ఉమేష్ గుప్తా మాట్లాడుతూ - ``ఖాకి చిత్రంతో తొలిసారి చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నాం. టాలెంటెడ్ ఆర్టిస్ట్స్ కార్తి, రకుల్ తొలిసారి జంటగా నటించిన ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అందరూ సినిమాను చూడాలని ఆసక్తిగా ఉన్నారు. జిబ్రాన్ సంగీతం అందించిన పాటలు అల్రెడి మార్కెట్లో పెద్ద హిట్ సాధించాయి. ఈ వారం సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అన్ని ఏరియాలను మంచి రేట్స్ అమ్మేశాం. మ్యూజిక్ పెద్ద హిట్ సాధించిన విధంగానే సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నాం`` అన్నారు.
రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ - ``ఖాకి నాకు చాలా స్పెషల్ మూవీ. ఎందుకంటే స్టార్టింగ్ డే నుండి ఈ రోజు వరకు ఓ పాజిటివిటీతో చేస్తోన్న సినిమా ఇది. సినిమాను దర్శకుడు వినోద్‌గారు అద్భుతంగా తెరకెక్కించారు. సాంగ్స్, సీన్స్ బ్యూటీఫుల్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు క్యారెక్టర్, లుక్ చేయలేదు. ఆడియెన్స్ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎగ్జయిటింగ్‌గా ఉంది. కార్తి చాలా హార్డ్ వర్కర్. తను ప్యాషన్‌తో చేసిన సినిమా ఇది. ఆదిత్య మ్యూజిక్ సంస్థ ఖాకి సినిమా తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా పెద్ద హిట్ సాధించి వారికి నిర్మాతలుగా మంచి పేరు రావాలి`` అన్నారు.
హీరో కార్తి మాట్లాడుతూ - ``వినోద్‌గారు జరిగిన ఘటనను ఆధారంగా చేసుకుని కథను తయారు చేసుకున్నారు. పదేళ్ల పాటు తమిళనాడు, ఇండియన్ పోలీసులందరూ కలిసి సాల్వ్ చేసిన ఓ కేసును బేస్ చేసుకుని స్క్రిప్ట్ తయారు చేసుకున్నారు. స్క్రీన్‌పై సినిమాను చూస్తున్నప్పుడు నిజంగా మన పోలీసులు కేసు కోసం ఇంత కష్టపడ్డారా? అనిపించింది. పోలీసులంటే ఇంకా గౌరవం పెరిగింది. కమర్షియల్ మూవీ. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మూవీ. బ్యూటీఫుల్ ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి. ఓ పోలీస్ ఆఫీసర్‌కి తన భార్య పట్ల ఉండే ప్రేమ, ప్రజల పట్ల ఉండే బాధ్యతను సినిమాలో చూస్తారు. ఇలాంటి సినిమా చేయడం చాలా ఇన్‌స్ఫైరింగ్‌గా ఉంది. ఆదిత్య మ్యూజిక్‌వారు నిర్మాతలుగా తొలిసారి ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. వారెంతో బాగా ప్రమోషన్ చేస్తున్నారు. దక్షిణాది నుండి ఉత్తరాది వరకు వెళ్లి కేసు సాల్వ్ చేశారు. పదేళ్ల క్రితం ఇంత టెక్నాలజీ లేనప్పుడు ..పోలీసులు ఎంతో రిస్క్ చేసి దొంగలను ఎలా పట్టుకున్నారో అనేదే కేసు. కొత్త ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుంది. రకుల్‌ను ప్రియా అనే క్యారెక్టర్‌లో కొత్తగా చూస్తారు. చక్కగా నటించింది`` అన్నారు.