7 November 2017
Hyderabad
గల్ప్‌కి వెళ్లిన వారి కష్టసుఖాలను వల్లెవేస్తూ తెరకెక్కించిన చిత్రం `గల్ప్`. చేతన్ మద్దినేని హీరోగా నటించారు. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రమిది. శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై రూపొందింది. ఈ సినిమా మంగళవారానికి 25 రోజుల్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సంస్థ కార్యాలయంలో చిత్ర యూనిట్ ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు.
దర్శకుడు పి. సునీల్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ ``జగిత్యాల వంటి సెంటర్లో మా సినిమా 25 రోజులు రన్ కావడం గ్రేట్ అచీవ్‌మెంట్. ఎమోషనల్ కంటెంట్ ఉన్న సినిమాను ఇలా తెలుగు ప్రేక్షకులు రిజీవ్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. విడుదల సమయంలో 150 సెంటర్లలో విడుదల చేశాం. ఇప్పుడు 16 సెంటర్లలో రన్ అవుతోంది. రూరల్ లెవల్లో దీనికి అప్రిషియేషన్ దొరకడం వల్ల అది సాధ్యమైంది. క్రిటికల్ రెస్పాన్స్ చాలా బావుండటం వల్ల కూడా మా సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. కమర్షియల్లీ కూడా ముఖ్యంగా రూరల్ ఏరియాల్లో చాలా బావుంది. తెలంగాణలో సినిమాకు చాలా మంచి స్పందన వస్తోంది. రూరల్ పీపుల్ ఓన్ చేసుకున్నారు. మా సినిమా విడుదలైన తర్వాత ప్రతి వారం ఎన్నో కొన్ని సినిమాలు వచ్చినా గల్ప్ ఈజ్ హోల్డింగ్ ఇట్స్ గ్రౌండ్. ఆర్టిస్టులు కొత్తవారైనా, ప్రజలకు బాగా కనెక్ట్ అయ్యారు. వాళ్లు కొన్ని విలేజ్‌లకు వెళ్లినప్పుడు అక్కడివారు వాళ్ల పిల్లలని వీళ్లల్లో చూసుకోవడం కళ్లారా చూశాను. మా సినిమాతో పొలిటికల్ అవగాహన వచ్చింది. ప్రతి జిల్లాలోనూ ఈ సమస్యల మీద మాట్లాడటానికి అవకాశం వచ్చింది. సినిమాకు సోషల్ ఫేస్ ఉంటుందని నిరూపించింది`` అని అన్నారు.
చేతన్ మద్దినేని మాట్లాడుతూ ``నా పాత్రకు చాలా మంచి స్పందన వచ్చింది. నా తొలి సినిమా కన్నా ఇందులో మంచి స్పందన వచ్చింది. 2,3 రోజులకే చిన్న సినిమాను ఎవరూ పట్టించుకోవడం లేదు. అలాంటిది మా చిత్రానికి ఇంత మంచి స్పందన వస్తోంది. మా ఊరు వైజాగ్ కాబట్టి అక్కడ వచ్చిన స్పందనను ప్రత్యక్షంగా చూశాను`` అని చెప్పారు.
యెక్కలి రవీంద్రబాబు మాట్లాడుతూ ``మేం తీసిన గత చిత్రాల కన్నా ఈ సినిమా చాలా బాగా ఉంది. మేం అనుకున్నదానికన్నా ఎక్కువ స్పందన వచ్చింది. జగిత్యాలలోగానీ, సరౌండింగ్ స్పేసస్‌లో మున్సిపాలిటీ ఛైర్మన్‌లు, ఎమ్మెల్యేలు సినిమాను ప్రశంసించారు. మేం ఊహించినదానికన్నా ఎక్కువ స్పందన వచ్చినందుకు చాలా ఆనందంగా అనిపించింది. 25వ రోజు వేడుకను నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది. కొన్ని సెంటర్లలో ఇంకా రన్ అవుతూనే ఉంది`` అని అన్నారు.