బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'జయజానకినాయక'. రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్స్. ఈ సినిమా ఆగస్టు 11న విడుదలవుతుంది. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి, హీరో బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యాజైశ్వాల్, నందు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
మిర్యాల రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ - '''జయజానకినాయక' సినిమా ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి వరకు బోయపాటిగారు చేసిన సినిమాలన్నింటిలో 'జయజానకినాయక' బెస్ట్ మూవీ అని చెప్పగలను. ఈ మాట వినడానికి కాస్తా ఎక్కువగానే అనిపిస్తుంది. ఎందుకంటే బడ్జెట్‌పరంగానో, మరేదో దృష్టిలో పెట్టుకుని ఈ మాట చెప్పలేదు. బోయపాటిగారు ఇప్పటి వరకు 6 సినిమాలు చేశారు. ఆరు సినిమాలు సూపర్‌హిట్ సినిమాలే. ఈ సినిమాలన్నింటిలో ఏదో ఒక కంటెంట్ మనకు కనపడుతుంది. అలాగే ఈ సినిమాలో మంచి లవ్‌స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్, మాస్ ఆడియెన్స్‌కు కావాల్సిన యాక్షన్ ఉన్నాయి. సినిమాకు మంచి కథ కుదరడమే తొలి సక్సెస్. సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ముందు 45 నిమిషాలు సినిమాలో మంచి లవ్‌స్టోరీ ఉంటుంది. తర్వాత ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. ఈ సినిమా తర్వాత రకుల్‌ప్రీత్‌ని ప్రతి ఇంటిలోని మహిళ ఓన్ చేసుకుంటారు. నిజమైన లవ్ ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూస్తారు. సినిమాను తప్పకుండా ప్రేక్షకులు సూపర్‌హిట్ చేయాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
నందు మాట్లాడుతూ - ''సినిమా రేపు రిలీజ్ అవుతుంది. అందరికీ సినిమా ఎలా ఉంటుందో రేపు తెలుస్తుంది. బోయపాటిగారు షేర్ మార్కెట్‌లో షేర్‌లాంటి వ్యక్తి. ఈరోజు ఓ షేర్ వాల్యూ వంద రూపాయలుండి రేపు వెయ్యి రూపాయలవుతుందని తెలిస్తే, అప్పు చేసైనా ఆ షేర్ కొంటాం. అలాంటి వ్యక్తి బోయపాటిగారు. అందుకనే మిర్యాల రవీందర్‌రెడ్డిగారు డబుల్ నెంబర్ ఉన్న బడ్జెట్‌తో సినిమా చేశారు. సినిమాను చాలా డిటెయిల్డ్‌గా తెరకెక్కించే దర్శకుడు బోయపాటిగారు. ఇక బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్, ప్రగ్యా అందరూ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశారు. రేపు సినిమా ఏంటనేది సినిమా రిజల్ట్ చెబుతుంది'' అన్నారు.
ప్రగ్యా జైశ్వాల్ మాట్లాడుతూ - ''జయజానకినాయక కోసం అందరం ఎంతో కష్టపడ్డాం. ఓ ఫ్యామిలీలా కలిసి పోయాం. బోయపాటిగారు, రవీందర్‌రెడ్డిగారు సహా మంచి టీమ్‌తో పనిచేశాను. బోయపాటిగారి నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు బోయపాటిగారికి థాంక్స్. ఈ సినిమాలో గ్లామరస్ రోల్ చేశాను. రిషి పంజాబ్‌గారు సినిమాను ఎంతో గ్రాండ్ విజువల్స్‌తో తెరకెక్కించారు. సినిమా అందరినీ మెప్పిస్తుంది'' అన్నారు.
రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ - ''నాకు ఈ సినిమాలో జానకి క్యారెక్టర్ దొరకడం నా అదృష్టం. ఇంత పెద్ద ఎమోషన్ ఉన్న క్యారెక్టర్ చేయగలనని నమ్మకంతో అవకాశం ఇచ్చిన దర్శకుడు బోయపాటిగారికి థాంక్స్. సినిమా చూసిన బోయపాటిగారు చాలా బాగా చేశానని చెప్పారు. సినిమా చూసిన వారందరికీ ఈ సినిమాలో నా క్యారెక్టర్, స్ట్రాంగ్ ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. వీటన్నింటితో పాటు ప్యూర్ లవ్‌స్టోరీ ఉంటుంది. నిజమైన లవ్, కేర్, ఎమోషన్ ఎలా ఉంటుందో బోయపాటిగారు చూపించారు. పాటలు, ఫైట్స్ అన్ని కథలో భాగంగా ఉంటుంది. బన్నిగారు అన్ని ఎలిమెంట్స్‌ను సింక్ చేసి సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. సినిమా రేపు రిలీజ్ అవుతుంది. సినిమాను ఆదరించాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాను'' అన్నారు.
బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ - ''ఆర్.ఆర్‌తో సినిమాను చూశాను. చాలా ఎగ్జయిట్ అయ్యాను. ఇంత మంచి సినిమా నాకు ఇచ్చినందకు బోయపాటిగారికి థాంక్స్. కొన్ని సినిమాను ఇది నా సినిమా అని గర్వంగా చెప్పుకుంటాం. అలా నా కెరీర్ ప్రారంభంలో ఇది నా సినిమా అని జీవితాంతం చెప్పుకునేలా ఉంటుంది. బోయపాటికిగారికి థాంక్స్. ఇలాంటి సినిమాను రీచ్ కావడమే నా నెక్స్‌ట్ టార్గెట్. సినిమాను ఇంత గ్రాండ్‌గా తీసినందకు రవీందర్‌రెడ్డిగారికి థాంక్స్. చాలా గట్స్ ఉన్న నిర్మాత. బోయపాటిగారు సహా సినిమా యూనిట్‌నంతా నమ్మి ఇంత గ్రాండ్‌గా సినిమా చేశారు. మా టీమ్‌నంతా ఎంతో బాగా చూసుకున్నారు. నిర్మాత కష్టమేంటో నాకు తెలుసు. రవీందర్‌గారికి ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించి టాప్ లీగ్ ప్రొడ్యూసర్ అవుతారు. జానకి క్యారెక్టర్ రకుల్ తర్వాత మరేవరూ చేయలేరని అంటారు. ప్రగ్యా చాలా బాగా నటించింది. జగపతిబాబు, శరత్‌కుమార్ వంటి లెజెండ్స్‌తో పనిచేయడం ఆనందంగా ఉంది. ప్రేక్షకులు తమ సపోర్ట్‌ను అందించాలని కోరుతున్నాను'' అన్నారు.
బోయపాటి శ్రీను మాట్లాడుతూ - ''సినిమా ఆగస్ట్ 11న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. బెల్లంకొండ శ్రీనివాస్ ఎంతో ఇష్టపడి కష్టపడి చేసిన సినిమా కావడంతో రేపు సినిమాను చూసిన వారందరూ అతన్ని అప్రిసియేట్ చేస్తారు. భద్ర తర్వాత నేను చేసిన బ్యూటీఫుల్ లవ్‌స్టోరీ. భద్ర తర్వాత నేను చేసిన తులసి, సింహా, దమ్ము, లెజెండ్, సరైనోడు సినిమాలన్నీ వేటికవే ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఇదొక ఫీల్ గుడ్ మూవీ అని, మంచి ఎమోషనల్ మూవీ అని, మంచి యాక్షన్ మూవీ అని మాస్ ఆడియెన్స్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా ఇది. లవ్, ఎమోషన్స్, యాక్షన్ అన్ని కలగలిసిన స్క్రిప్ట్స్ దొరకడం చాలా ఆరుదు. ఎ,బి, సి సెక్షన్ ఆడియెన్స్ ఓకే వరుసలో కూర్చుని చూసే సినిమా ఇది. మా ప్రయత్నంతో ఎంతో మంచి సినిమా చేయాలో అంత మంచి సినిమా. నేను చేసిన నిర్మాతలందరితో నేను హ్యాపీనే. అల్లు అరవింద్‌గారితో సరైనోడు సినిమా చేశాను. ఎంతో కంఫర్ట్‌బుల్ నిర్మాత. ఆ రేంజ్‌లో మిర్యాల రవీందర్‌రెడ్డి సినిమా చేశాడు. నా కూతురి పేరుపై పెట్టిన బేనర్ నిలబడాలి. మంచి టేస్ట్ ఉన్న నిర్మాతగా నిలిచిపోవాలని అన్నాడు. అలాగే సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను చేశారు. మనకు
ఇలాంటి నిర్మాతలు ఎంతో అవసరం. సినిమాను ప్రేమించేవాళ్లలో రవీందర్‌రెడ్డిగారు ఒకరు. మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తే వాళ్లు ఆ సినిమాను గుండెల్లో పెట్టుకుని చూస్తారు. సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని భావిస్తున్నాను'' అన్నారు.