4 December 2016
Hyderabad
మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ప్రతిష్టాత్మకమైన గీతాఆర్ట్స్ బ్యానర్‌పై స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, నిర్మాత ఎన్.వి.ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తోన్న స్టయిలిష్ ఎంటర్ టైనర్ `ధృవ`. ఈ చిత్రాన్ని డిసెంబర్ 9న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను హైదరాబాద్ యూసఫ్‌గూడ పోలీస్ లైన్స్‌లో అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా....
తెలంగాణ మినిష్టర్ కె.టి.ఆర్ మాట్లాడుతూ - ``చరణ్ నాకు మంచి మిత్రుడు. చరణ్ కంటే ముందు చిరంజీవిగారు నాకు మంచి మిత్రుడు. శాసనసభలో ఆయనతో పరిచయం ఏర్పడింది. నిర్మలమైన మనసున్న వ్యక్తి చిరంజీవిగారు. అదే లక్షణాలు చరణ్‌లో కనపడుతున్నాయి. తండ్రి మెగాస్టార్, బాబాయ్ పవర్‌స్టార్, చరణ్ మెగాపవర్ స్టార్. చరణ్ చాలా టాలెంటెడ్. ఈ సినిమా చరణ్‌కు తొమ్మిదో సినిమా. చరణ్ లక్కీ నెంబర్, కారు నెంబర్, పుట్టిన నెంబర్ అంతా కూడా తొమ్మిదే వస్తుంది. ఈ సినిమా కూడా డిసెంబర్ 9నే వస్తుంది. చరణ్ పడ్డ కష్టం చూసి ఆశ్చర్యపోయాను. అరవింద్‌స్వామిగారు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు. చరణ్, అరవింద్, ప్రసాద్, సురేందర్‌రెడ్డి, రకుల్ సహా అందరికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు.
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ మాట్లాడుతూ - ``గీతాఆర్ట్స్ బ్యానర్లో మగధీర తర్వాత సినిమా చేయలేదు. అందుకు కారణం అంత మంచి కథ నాకు దొరకలేదు. అయితే ఇప్పుడు ధృవ సినిమా చేశాను. అందుకు ముందు థాంక్స్ చెప్పాల్సింది ప్రసాద్‌గారికి ఈ సినిమాను ఆయనే ముందు నా వద్దకు తెచ్చారు. ఆయనతో గతంలో రచ్చ వంటి సూపర్‌హిట్ మూవీ చేశాను. ధృవ సినిమాకు అరవింద్గారితో, ప్రసాద్‌గారితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. సురేందర్రెడ్డిగారితో చాలా ట్రావెల్ చేశాం. ఏ కథ చేద్దామనుకున్నాం. కానీ ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నందుకు సురేందర్‌రెడ్డిగారికి థాంక్స్. తమిళం కంటే తెలుగులోనే సినిమాను బాగా చేసి ఇచ్చారు. ఈ సినిమా ఇంత స్టయిలిష్‌గా ఉండటానికి కారణం వినోద్‌గారు, రాజీవన్ గారు సహా మంచి అవుట్‌పుట్ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ వారి వారి అభిమానులను అలరించడానికి కష్టపడతారు. నేను కూడా అలానే కష్టపడ్డాను తప్ప కొత్తగా ఏం చేయలేదు. జనవరిలో నాన్నగారి ఖైదీ నంబర్ 150 వస్తుంది. ఆయన లేని టైంలో మేం అలా ఇలా ఉంటే ఒకే. కానీ ఇప్పుడు ఆయన మళ్లీ వచ్చి ఒక స్టాండర్డ్ సెట్ చేసి బెత్తం పట్టుకుని నడిపించడానికి మళ్లీ వస్తున్నారు. ఆయన రావడంతో ఇంకా క్రమశిక్షణతో కష్టపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. డిసెంబర్ 9న అన్నీ కుదిరితే నాన్నగారి 150వ చిత్రం ఖైదీ నంబర్ 150 సినిమా టీజర్ ధృవ థియేటర్స్‌లో విడుదల చేయడానికి మేం ప్లాన్ చేస్తున్నాం. మనం ఇతరులకు ఏమిస్తే అదే మనకు తిరిగొస్తుంది. కానీ సినిమా ఇండస్ట్రీలో మేం అభిమానులను ఎంటర్టైన్ చేస్తే అభిమానులను తిరిగి మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని కాకుండా మాకు పేరు, డబ్బు, గౌరవం ఇస్తారు. ఇండస్ట్రీలో పుట్టినందుకు, ఇలా నటిస్తున్నందుకు అందరికీ థాంక్స్`` అన్నారు.
తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిష్టర్ తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ - ``రాంచరణ్ హీరోగా ఒక్కొక్క మెట్టు పెకెదుగుతూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సినిమా పరిశ్రమ బావుండాలని ప్రభుత్వ పరంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అల్లు అరవింద్‌గారు అనేక చిత్రాలు చేశారు. ఆరోజుల్లో చిరంజీవిగారితో ఎన్నో సినిమాలు చేశారు. ఇప్పుడు చరణ్, అల్లుఅర్జున్‌తో సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ధృవ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
అరవింద్ స్వామి మాట్లాడుతూ - ``సినిమా విజయాని కంటే ఆ జర్నీబావుండాలని నేను నమ్ముతాను. ఫలితం ప్రేక్షకులదే. దృవ జర్నీ మరచిపోలేను. చరణ్, సురేందర్ రెడ్డిగారు, అరవింద్‌గారు, ఎన్.వి.ప్రసాద్‌గారు, రకుల్, ఫరా, పోసాని సహా అందరూ దృవ జర్నీని అందరూ నాకు మెమరబుల్ చేశారు. రీమేక్ చేయడంలో రెండు విధానాలున్నాయి. అందులో ఒకటి ఎలా ఉంటే అలానే చేసేయడం అయితే రెండవది సినిమాను ఇంప్రవైజ్ చేస్తూ సినిమాను తీయడం. ఆ విషయంలో సురేందర్‌రెడ్డిగారిని అభినందిస్తున్నాను. చరణ్ డేడికేషన్, హార్డ్ వర్క్‌ను స్క్రీన్‌పై చూస్తారు. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు`` అన్నారు.
నాగబాబు మాట్లాడుతూ ``నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టాలి. హిప్హాప్ తమిళ సంగీతం కొత్తగా ఉంది. అరవింద్‌గారు గత నాలుగైదు సినిమాల నుంచి హిట్లు కొడుతూనే ఉన్నారు. ఈ సినిమాకు కూడా అదే పంథాలో పెద్ద హిట్ కొట్టాలి. ఈ టీమ్ అందరికీ పేరు, డబ్బు రావాలి. మా అభిమానులకు ఈ సినిమా ఆనందాన్నివ్వాలి. మా అన్నయ్య సినిమా విషయానికి వస్తే ఆయన ఇంకో సినిమా చేయాలని కోరుకున్న తొలి వ్యక్తిని నేనే. ఆయన ఖైదీ నెంబర్ 150 సినిమా ఒప్పకున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ఆయన లుక్ కి, చరణ్ లుక్‌కి పెద్ద తేడా అనిపించలేదు. మా అన్నయ్య కూడా తెగ ఎక్సర్సైజులు చేస్తున్నారని విన్నాను. ఈ మధ్య ఆయన్ని కలవడం కుదరలేదు. ఆ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను`` అని చెప్పారు.
మారుతి మాట్లాడుతూ ``ఫస్ట్ ధృవకి ఆల్ ది బెస్ట్. మెగా ఫ్యాన్స్ కి పెద్ద పండగ రాబోతోంది. చరణ్‌బాబు చాలా మంచి సబ్జెక్ట్ ఎంపిక చేసుకున్నారు. ఫ్యాన్స్ కాలర్ ఎత్తుకునే సినిమా అవుతుంది`` అని తెలిపారు.
పరశురామ్ మాట్లాడుతూ ``ధృవ ట్రైలర్ చూస్తే దర్శకుడు, హీరో పెట్టిన ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి. ట్రైలర్ ఎండింగ్లో అరవింద్‌స్వామి చెప్పినట్టు వి ఆర్ ఆల్ వెయిటింగ్ స్వీట్ హార్ట్. ఈ సినిమా అందరికీ పెద్ద హిట్‌ను తెచ్చిపెట్టాలి`` అని అన్నారు.
అడిషనల్ స్క్రిప్ట్ ని అందించిన మధు మాట్లాడుతూ ``ఈ సినిమా ప్రతి అంశంలోనూ ప్రత్యేకత ఉన్న చిత్రం. చరణ్బాబుగారి ఫ్యాన్స్ ని అలరిస్తుంది. సురేందర్రెడ్డిగారి దర్శకత్వంలో చాలా కొత్తగా ఉంటుంది`` అని తెలిపారు.
చంద్రబోస్ మాట్లాడుతూ ``ఇందులో మొత్తం నాలుగు పాటలు రాశాను. సంగీతం పట్ల సాహిత్యం పట్ల సంపూర్ణ అవగాహన ఉన్న దర్శకుడు సురేందర్‌రెడ్డిగారు. రామ్‌చరణ్‌గారి ప్రోత్సాహం, అనుక్షణం ఆయన అందించే తోడ్పాటు మర్చిపోలేను`` అని అన్నారు.
వరికుప్పల యాదగిరి మాట్లాడుతూ ``రెండు పాటలు రాశాను. ఒకటి సినిమాలో ఉంటుంది. ఒకటి ఆడియోలో ఉంటుంది. అందమైన కుందనాల బొమ్మ అనే పాట తర్వాత ఈ సినిమాలో ఓ పాట పాడాను`` అని తెలిపారు.
డైలాగ్ రైటర్ మాట్లాడుతూ ``తెలుగులో ఇలాంటి సినిమా రావడం మనందరం ప్రౌడ్‌గా ఫీలవ్వొచ్చు. సురేందర్‌రెడ్డిగారు నాకు ఫ్రెండ్. అరవింద్‌గారు అవకాశం ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. చరణ్ ఇందులో కొత్తగా కనిపిస్తారు. అభిమానులు చాలా ఎంజాయ్ చేస్తారు`` అని చెప్పారు.
పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ ``అల్లు అర్జున్ ఇండియాలో బెస్ట్ డ్యాన్సర్. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు ఆయన తండ్రి అల్లు అరవింద్‌గారికి ధన్యవాదాలు. చిరంజీవిగారికి అల్లుడా మజాకా రాశా. పవన్ కల్యాణ్‌గారికి గోకులంలో సీత రాశా. ఈ తర్వాత దర్శకుడిని అయ్యా. హిట్లూ ఫ్లాపులూ చేశా. నేను మరో సినిమా దర్శకత్వం చేయడానికి సిద్ధమవుతూ ఉండగా వినాయక్‌గారు ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి మూడు రోజుల వేషం ఉందని అన్నారు. ఆ సినిమా నాయక్. తొలి రోజు నేను షూటింగ్ చేసిన తర్వాత వినాయక్ రైటర్లను పిలిచి నా పాత్ర పరిధి పెంచమన్నారు. ఆ సినిమా విడుదలైన తర్వాత ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా విడుదలైన తర్వాత నాలుగు రోజుల్లో ఆరు సినిమాలు వచ్చాయి నాకు. ఇంత తక్కువ రోజుల్లో నా ఒక్కడికే అన్ని సినిమాలు వచ్చాయి. ఇంకెవరికీ వచ్చి ఉండవు. ఈ సినిమాను సురేందర్‌రెడ్డి గొప్పగా టేకింగ్ చేశాడు. నాకు చాలా పెద్ద వేషం. ఫస్ట్ హీరోతో కనిపిస్తాను. తర్వాత అరవింద్ స్వామి గారి ఫాదర్‌గా కనిపిస్తాను. ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను`` అని అన్నారు.
వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ``ధృవ సినిమాపై డీ మానిటైజేషన్ ఎఫెక్ట్ ఉండదని భావిస్తున్నాను. తని ఒరువన్ సినిమా చూసి స్పెల్ బౌండ్ అయ్యాను. ఆ సినిమాలో హీరో, విలన్ అని కాకుండా రెండు క్యారెక్టర్స్ ఉంటాయి. కథను నమ్మి సినిమా చేసిన చరణ్‌కు హ్యాట్సాఫ్. ఓ రీమేక్ సినిమాను కథను అడాప్ట్ చేసుకుని సినిమా తీయడం ఎంత కష్టమో నాకు తెలుసు. సురేందర్‌రెడ్డికి ఆల్ ది బెస్ట్. రకుల్ ప్రీత్ సింగ్, హిప్ హాప్ తమిళ, పి.ఎస్.వినోద్ సహా అందరికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు.
Rakul Preet Singh Glam gallery from the event |
|
|
|
వి.వి.వినాయక్ మాట్లాడుతూ - ``ధృవ సినిమా కోసం చరణ్ ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. రాత్రి ఒంటి గంట వరకు సినిమా కోసం ఎక్సర్సైజులు చేశారు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి అడిగాడని చరణ్ కష్టపడితే సురేందర్‌రెడ్డి అన్కాంప్రమైజ్డ్గా తమిళం కంటే తెలుగులో సినిమాను తెరకెక్కించారు. హిప్ హాప్ తమిళ, అరవింద్స్వామిగారికి అందరికీ అభినందనలు. డిసెంబర్లో కొడుకు సినిమా చూడండి. జనవరిలో తండ్రి సినిమా చూడండి`` అన్నారు.
డా.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ - ``ధృవ సినిమాలో చరన్ అందంగా, మాస్ హీరోలా కనిపిస్తాడు. సినిమా చాలా బాగా వచ్చింది. పాటలు అల్రెడి పెద్ద హిట్ సాధించాయి. సురేందర్‌రెడ్డి, హిప్ హాప్ తమిళ, అరవింద్ స్వామిగారికి అందరికీ కంగ్రాట్స్`` అన్నారు.
సుకుమార్ మాట్లాడుతూ - ``చరణ్ చిన్న చిన్న ప్రామిస్‌లను కూడా నిలబెట్టుకునే వ్యక్తిత్వమున్న వ్యక్తి. సురేందర్ రెడ్డి నా ఫ్రెండ్. హీరోలను ప్రత్యేకంగా చూపించడంలో తనది ప్రత్యేక స్టైల్. సినిమా బావుందని తెలిసింది. సినిమా పెద్ద హిట్ కావాలని, గీతాఆర్ట్స్ లో ధృవ మరో పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
బోయపాటి శ్రీను మాట్లాడుతూ - ``ధృవలో చరణ్ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాడు. పోలీస్ అంటే నమ్మకం. ఈ నమ్మకం వ్యక్తి లుక్ నుండే వస్తుంది. లుక్ కోసం చరణ్ బాబు చేసిన తీరు, క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిన తీరు అద్భుతం. ఆ లుక్‌లోనే సగం సక్సెస్ కనపడుతుంది. రకుల్ చాలా హార్డ్ వర్కింగ్ హీరోయిన్. అరవింద్ స్వామిగారు హీరోగానే కాదు, విలన్‌గా కూడా సక్సెస్ అయ్యారు. సాధారణంగా సినిమాల్లో తండ్రి పోలీస్, కొడుకు దొంగగా ఉంటారు. కానీ మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే కొడుకు పోలీస్‌గా ధృవ సినిమా చేస్తే, తండ్రి ఖైదీగా ఖైదీ నంబర్ 150 సినిమా చేయడం థ్రిల్‌గా ఉంది. అయన్ను అరెస్ట్ చేయాలన్నా, అందుకోవాలన్నా అషామాషీ విషయం కాదు. వేరు గట్టిదైతే ఉంటే చెట్టు బలంగా ఎదుగుతుంది. ఆ చెట్టు ఎంతో మంది ఎదగడానికి దోహదపడుతుంది. దానికి బెస్ట్ ఎగ్జామ్పుంల్ చిరంజీవిగారు. ఆయన ఎదుగుతూ ఓ అద్భుతమైన ఫ్లాట్‌ఫాం వేశారు. మధ్యలో కాసేపు రెస్ట్ తీసుకున్నారంతే. మళ్లీ ట్విస్ట్ ఇవ్వడానికి వస్తున్నారు. అదే ఖైదీ నంబర్ 150. ధృవతో పాటు ఖైదీ నంబర్ 150 పెద్ద హిట్టై పరిశ్రమ కళకళలాడాలని కోరుకుంటున్నాను. గీతాఆర్ట్స్ మేకింగ్ వాల్యూస్
అద్భుతం. క్లారిటీ ఉన్న దర్శకుడుకి చాలా ఫ్రీడమ్ ఇస్తారు. అల్లు అరవింద్‌గారు సినిమాను అద్భుతంగా చేయించుకుంటారు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. ఈ సినిమా సూపర్‌డూపర్ హిట్ సాధించాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ - ``మెగాస్టార్ చిరంజీవిగారికి వారసుడుగా రాంచరణ్ సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత హీరోగానే కాకుండా, అందరితో కలిసి ఉండే తన వ్యక్తిత్వాన్నిఅందరూ అభినందించాల్సిందే. గీతాఆర్ట్స్‌లో మగధీర ఎలాగైతే కొత్త రికార్డులను క్రియేట్ చేసిందో, ఆ రికార్డులను ధృవ బద్ధలు కొట్టి కొత్త రికార్డులు క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా సక్సెస్ మీట్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవిగారి ఖైదీ నంబర్ 150 సినిమా వేడుకను కూడా వైజాగ్‌లో సెలబ్రేట్ చేయాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
శేఖర్ రెడ్డి మాట్లాడుతూ - ``ధృవ తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది. చిరంజీవిగారి వద్ద ఉన్న హార్డ్ వర్క్, క్రమశిక్షణ చరణ్‌లో, మెగా హీరోలందరిలో ఉన్నాయి. ధృవ పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్`` అన్నారు.
ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ - ``తని ఒరువన్ సినిమా విడుదల కాగానే చరణ్‌గారికి ఫోన్ చేసి సినిమా చూడమని చెప్పాను. ఆయన సినిమా చూడగానే నటిస్తానని అన్నారు. తమిళ సినిమా హక్కుల కోసం చాలా మంది పోటీలు పడ్డారు. చరణ్‌గారితో ఈలోపు చాలా మంది పోటీలు పడ్డా, చరణ్‌గారు ప్రసాద్‌గారితో సినిమా చేస్తానని అన్నారు. అలాగే సురేందర్‌రెడ్డితో సినిమా చేయాలని హీరోగారు అనుకోవడంతో, తమిళంలో తని ఒరువన్ సినిమా చేసిన రాజా తెలుగులో ఈ సినిమాను డైరెక్ట్ చేస్తానని అన్నా కూడా చరణ్ సురేందర్రెడ్డిగారితో ఈ సినిమా చేస్తానని, మంచి కథతో వస్తే రాజాతో మరో సినిమా చేస్తానని అన్నారు. అలా ధృవ సినిమా స్టార్ట్ అయ్యింది. చాలా మంచి సినిమా, గొప్ప సినిమా. అభిమానులు చరణ్ నుండి ఏం కోరుకుంటారో అవన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. అరవింద్‌స్వామిగారు తమిల్లో చేశారు. అయన్ను గట్టిగా ఒప్పించి తెలుగులో చేయించాం. ఇది ఆయనకు ఒక రీ ఎంట్రీలా ఉంటుంది. ఇందులో అరవింద్‌గారు ఇందులో విలన్‌గా చేశారని అందరూ అంటున్నారు కానీ సినిమా రెండు క్యారెక్టర్స్ మధ్య నడిచే కథ. సురేందర్‌రెడ్డి అండ్ టీం సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారు. అరవింద్గారితో కలిసి వర్క్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. అందరికీ నచ్చే సినిమా అవుతుంది`` అన్నారు.
దగ్గుబాటి రానా మాట్లాడుతూ - ``దృవ ఈ ఏడాదిలోనే పెద్ద సినిమా అవుతుంది. మోడ్రన్ కంటెంపరరీ సినిమాలో ఇదొక బాహుబలి వంటి సినిమా. నచ్చిన వ్యక్తులందరూ కలిసి చేసిన సినిమా. ఈ సినిమా ఘన విజయం సాధించి కొత్త రికార్డులు క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాను. అరవింద్స్వామిగారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఆయన్ను స్వాగతిస్తున్నాం`` అన్నారు.
సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ - ``ధృవ రెగ్యులర్ సినిమా కాదు. కొత్తగా ఉంటుంది. కొత్తగా చేయాలని చరణ్ సినిమా చేయాలని ఈ సినిమాను సెలక్ట్ చేసుకుని నాకు దర్శకత్వం అవకాశం ఇచ్చారు. మొదటి రోజు నుండి నాకు ఒక మంచి టీంను కూడా ఇచ్చాడు. అంత మంచి టీం ఉండబట్టే సినిమా బాగా వచ్చింది. మనకు కనపడే చరణ్ వేరు. తన హార్ట్ వేరు. ఈ సినిమాతో చరణ్ లాంటి మంచి దయ గల వ్యక్తిని, ఫ్రెండ్‌ను సంపాదించుకున్నాను. అరవింద్‌గారు, వినోద్, హిప్హాప్ తమిళ సహా అందరూ డేడికేషన్‌తో ఈ సినిమా కోసం వర్క్ చేశారు. నిర్మాతలు అరవింద్, ప్రసాద్‌గారి వల్లే సినిమా చాలా బాగా వచ్చింది. అవకాశం ఇచ్చి సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్`` అన్నారు.