూ - ''ఇంద్రగంటిగారు ఇండస్ట్రీలో తనకంటూ ఓ మార్కుని క్రియేట్‌ చేసుకున్నారు. ఆయన చేసిన సినిమాలను చూస్తే మనకు తెలుస్తుంది. ఆయనకు సమ్మోహనం విడుదల సందర్భంగా అభినందనలు. సుధీర్‌ నాకు మంచి ఫ్రెండ్‌. నేను డైరెక్టర్‌ కాకముందు నుండి తనతో మంచి పరిచయం ఉంది. సుధీర్‌ ఏదీ చేసినా ప్యాషనేట్‌గా చేస్తాడు. తనకు సమ్మోహనం సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది. ఎంటైర్‌ యూనిట్‌కి ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

కొరటాల శివ మాట్లాడుతూ - ''ఈ మధ్య కాలంలో నాకు నచ్చిన టైటిల్స్‌లో 'సమ్మోహనం'. ఒక లవ్‌స్టోరీకి ఇంత కంటే మంచి టైటిల్‌ని పెట్టలేం. ఇంద్రగంటిగారు సెన్సిబుల్‌ డైరెక్టర్‌. ఆయన తీసిన సినిమాలన్నింటిలో ఇది చాలా పెద్ద హిట్‌ అవుతుందని అనుకుంటున్నాను. కాన్సెప్ట్‌ కొత్తగా ఉంది. సుధీర్‌గారేంటో నాకు తెలుసు. చాలా కష్టపడతారు. ఆయన కెరీర్‌లోనే ఇది పెద్ద బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుంది. వివేక్‌ సాగర్‌ సంగీతం బావుంది. కృష్ణప్రసాద్‌గారికి ఈ సినిమా పెద్ద సూపర్‌హిట్‌ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

హరీశ్‌ శంకర్‌ మాట్లాడుతూ - ''మనకున్న వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ రైటర్‌, డైరెక్టర్స్‌లో మోహనకృష్ణగారు ఒకరు. ఆయన వర్క్‌కి నేను ఫ్యాన్‌ని. సుధీర్‌ నాకు ఎప్పటి నుండో పరిచయం. ఆయన ఈ మధ్యనే నిర్మాతగా కూడా మారారు. ఆదితి మంచి పెర్‌ఫార్‌మర్‌. వివేక్‌ సాగర్‌ సంగీతం బావుంది. ఇక మహేశ్‌గారి గురించి చెప్పాలంటే.. ఆయన మెర్క్యురీలాంటి యాక్టర్‌. ఏ డైరెక్టర్‌తో సినిమా చేస్తే .. అలా మారిపోతుంటారు. ఎంటైర్‌ టీమ్‌కు అభినందనలు'' అన్నారు. .

ఎస్‌.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ - ''మ్యూజిక్‌, పిక్చరైజేషన్‌ చాలా బావున్నాయి. శివలెంక కృష్ణప్రసాద్‌గారు మంచి టేస్ట్‌ ఉన్న నిర్మాత. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్‌ కారు. అలాగే సుధీర్‌బాబుగారు హీరోగా తపన పడి, చాలా కమిట్‌మెంట్‌తో సినిమాలు చేస్తారు. హీరోయిన్‌ గ్లామర్‌గా ఉంది. మంచి సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తప్పకుండా సినిమా ఆదరణ పొందుతుంది. మనం అందరం గర్వపడి మెచ్చుకునేలా సినిమా ఉంటుంది'' అన్నారు.

కె.అచ్చిరెడ్డి మాట్లాడుతూ - ''టైటిల్‌ విన్నాం. ఇప్పుడు సాంగ్స్‌, ట్రైలర్‌ చూస్తుంటే చాలా బావున్నాయి. న్యాయం జరిగినట్లు కనపడుతుంది. ఈ సినిమాకు ఎలాంటి టైటిల్‌ పెడతారోనని ఆసక్తిగా చూశాం. మోహనకృష్ణగారు మరోసారి కొత్తగా ఆలోచించి 'సమ్మోహనం' అనే టైటిల్‌ను పెట్టారు. సుధీర్‌బాబు డేడికేటెడ్‌ ఆర్టిస్ట్‌. టాలీవుడ్‌ని సమ్మోహనం చేసిన సూపర్‌స్టార్‌ కృష్ణగారు, ఆయన తనయుడు మహేశ్‌బాబు ఫ్లెవర్‌ నుండి వచ్చిన సుధీర్‌బాబుగారు కృష్ణప్రసాద్‌గారికి కాసుల వర్షం కురిపిస్తారని భావిస్తున్నాను'' అన్నారు.

తనికెళ్లభరణి మాట్లాడుతూ - ''డైరెక్టర్‌ ఇంద్రగంటి మోహనకృష్ణ గ్రహణం నుండి నేటి సమ్మోహనం వరకు కంగారు లేకుండా స్థిమితంగా ఉంది. కొత్త కాన్సెప్ట్స్‌, డైరెక్టర్స్‌, నిర్మాతలు సహా అన్నింటిని ప్రేక్షకులు ఎంకరేజ్‌ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో వస్తోన్న సమ్మోహనంతో ఇందగ్రంటి మోహనకృష్ణ .. ఇంద్రగంటి సమ్మోహనకృష్ణ అవుతాడని భావిస్తున్నాను. సుధీర్‌, అదితి సమ్మోహనంగా ఉన్నారు. నరేశ్‌ వైవిధ్యమైన పాత్రలు చేస్తున్నారు. సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుంది. బ్యూటీఫుల్‌ మెమొరీ ఫర్‌ ఆల్‌'' అన్నారు. కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అతిథులు చిత్ర యూనిట్‌ను అభినందించారు.


Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved