స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై `అన్నదాత సుఖీభవ`సినిమా చేయబోతున్నాను. సాధారణంగా మనం ఎవరి ఇంటికైనా భోజనానికి వెళ్లినప్పుడు, ఎవరైనా మన ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు, భోజనం పూర్తి కాగానే అన్నదాత సుఖీభవ అని అంటుంటాం. అయితే అన్నం ఉత్తత్పి చేసేది రైతు. కాబట్టి అన్నదాత సుఖీభవ అంటే రైతన్న నువ్వు సుఖంగా ఉండు అని అర్థం. మన భారతదేశంలో 70 శాతం వ్యవసాయం. రైతు దేశానికి వెన్నముక. రైతే రాజు అని రైతుకు ఎక్కువ ప్రాధాన్యం మిచ్చారు. కానీ ఈవాళ అన్నదాత సుఖీభవ కాదు, అన్నదాత దుఃఖీభవ అయిపోయింది. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతు వెన్నెముక విరిపోతుంది. రైతు బికారిగా మారిపోతున్నాడు. రైతు సుఖంగా ఉంటే, ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని వేద పండితులు ఘోషించారు. రైతుకు గిట్టుబాటు ధర రావడం లేదు. రైతు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. జీవితం దేవుడిచ్చిన వరం, కాబట్టి రైతన్నలు చనిపోకూడదు. రైతు బ్రతకాలి, అందరినీ బ్రతికించాలని కోరుకున్నదే ఈ సినిమా. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీగారు, తెలంగాణ సీ.ఎం. కె.సి.ఆర్‌గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగారికి నేను చేస్తున్న విజ్ఞప్తి ఎంటంటే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి.
తెలంగాణ సీఎం కెసిఆర్‌గారు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పనులతో బ్రహ్మాండంగా రైతుకు అండగా నిలబడుతున్నారు. ఇంత మేలు చేస్తున్నా సరే, రైతులెందుకు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? ఎందుకంటే కేవలం గిట్టుబాటు ధరలు రాకపోవడం వల్లనే. భారతదేశంలో వరి బాగా పండే ప్రాంతాల్లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వెస్ట్ గోదావరి జిల్లా, తమిళనాడులో తంజావూరు జిల్లా కానీ ఈ ఏడాది వరి తెలంగాణ జిల్లాల్లో వరి బాగా పండింది. కె.సి.ఆర్‌గారు ఇంత సహకారం ఇస్తున్నా రైతులెందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే గిట్టుబాటు ధర రాకపోవడమే. ఇక చంద్రబాబు నాయుడుగారికి చేసే విజ్ఞప్తి ఎంటంటే, కె.ఆర్.రావు ఇంజనీర్, గంగ నుండి కావేరీ వరకు అన్నీ నదులను అనుసంధానం చేయాలని సూచించారు. భారతదేశం నదులను అనుసంధానం చేస్తే నీరు సముద్రం పాలు కాకుండా కాపాడుకోవచ్చు. అలాగే చంద్రబాబు నాయుడు గోదావరి నీటిని కృష్ణా జిల్లా, గుంటూరు, నెల్లూరు, నెల్లూరు జిల్లా వరకు అందిస్తున్నారు. ఆయనెలాగైతే నీటిని అనుసంధానం చేసి ప్రజలకు అందిస్తున్నారో అలాగే పోలవరం నుండి ఉత్తరాంధ్రను కూడా సస్యశ్యామలం చేయాలని కోరుకుంటున్నాను. నరేంద్రమోదీగారు జి.ఎస్.టిని అందరి ఆమోదంతో అంగీకరిపంచేశారు. కానీ భారతదేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందుకు కారణం రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోవడమే. ఓ రైతుకు నెలకు ఆరువేల ఐదు వందలు మాత్రమే జీతంగా వస్తుంది. అంటే రైతు ఎంత దయనీయ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఓ రైతుకు నెలకు 50 వేలు రాబడి వచ్చేలా ప్రధాని, తెలుగు ముఖ్యమంత్రులు చర్యలు తీసుకోవాలి. ఇక నా సినిమా విషయానికి వస్తే, పాటలు రికార్డింగ్ అయిపోయాయి. గద్దరన్న, గోరేటి ఎంకన్న, సుద్ధాల అశోక్ తేజ, వంగపండు ప్రసాద్‌గారు పాటలు రాశారు. ఆగస్ట్ 4సినిమా ప్రారంభమవుతుంది. రైతుకు పాలకులు, ప్రజలు అండగా నిలబడాలి`` అన్నారు.