pizza
Bluff Master press meet
`బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌` ప్రెస్‌మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


10 November 2018
Hyderabad


శ్రీదేవి మూవీస్ శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ స‌మ‌ర్పిస్తున్న చిత్రం `బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌`. అభిషేక్ ఫిలిమ్స్ రూపొందిస్తోంది. స‌త్య‌దేవ్‌, నందితా శ్వేత‌, ఆదిత్య మీన‌న్‌, బ్ర‌హ్మాజీ, పృథ్వి, సిజ్జు, చైత‌న్య కృష్ణ‌, టెంప‌ర్ వంశీ, దిల్ ర‌మేశ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ధారులు. గోపీ గ‌ణేష్ ప‌ట్టాభి. బి.ఎఫ్‌.ఎ ద‌ర్శ‌కుడు. ర‌మేష్.పి.పిళ్లై నిర్మాత‌.

శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ మాట్లాడుతూ ``చాలా ఇష్ట‌ప‌డి చేసిన సినిమా. మా సంస్థ ఈ సినిమాను స‌మ‌ర్పించ‌డం అదృష్టంగా భావిస్తున్నా. ఇది రీమేక్ చిత్ర‌మే అయిన‌ప్ప‌టికీ, చాలా అద్భుత‌మైన ఇంప్రూవైజేష‌న్స్ చేశాం. గోపీ అద్భుతంగా తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో ప్ర‌తి చిన్న చాయిస్ కూడా ఆయ‌న చేసిందే. ప్ర‌తి ఒక్క‌రినీ ఏరికోరి ఎంపిక చేసుకున్నారు. ఈ క‌థ కోసం హీరో కోసం వెతుకుతున్న‌ప్పుడు స‌త్య చేసిన కొన్ని సినిమాలు చూశాం. ఈ క‌థ‌కు త‌ను ప‌క్కా యాప్ట్ అనిపించి ఓకే చేశాం. మేం అనుకున్న‌ట్టే త‌ను ప‌క్కాగా న్యాయం చేశారు. మా సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌యింది. త్వ‌ర‌లోనే సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేస్తాం. డిసెంబ‌ర్ ద్వితీయార్ధంలో చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. సినిమా విజ‌యం ప‌ట్ల మేం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఇందులో న‌టించిన న‌టీన‌టులంద‌రూ చాలా బాగా చేశారు. సంగీత ద‌ర్శ‌కుడు సునీల్ క‌శ్య‌ప్ చాలా మంచి సంగీతాన్నిచ్చారు`` అని అన్నారు.

సంగీత ద‌ర్శ‌కుడు సునీల్ క‌శ్య‌ప్ మాట్లాడుతూ ``రోమియో తర్వాత నేను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న సినిమా ఇది. పాట‌లు, రీరికార్డింగ్ చ‌క్క‌గా కుదిరింది. చాలా మంచి స‌బ్జెక్ట్ ఇది. సినిమా విడుద‌ల కోసం నేను కూడా ఆతృత‌గా ఎదురుచూస్తున్నా. అవ‌కాశం ఇచ్చినందుకు ధ‌న్య‌వాదాలు`` అని అన్నారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ``మ‌నం చేసే సినిమా ద్వారా స‌మాజానికి ఎంతో కొంత మంచి జ‌ర‌గాల‌నే ఉద్దేశంతో ఈ సినిమా చేశాను. స‌మాజంలో బ్ల‌ఫ్ మాస్ట‌ర్లు చాలా ఎక్కువ‌య్యారు. దీని ఒరిజిన‌ల్ చిత్రం `చ‌తురంగ వేట్టై`ను తీసిన డైర‌క్ట‌ర్ వినోద్‌గారిని క‌లిసి మూడు రోజులు ట్రావెల్ చేశాను. ఆయ‌న చాలా మంచి మ‌నిషి. ఈ సినిమా చేసినందుకుగానూ ఆయ‌న‌కు త‌మిళ‌నాడు పోలీసులు గ‌తంలో అభినంద‌న ప‌త్రాన్ని కూడా అంద‌జేశారు. ఆయ‌న చేసిన ఈ సినిమా త‌ర్వాత చెన్నైలో 40 శాతం క్రైమ్ రేట్ త‌గ్గింద‌ట‌. అంత‌గా జ‌నాల‌ను ఇన్‌ఫ్లుయ‌న్స్ చేసిన సినిమా ఇది. అందుకే ద‌ర్శ‌కుడిని పోలీసులు ప్ర‌త్యేకంగా ప్ర‌శంసించార‌క్క‌డ‌. తెలుగులోనూ అదే ఇంపాక్ట్ ఉంటుంద‌ని ఆశిస్తున్నాను. స‌మాజంలో మార్పు వ‌స్తుంద‌ని అనుకుంటున్నాను. తెలుగు ప్రేక్ష‌కుల‌ను కూడా అల‌రిస్తుంద‌నే న‌మ్ముతున్నాం. ఈ సినిమా విడుద‌ల‌య్యాక బ్లఫ్ మాస్ట‌ర్‌గా స‌త్య‌ను అంద‌రూ గుర్తుంచుకుంటారు. ఈసినిమాను త‌ను త‌న భుజాల‌పై మోసుకెళ్తాడు`` అని అన్నారు.

హీరో స‌త్య‌దేవ్ మాట్లాడుతూ ``ఎమోష‌న‌ల్‌గా ఈ సినిమాకు చాలా క‌నెక్ట్ అయ్యాను. శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ గారు, గోపీగారు ఈ సినిమాకు మెయిన్ పిల్ల‌ర్స్. నిజ జీవితంలో ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటాయ‌ని నాకూ తెలుసు. ఈ ద‌ర్శ‌కుడితో నేను హీరోగా చేసిన సినిమా ఒక‌టి గతంలో ఆగిపోయింది. అయినా కూడా నా మీద న‌మ్మ‌కంతో న‌న్ను పిలిచి ఈ సినిమా అవ‌కాశాన్ని ఇచ్చిన ద‌ర్శ‌కుడికి ధ‌న్య‌వాదాలు. న‌న్ను నేను ప్రూవ్ చేసుకునే అవ‌కాశం ఈ చిత్రంతో ల‌భించింది. ఈ చిత్రంలో కృష్ణ‌ప్ర‌సాద్‌గారితో పనిచేయ‌డం అదృష్టంగా భావిస్తున్నా. నిర్మాత ర‌మేష్ పిళ్లైగారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను నిర్మించారు `` అని అన్నారు.

సినిమాటోగ్రాఫ‌ర్ దాశ‌ర‌ది శివేంద్ర మాట్లాడుతూ `` మంచి సినిమా చేసినందుకు ఆనందంగా ఉంది. త‌ప్ప‌కుండా ప్ర‌తి ఒక్క‌రికీ క‌నెక్ట్ అయ్యే సినిమా ఇది`` అని చెప్పారు.

ఈ చిత్రానికి క‌థ‌: హెచ్‌. వినోద్‌, అడిష‌న‌ల్ డైలాగ్స్: పుల‌గం చిన్నారాయణ‌, పాట‌లు: రామ‌జోగ‌య్య‌శాస్త్రి, మ‌ధుర‌క‌వి కోగంటి వెంక‌టాచార్యులు, విశ్వ‌నాథ్ కార‌సాల‌, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: ఎం.కృష్ణ‌కుమార్ (కిట్టు), ఆర్ట్: బ‌్ర‌హ్మ క‌డ‌లి, ఎడిట‌ర్‌: న‌వీన్ నూలి, సినిమాటోగ్ర‌ఫీ: దాశ‌ర‌థి శివేంద్ర‌, సంగీతం: సునీల్ కాశ్య‌ప్‌, నిర్మాత‌: ర‌మేష్‌, పి.పిళ్లై, మాట‌లు- ద‌ర్శ‌క‌త్వం: గోపీగ‌ణేష్ ప‌ట్టాభి బి.ఎఫ్‌.ఎ.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved