Tharun Bhasckar's Ee Nagaraniki Emaindi Set for Release
With all Post Production work on the film done, Ee Nagariniki Emaindi is gearing up for a grand worldwide release on the 29th of this month.
The movie is being produced by Suresh Babu under the Suresh Productions banner. With a shoot schedule that lasted 50 days, this buddy comedy was shot extensively in Goa and Hyderabad.
Tharun Bhascker won the National Award for his debut film, Pellichoopulu. Expectations are high for his second film with audiences expecting more of the same nonstop comedy that was a hit in his first outing. The glimpses of romance seen in the trailer will be another major factor that will pull the audience to the theatres.
The team put together by Tharun Bhascker and Suresh Productions has contributed to what could be the most process driven Production in recent times. The film features newcomers in all 4 male lead roles with supporting performances by Anisha Ambrose and another debutant - Simran Choudhary.
Made with some of the best young technical talent in the Industry, the film visuals looks fresh and unique. This can be credited to DoP Niketh Bommireddy. This movie, like Pellichoopulu, was shot with Sync Sound that greatly cut short the time spent in Post Production.
The team had released the trailer of film about a week ago and it has generated a unique buzz for the film. There is also massive anticipation around the Music of the film after the success of their first single - "Aagi Aagi" which was praised for its soothing melody and lyrics.
The movie is being Distributed by Suresh Productions in India and Overseas Distribution is by Weekend Cinema.
విడుదలకు సిద్ధమైన తరుణ్ భాస్కర్ "ఈ నగరానికి ఏమైంది"!
విశ్వక్‌సేన్, సాయి సుశాంత్, వెంకట్ కాకుమాను, అభినవ్ గోమటం, అనీషా అంబ్రోస్, సిమ్రాన్ చౌదరి ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం 'ఈ నగరానికి ఏమైంది?'. తరుణ్ భాస్కర్ దర్శకుడు. డి.సురేశ్ బాబు నిర్మాత. ఈ సినిమా జూన్ 29న విడుదలవుతుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...
డి.సురేశ్ బాబు మాట్లాడుతూ - '''పెళ్ళిచూపులు' సినిమా తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వస్తోన్న చిత్రమిది. తరుణ్ భాస్కర్ ఎంటైర్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకున్నాడు. నేను షూటింగ్ మొదలైన తర్వాత ఓ రోజు పబ్‌లో జరిగే షూటింగ్‌కి మాత్రమే వెళ్లాను. ఫస్ట్‌టైమ్ పబ్‌లో ఎలాంటి శబ్దం లేకుండా ఉండటాన్ని చూశాను. యంగ్, ఎంథుసియాస్టిక్, ప్యాషనేట్ టీం కలిసి చేశారు. ఇప్పటి వాళ్లలో చాలా మంది క్రాఫ్ట్‌ని అర్థం చేసుకోవడం లేదు. దాని వల్ల క్వాలిటీ తగ్గిపోతుంది. కొత్త తరం చేసిన ఇలాంటి సినిమాల వల్ల కొత్త టాలెంట్ ఇండస్ట్రీలోకి వస్తుంది. సినిమాల్లో చిన్న, పెద్ద సినిమాలని ఉండవు. అన్నింటికి ఒకే రకమైన ప్రెషర్ ఉంటుంది. ఇలాంటి సినిమాలు సక్సెస్ అయితే ఇండస్ట్రీ బావుంటుంది. ఇలాంటి కొత్త ప్రాసెస్ వల్ల సినిమా నెక్స్‌ట్ రేంజ్‌కు వెళుతుంది. ఇలాంటి వ్యక్తులు ఇండస్ట్రీలో ఓ మార్క్‌ను క్రియేట్ చేస్తారు. సినిమా ఈ నెల 29న విడుదలవుతుంది'' అన్నారు.
తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ - '''పెళ్ళిచూపులు' అంత పెద్ద సక్సెస్ అవుతుందని నేను కూడా ఊహించలేదు. ఆ సక్సెస్ నుండి తేరుకోవడానికి కాస్త టైమ్ పట్టింది. సురేశ్‌బాబుగారి దగ్గరకెళ్లినప్పుడు 'నీ ఇష్టం వచ్చిన కథను తయారు చెయ్' అని ఆయన అన్నప్పుడు ఇంకా భయమేసింది. నేను షార్ట్‌ఫిలింస్ నుండి వచ్చిన వాడినే... అందులో సక్సెస్ కావడం కష్టం. ఆ జర్నీలో ఎమోషన్స్‌ను ఎవరూ పట్టించుకోరు. దాన్ని సినిమా తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఓ డ్రాఫ్ట్‌ను తయారు చేసుకుని సురేశ్‌బాబుగారికి చెబితే తొలి డ్రాఫ్ట్‌కే ఆయన ఓకే చెప్పేశారు. దాంతో నేను షాక్ అయ్యాను. నా టీంకి చెబితే వాళ్లు కూడా ఆశ్చర్యపోయారు. సగం సినిమా గోవాలో ఉంటుంది. ఫ్రెండ్‌షిప్ మీద నడిచే కథ. ఈ యూనిట్ ఇప్పుడు నా కుటుంబ సభ్యుల్లా అయిపోయారు. సినిమాటోగ్రాఫర్ నికేత్, మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ ఇలా అందరూ అద్భుతమైన అవుట్‌పుట్ ఇచ్చారు. పెళ్ళిచూపులు కంటే ఇది మంచి మూవీ అవుతుందని నమ్మకంగా ఉన్నాను. సురేశ్‌బాబు రీసెంట్‌గా సినిమా చూసి అప్రిషియేట్ చేశారు. అలాగే ప్రివ్యూస్ వేశాం. చూసిన వారందరూ బావుందని అన్నారు. పెళ్ళిచూపులు కంటే బెటర్‌గా ఉందని అన్నారు. నా స్టోరీ, నా ఫ్రెండ్స్ స్టోరీని ఈ సినిమాతో చెప్పగలిగాను. జూలై 29న పెళ్ళిచూపులు విడుదలైతే జూన్ 29న 'ఈనగరానికి ఏమైంది?' విడుదలవుతుంది. ఇందులో యూత్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టాను. అలాగని ఇది యువత మాత్రమే చూసే సినిమా కాదు. తల్లిదండ్రులు కూడా చూడాల్సిన సినిమా. ఎలాంటి వల్గారిటీ సినిమాలో ఉండదు. నిజాయతీగా చేసిన ప్రయత్నం. నిజానికి ఓ స్టార్ సినిమాను చేయడం కంటే చిన్న సినిమాను చేయడం చాలా కష్టం. ఎందుకంటే కంటెంట్‌ను అందరికీ రీచ్ అయ్యేటట్లు చేయడం ఎంతో కష్టతరం. అయినా సురేశ్‌బాబుగారు రిస్క్ తీసుకుని ఈ సినిమా చేశారు. లోకల్ కాన్సెప్ట్‌లతో తెలుగు సినిమాను గ్లోబెల్ స్థాయికి తీసుకెళ్లవచ్చునని ప్రూవ్ అవుతుంది. న్యూ ఏజ్ సినిమా వస్తుంది. కథే హీరో అవుతుంది. అది ఇక్కడ నుండే మొదలవుతుంది'' అన్నారు.
వివేక్‌సాగర్ మాట్లాడుతూ - ''తరుణ్ భాస్కర్‌తో చేసిన రెండో సినిమా. సినిమా బాగా ఉంటుంది. 29న థియేటర్స్‌కు మీ బ్యాచ్‌తో రండి చూసుకుందాం'' అన్నారు.
సాయి సుశాంత్ మాట్లాడుతూ - ''ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన తరుణ్ భాస్కర్‌కి, సురేశ్‌బాబుగారికి థాంక్స్'' అన్నారు.
అభినవ్ మాట్లాడుతూ - ''2015లో చెన్నైలో పెళ్ళిచూపులు చూశాను. తరుణ్‌లాంటి దర్శకుడితో పనిచేయగలుగుతానా? అనిపించింది. అయితే ఆ కోరిక ఇంత త్వరగా తీరుతుందని అనుకోలేదు. ఆడిషన్‌లో నన్ను సెలక్ట్ చేసుకున్నారు. సురేశ్‌బాబుగారి ప్రొడక్షన్‌లో సినిమా చేసినందుకు గర్వంగా ఉంది'' అన్నారు.
అనీషా అంబ్రోస్ మాట్లాడుతూ - ''సురేశ్ ప్రొడక్షన్‌లో 'గోపాల గోపాల'లో చిన్న పాత్ర చేశాను. మరోసారి ఈ బ్యానర్‌లో సినిమా చేయడం ఆనందంగా ఉంది. బ్యూటీఫుల్ టీం. వీరితో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
సిమ్రాన్ మాట్లాడుతూ - ''అవకాశం ఇచ్చిన సురేశ్‌బాబుగారికి, తరుణ్‌భాస్కర్‌కి థాంక్స్'' అన్నారు.