భవ్య క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న చిత్రం `శమంతకమణి`. నారా రోహిత్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆది హీరోలుగా నటిస్తున్నారు. చాందిని చౌదరి, జెన్ని హనీ నాయికలు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. వి. ఆనందప్రసాద్ నిర్మాత. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో సోమవారం జరిగింది. పూరి జగన్నాథ్ సీడీలను విడుదల చేశారు.
నిర్మాత వి.ఆనందప్రసాద్ మాట్లాడుతూ ``ఇందులో హీరో ఎవరన్నది నాక్కూడా తెలియడం లేదు (నవ్వుతూ.. సరదాగా)`` అని చెప్పారు.
రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ``శమంతకమణి ఒక అందమైన కల. ఈ సినిమాలో నాకు విపరీతంగా నచ్చింది ఏంటంటే.. నలుగురు హీరోలూ ఎవరికి వారే హీరో అని కొట్టకునేంత గొప్పగా శ్రీరామ్ కథ రాశారు. 40 ఏళ్లు సినిమాల్లో పనిచేసిన నాకు శమంతకమణి అందమైన కల. అందరూ ఈ సినిమాను చూసి ఆశీర్వదించాలి. హీరోలు నాతో చాలా బాగా కలిసిపోయారు. ఈ చిత్ర నిర్మాత టేస్ట్ ఉన్న వ్యక్తి. అన్నే రవి చాలా కష్టపడ్డారు. సమీర్ అందమైన కెమెరాను చేశారు`` అని తెలిపారు.
శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ ``ఈ కథ రాసుకునేటప్పుడు ఉద్యోగం మానేశాను. ఆ టైమ్‌లో నాకు మా నాన్న ఆరు నెలలు శాలరీ ఇచ్చారు. నేను ఫస్ట్ రాసుకున్న కథలోనే నలుగురు హీరోలు అని అనుకున్నా. మా అమ్మ నాకు ధైర్యం ఇచ్చింది. మా ఆవిడ చాలా హెల్ప్ చేసింది. శ్రీరామ్ నాకు చాలా మంచి ఫ్రెండ్. తను నాకు చాలా హెల్ప్ చేశాడు. నేనెంత ఎగ్జయిట్ అయ్యానో మా నిర్మాత అంత గొప్పగా ఎగ్జయిట్ అయ్యారు. మా ఎగ్జిక్యూటివ్ నిర్మాత అన్నేరవిగారికి చాలా థాంక్స్. మా షూటింగ్‌లో ఎప్పుడూ ఎనిమిది క్యారవ్యాన్‌లు ఉండేవి. అంతమందిని మేనేజ్ చేశారు అన్నేరవిగారు. మా హీరోలందరూ నాకు సోదరులు లాంటివారు. ఆదికి చాలా గొప్ప ఎనర్జీ ఉంటుంది. సందీప్ కి, నాకూ చాలా సిమిలారిటీస్ ఉంటాయి. సుదీప్‌గారు చాలా ఫోకస్‌గా ఉంటారు. చాలా ప్యాషనేట్‌గా ఉంటారు. తనని చూస్తే మన ఎనర్జీ లెవల్స్ డ్రాప్ అయినా, వెంటనే పెరుగుతాయి.. రాజేందప్రసాద్‌గారితో పనిచేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్స్ ఎ మెమరబుల్ ఫిల్మ్ ఫర్ మి. రాజేందప్రసాద్‌గారు ఓ గొప్ప లెజెండ్. మా సినిమాలో హీరో , హీరోయిన్లు ఉండరు. అందరూ క్యారక్టర్లే ఉంటారు. నేను సినిమా చూశా. చాలా బాగా వచ్చింది. అందరికీ తప్
పక నచ్చుతుంది. మా టెక్నికల్ టీమ్ కూడా చాలా బాగా చేశారు `` అని చెప్పారు.
బెనర్జి మాట్లాడుతూ ``చూసి ఆనందించడానికి చాలా మంచి సినిమా అవుతుంది. యంగ్ జనరేషన్స్ తో కలిసి చేసినందుకు ఆనందంగా ఉంది`` అని చెప్పారు.
సుదర్శన్ మాట్లాడుతూ ``పూరి జగన్నాథ్ హస్తవాసి చాలా మంచిది. ఆయనకి మనసులో పసితనం ఉంది. పనిలో కసితనం ఉంది. సినీవనంలో ఆనందప్రసాద్‌గారు తులసి మొక్కలాంటివారు. ఆయనకు దొరికిన బంగారు కుండీ అన్నేరవి. ఇలాంటి సంస్థలో శ్రీరామ్ ఆదిత్య సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. గొప్ప హీరోలు నలుగురూ ఇందులో ఉండటం చాలా ఆనందం. టీమ్‌కి మంచి హిట్ కావాలి`` అని తెలిపారు.
ఆది మాట్లాడుతూ ``నాకు పూరిగారంటే చాలా ఇష్టం. ఆయన ఇక్కడికి వచ్చినందుకు థాంక్స్. మా దర్శకుడే ఈ సినిమాకు హీరో. చాలా బాగా తీశాడు. డబ్బింగ్ చెప్పేటప్పుడు ఎగ్జయిట్ అయ్యాను. మిగిలిన హీరోలతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీ. నలుగురుం ఎక్కడా ఇగోలకు పోలేదు. `లవ్ లీ` తర్వాత రాజేంద్రప్రసాద్‌గారితో పనిచేయడం చాలా హ్యాపీ. చాందిని నాకు పెయిర్‌గా చేసింది. మణిశర్మగారి సంగీతం గ్రేట్‌గా కుదిరింది. చాలా మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. సమీర్‌గారు చాలా స్పీడ్ అయిన వ్యక్తి. ఆయనతో మరలా పనిచేయాలని అనిపించింది`` అని చెప్పారు.
.సందీప్ కిషన్ మాట్లాడుతూ ``నలుగురు హీరోలు కలిస్తే సరదాగా షూటింగ్ చేసుకోవచ్చు అని చెప్పడానికి `శమంతకమణి` మంచి ఉదాహరణ. చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన రాజేంద్రప్రసాద్‌గారి నుంచి చాలా నేర్చుకున్నాను. సుధీర్ నాకు క్లోజ్ ఫ్రెండ్. హార్డ్ వర్క్ అనే విషయాన్ని ఇష్టపడతాడు. రోహిత్ సెన్సిబిలిటీస్ అంటే నాకు ఇష్టం. ఆది నాకు ఎప్పటినుంచో ఫ్రెండ్. ఈ సినిమాతోతనతో పనిచేయడం కుదిరింది. నిర్మాతగారు మా అందరినీ సమానంగా చూసుకున్నారు. సెట్‌లో మా బిగ్ డాడీ అన్నేరవిగారే. మణిశర్మగారు నాకు మంచి ఫ్రెండ్. శ్రీరామ్ ఆదిత్య చాలా బాగా డీల్ చేశాడు. నా పాత్రను సినిమాలో చూస్తేనే నచ్చుతుంది`` అని చెప్పారు.
నారా రోహిత్ మాట్లాడుతూ ``ఇందులో అందరం మంచి పాత్రలు చేశాం. తప్పకుండా హీరో శ్రీరామ్ ఆదిత్య. మంచి కథను తీసుకొచ్చి మాతో చేయించారు. ఇలాంటి సినిమాను నిర్మించిన ఆనందప్రసాద్‌గారికి థాంక్స్. సమీర్‌రెడ్డిగారితో ఫస్ట్ టైమ్ చేశా. విజువల్స్ చాలా బావున్నాయి. మణిగారితో ఇది నా మూడో సినిమా. ఈ సినిమాకు మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. పూరిగారు బాలయ్యబాబుగారితో ఎప్పుడు చేస్తారా అని వెయిట్ చేసేవాడిని. ఈ సినిమాకు పైసా వసూల్ కావాలి. `పైసా వసూల్`కి పదింతలు డబ్బులు రావాలి`` అని తెలిపారు.
సుధీర్‌బాబు మాట్లాడుతూ ``బాలయ్యగారి సినిమాలకు బ్లాక్‌లో సినిమాలు కొనుక్కుని వెళ్లాను. ఆయనతో ఫోటో తీసుకుందామనుకున్నా. ఆ క్షణం నా తర్వాతి సినిమాకు వస్తుందని ఆశిస్తున్నా. రియల్ లైఫ్‌లో నీ దగ్గరిలో ఉన్న పాత్రనే నువ్వు తెరమీద చేస్తావని కొందరు హీరోలు సలహా ఇచ్చారు. అప్పటి నుంచి పాటిస్తున్నా. ఇందులో నేను తల్లి లేని అబ్బాయిలాగా నటించా. నిర్మాత చాలా ఇష్టంగా సినిమా చేశారు. అన్నేరవిగారంటే ఆనందప్రసాద్‌గారికి ఓ నమ్మకం. ఆనందప్రసాద్‌గారంటే అన్నేరవికి ఓ గౌరవం. ఇద్దరూ కలిసి చేసిన సినిమా పెద్ద హిట్ కావాలి. `శమంతకమణి` అనే కారు కోసం అందరూ సినిమా చూడాలి`` అని చెప్పారు.
రామజోగయ్యశాస్త్రి మాట్లాడుతూ ``ఇంతమంది హీరోలుగా నటించిన ఈ సినిమాకు రాయడం చాలా ఆనందంగా ఉంది. రెండు డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్న పాట. పబ్ ప్లస్ ఫోక్ కలిసిన పాట ఇది. ఆదిత్య శ్రీరామ్ చాలా హుషారైన కుర్రాడు. మణిశర్మగారు చాలా మంచి ట్యూన్ చెప్పారు. మూడు రోజులు కష్టపడి రాశాను. నిన్న రాత్రి 12.30 వరకు సింగర్ పాడింది. అప్పుడు మరలా ఇంకో రెండు లైన్లను రాశాం`` అని చెప్పారు.
జెన్ని మాట్లాడుతూ ``ఒక పాత్ర కోసం నన్ను పిలిపించారు. సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను`` అని అన్నారు.
కైరా మాట్లాడుతూ ``నలుగురు డాషింగ్ హీరోలకి ఆల్ ది బెస్ట్. భవ్య క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న `పైసా వసూల్`లో నేను నటిస్తున్నాను`` అని చెప్పారు.
చాందిని మాట్లాడుతూ ``ఈ సినిమాలో నన్ను పార్ట్ చేసిన శ్రీరామ్‌కి ధన్యవాదాలు. సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను`` అని తెలిపారు.
అనన్య మాట్లాడుతూ ``చాలా మంచి సినిమాలో నేను పార్ట్ అయినందుకు ఆనందంగా ఉంది. అందరూ ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను`` అని అన్నారు.
హేమ మాట్లాడుతూ ``ఈ సినిమాలో ఆది హీరో. తను ఈ సినిమాలో నా కొడుకు. నా కొడుకే హీరో కావాలని ఆశిస్తున్నాను`` అని చెప్పారు.
పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ``సందీప్, ఆది, సుధీర్‌బాబు, నారా రోహిత్.. నలుగురూ స్టార్లే. ఇది మల్టీస్టారర్ సినిమా. ఈ నలుగురిలో ముందు ఎవరు డేట్లు ఇస్తే వారితో సినిమా చేస్తాను. రాజేంద్రప్రసాద్‌గారితో పనిచేసే అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాను. `శమంతకమణి` ఫంక్షన్‌కి రమ్మని బాలయ్యగారు చెప్పారు. కానీ ఆయనకు చిన్న ఫుడ్ పాయిజన్ కావడం వల్ల రాలేకపోయారు. ఆయన్ని `పైసా వసూల్` ఫంక్షన్‌లో కలుద్దాం. `శమంతకమణి` ట్రైలర్ చాలా బావుంది. ఎనర్జటిక్‌గా ఉంది. శ్రీరామ్ చాలా బాగా తీశాడు. సినిమా పెద్ద హిట్ కావాలి. ఆనందప్రసాద్‌గారితో నేను తొలిసారి పనిచేస్తున్నా. వండర్‌ఫుల్ నిర్మాత ఆయన`` అని చెప్పారు.