pizza
HBD censor completed
సెన్సార్ పూర్తి చేసుకున్న హెచ్ బి డి చిత్రం...
You are at idlebrain.com > News > Functions
Follow Us

17 November 2017
Hyderabad

లాగిన్ మీడియా బ్యానర్‌లో మేఘన, సంతోషి శర్మ, సల్మాన్, హిమాజ, మానస, అజయ్ తదితరులు నటిస్తున్న హెచ్ బి డి( హ్యాకెడ్ బై డెవిల్) చిత్రానికి దర్శకుడు కృష్ణ కార్తిక్ కాగా నిర్మాత వై. ఉదయ్ కుమార్ గౌడ్. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని 'ఎ' సెర్టిఫికెట్ రావడంతో చిత్ర యూనిట్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ హెచ్ బి డి సినిమా బాగావచ్చింది. సెన్సార్ వారు ఎ సర్టిఫికెట్ ఇవ్వడం ఓ రకంగా సంతోషంగా ఉంది, చిన్న నిర్మాతలు చిన్న సినిమాలను తీయడం మానేస్తే సినీ పరిశ్రమ చిన్నదిగా అయిపోతుంది కావున దయచేసి అందరూ ఎంకరేజ్ చేయాలని కోరుతున్నా.. ఈ నెల 25న మా బ్యానర్ నుంచి మరో కొత్త సినిమా ప్రారంభం జరగనుంది. హెచ్ బి డి చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరుతున్నా అన్నారు.

దర్శకుడు కృష్ణకార్తిక్ మాట్లాడుతూ.. మొదటి సినిమానే ప్రయోగాత్మకమైన సినిమా చేయాలని నిర్మాతలు కోరడంతో హెచ్ బి డి ని తీయడం జరిగింది. ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా సినిమా సెన్సార్ వరకు వచ్చినందుకు సంతోషంగా ఫీల్ అవుతున్నా.. పక్కా థ్రిల్లర్ మూవీ ఇది. కేవలం ప్రేక్షకులను భయపెట్టడానికే ఈ సినిమా చేయడం జరిగింది. మొదటగా సెన్సార్ వారు సినిమాకు 25 కట్ లు ఇచ్చారు... మేము క్లారిటీ ఇవ్వడంతోనే సెన్సారుబోర్డు రాజశేఖర్ గారు అగ్రీ అయ్యి 5 కట్ లకు కుదించారు. ఈ సందర్భంగా ఆయనకు నా కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నా అలాగే నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా... ఇటీవలే విడుదలైన హెచ్ బి డి సాంగ్స్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది సినిమాకు కూడా ఇదే విధమైన రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నా.. నా రెండవ సినిమా ఈ బ్యానర్లోనే త్వరలో ప్రారంభం కానుంది అని చెప్పారు.

సంగీత దర్శకుడు మహి మాట్లాడుతూ షార్ట్ ఫిల్మ్స్ కు సంగీతం ఇచ్చే నాకు ఈ చిత్రానికి, మరియు నెక్స్ట్ సినిమాకు కూడా అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు నా కృతఙ్ఞతలు.. తెలియచేస్తున్నాను అని అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్ మాట్లాడుతూ.. హెచ్ బి డి సినిమా బాగా వచ్చింది. ఇదే ఎంకరేజ్‌తో రెండవ సినిమా చేయడానికి పూనుకున్నాం... త్వరలో కొత్త సినిమా వివరాలతో మళ్లీ మీ ముందుకు వస్తాం అని అన్నారు.

మేఘన, సంతోషి శర్మ, సల్మాన్, హిమాజ, మానస, అజయ్ తదితరులు నటిస్తున్న చిత్రానికి డైలాగ్స్: అభయ్ శ్రీ, చేతన్ బండి, లిరిక్స్: రమేష్, రాజ్ కుమార్, డీఓపీ: కన్న కోటి, ఎడిటర్: కె ఎస్ స్వామి, మ్యూజిక్: మహి మదన్ ఎమ్ ఎమ్. కో డైరెక్టర్: రమేష్ పోలె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై. వినయ్ కుమార్ గౌడ్, ప్రొడ్యూసర్: వై. ఉదయ్ భాస్కర్, కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: కృష్ణ కార్తీక్.

 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved