pizza
Chi La Sow press meet
`చి.ల‌.సౌ`ను విడుద‌ల చేయ‌డం ప్రౌడ్ గా ఉంది - నాగార్జున అక్కినేని
You are at idlebrain.com > News > Functions
Follow Us


1 August 2018
Hyderabad

సుశాంత్‌, రుహనీ శర్మ జంటగా నటించిన చిత్రం 'చి||ల||సౌ'. అన్నపూర్ణ స్టూడియోస్‌, సిరునీ సినీ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై అక్కినేని నాగార్జున, భరత్‌ కుమార్‌, జస్వంత్‌ నడిపల్లి నిర్మాతలుగా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఆగస్ట్‌ 3న సినిమా విడుదలవుతుంది. ఈ సంద‌ర్భంగా నాగార్జున అక్కినేని బుధ‌వారం పాత్రికేయుల‌తో మాట్లాడుతూ....

నాకు అలా అనిపించింది...
- చి.ల‌.సౌ` సినిమా చూశాను. చాలా బాగా న‌చ్చింది. సింపుల్ పాయింట్ కానీ క‌ట్టిప‌డేసేలా తెర‌కెక్కించారు. మంచి మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఇలా అన్ని చ‌క్క‌గా అమ‌రాయి. సినిమా చేసిన వాళ్లంద‌రూ కొత్తవాళ్లే. సినిమా చూసిన త‌ర్వాత నాకు నేనే ఫ్రెష్‌గా అనిపించాను. ఇలాంటి సినిమాలను నేను ఎందుకు చేయ‌డం లేదు అనిపించింది.

క్రెడిట్ అంతా త‌న‌దే...
- సినిమా చూసిబ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత రాహుల్‌ను క‌లిసి అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో సినిమాను విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నాం. నీకు ఇంట్ర‌స్ట్ ఉందా? అని అడిగాను. త‌ను హ్యాపీగా ఫీల‌య్యాడు. అలా ఈ జ‌ర్నీ స్టార్ట్ అయ్యింది. అలా మేం ఈ సినిమాలో నిర్మాత‌లు అయ్యాం. ఉయ్యాలా జంపాలా సినిమా చేసే స‌మ‌యంలో స్క్రిప్ట్ స్టేజ్ నుండి అన్న‌పూర్ణ స్టూడియోస్ ఇన్‌వాల్వ్ అయింది. కానీ ఈ సినిమాకు అలా లేదు. క్రెడిట్ అంతా రాహుల్‌కే ద‌క్కుతుంది.

రైటింగ్స్‌ బావుంటున్నాయి...
- అంద‌రూ కొత్త‌వాళ్ల‌తో చేయ‌డం అనేది రిస్కే. మంచి ఆక‌లితో సినిమా చేశారు. ఈ మ‌ధ్య‌న ఫ్రెష్ స‌బ్జెక్ట్స్ బాగా ఆడుతున్నాయి. స్టోరీ రైట‌ర్స్‌, డైలాగ్ రైట‌ర్స్ ఇలా రైట‌ర్స్ అంద‌రికీ టైమ్ వ‌చ్చింది. తెలుగులో సినిమాల్లో మ‌హాన‌టి, రంగ‌స్థ‌లం చిత్రాల్లో ఆర్టిస్ట్ పెర్ఫామెన్స్‌ను ప‌క్క‌న పెడితే..మంచి రైటింగ్ క‌న‌ప‌డింది. అలాగే.. ఈమ‌ధ్య హిందీ చిత్రాల్లో రాజీ చూశాను. స‌బ్‌మెరైన్‌పై చేసిన ఆ స్పై ఫిలింలో స‌బ్‌మెరైన్‌ను చూపించ‌కుండానే అద్భుతంగా తెర‌కెక్కించారంటే కార‌ణం రైటింగే. రైటింగ్‌తో పాటు మంచి కాస్టింగ్ కూడా కుదిరింది. అన్న‌పూర్ణ నుండి `చి.ల‌.సౌ` సినిమాను విడుద‌ల చేయ‌డం గ‌ర్వంగా ఉంది. మమ్మ‌ల్ని భాగ‌స్వామ్యం చేసిన ఇత‌ర నిర్మాత‌ల‌కు థాంక్స్‌.

రాహుల్ డైరెక్ష‌న్‌లో నెక్స్‌ట్ మూవీ...
- `చి.ల‌.సౌ`లో ఆర్టిస్ట్ పెర్ఫామెన్స్‌, స్క్రీన్‌ప్లే, రైటింగ్ అన్నీ ప‌క్కాగా కుదిరాయి. సుశాంత్‌, హీరోయిన్ రుహాని అవుట్‌స్టాండింగ్‌.. వెన్నెల‌కిశోర్ కామెడీ సినిమా ఆసాంతం న‌వ్విస్తుంది. రాహుల్ నెక్స్‌ట్ సినిమా అన్న‌పూర్ణ బ్యాన‌ర్‌లో ఉంటుంది. మంచి సినిమాల‌కు బ్యాకింగ్ లేక చాలా సినిమాలు ఆగిపోతున్నాయి. అలాంటి సినిమాల‌కు భ‌విష్య‌త్‌లో బ్యాకింగ్ ఇవ్వ‌డానికి అన్న‌పూర్ణ స్టూడియో ముందుకు రావ‌చ్చు.

క్వాలిటీయే ముఖ్యం...
- నేను బాలీవుడ్‌కి వెళ్ల‌లేదు. వాళ్లే నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. నేను బాలీవుడ్ సినిమా చేసి 15 ఏళ్లు అవుతుంది. మంచి అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు త‌ప్ప‌కుండా చేస్తాను. త‌మిళంలో కూడా అలాగే మంచి అవ‌కాశం వ‌చ్చింద‌ని `ఊపిరి` సినిమా చేశాను. మ‌రో వారంలో నా త‌మిళ సినిమాకు సంధించి మ‌రో అనౌన్స్‌మెంట్ చేస్తాను. అలా మంచి అవ‌కాశాలు వ‌చ్చిన‌ప్పుడు త‌ప్ప‌కుండా ఇత‌ర భాషా చిత్రాల్లో న‌టిస్తాను. క్వాంటిటీ కంటే క్వాలిటీయే ముఖ్యం. అంటే పాత్ర ప్రాధాన్య‌త‌ను బ‌ట్టి న‌టిస్తాను. అయాన్ ముఖర్జీ, క‌ర‌ణ్ జోహార్ వ‌చ్చి అడిగారు. నాకు స్క్రిప్ట్ కాకుండా త్రీడీ వెర్ష‌న్‌లో నా పాత్ర గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తేనే నేను చేస్తాను అని వారితో చెప్పాను. వాళ్లు మూడు నెల‌లు స‌మ‌యం తీసుకుని త్రీడీ వెర్ష‌న్ త‌యారు చేశారు. నా 15 నిమిషాల క్యారెక్ట‌ర్ న‌చ్చ‌డంతో సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నాను. అయాన్ ముఖ‌ర్జీ, క‌ర‌ణ్‌జోహార్‌, ర‌ణ‌భీర్ క‌పూర్‌, అలియా వంటి టాలెంటెడ్ ఆర్టిస్టుల‌తో ప‌నిచేయ‌డం ఎగ్జ‌యిట్మెంట్‌గా అనిపించింది. ఇక అమితాబ్ గారి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్ప‌టికే బ‌ల్గేరియాలో ఓ వారం షూటింగ్ జ‌రిగింది.

`ఆర్.ఎక్స్ 100` గురించి...
- రీసెంట్‌గా ఆర్‌.ఎక్స్ 100 మూవీ చివ‌రి రెండు రీల్స్ చూశాను. సినిమా ఎక్స్‌ట్రార్డిన‌రీగా ఉంది. మంచి ప్ర‌య‌త్నం. సినిమాపై చాలా ర‌కాల కామెంట్స్ ఎందుకు వ‌చ్చాయో తెలియ‌దు. కానీ రైటింగ్‌, ఆర్టిస్టుల పెర్ఫామెన్స్ అన్నీ సూప‌ర్బ్‌గా కుదిరాయి. ఇదో జోన‌ర్ మూవీ అంతే.

త‌దుప‌రి చిత్రాలు...
-దేవ‌దాస్ షూటింగ్ ప‌ది రోజులు మిన‌హా మొత్తం పూర్త‌యింది. అందులో నా పేరు దేవ్‌.. నాని పేరు దాస్‌. దేవ‌దాస్ కంప్లీట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ మూవీ. నాని చాలా టాలెంటెడ్ యాక్ట‌ర్‌. త‌న‌తో ప‌నిచేయ‌డం అద్భుతంగా ఉంది. ఈ సినిమా హిట్ అయితే సీక్వెల్ కూడా చేసేస్తాం. `బంగార్రాజు` సినిమాకు సంబంధించి క‌ల్యాణ్ కృష్ణ‌, స‌త్యానంద్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. ఏదీ కుదిరితే దాన్ని ముందుగా అనౌన్స్ చేస్తాను.

Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved