నిఖిల్, సిమ్రాన్ పరింజ, సంయుక్తా హెగ్డే నాయకా నాయికలుగా రూపొందిన చిత్రం 'కిరాక్ పార్టీ'. శరణ్ కోపిశెట్టి దర్శకుడు. ఏ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 16న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా హైదరబాద్ రామానాయుడు స్టూడియోలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...
అనిల్ సుంకర మాట్లాడుతూ - ''సినిమా మే 16న సినిమా విడుదలవుతుంది. మార్చి 15న ఇంటర్ పరీక్షలు పూర్తవుతాయి. తర్వాత రోజున మా సినిమా విడుదలవుతుండటం ఆనందంగా ఉంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ కాంటెస్ట్‌ను నిర్వహిస్తున్నాం. సినిమాలో ఉపయోగించిన కారును ఈ కంటెస్ట్‌లో గెలిచిన వారికి ప్రథమ బహుమతిగా అందచేస్తాం. అలాగే రేపటి నుండి రెండు రాష్ట్రాల్లో టూర్‌ను నిర్వహిస్తున్నాం. ఈ నెల 10న విజయవాడలో ఆడియో వేడుకను నిర్వహస్తున్నాం. అలాగే 13న ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తాం. శివ సినిమా చూసిన తర్వాత అలాంటి సినిమా చేయగలనా? లేదా? అనే ఆలోచన ఉండేది. దాని ఇన్‌స్పిరేషన్‌తో కన్నడ మాతృకను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. శివ, హ్యాపీడేస్ తరహాలో పూర్తిస్థాయి కాలేజ్ నేపథ్యంలో సాగే చిత్రమిది. అలాంటి నేపథ్యంలో సినిమా వచ్చి చాలా రోజులైంది కనుక.. కిరాక్ పార్టీ తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది. శరణ్ సినిమాను చక్కగా తెరకెక్కించాడు. చందు మొండేటి, సుధీర్ వర్మలు సినిమాకు తమ వంతు సహకారాన్ని అందించారు'' అన్నారు.
హీరో నిఖిల్ మాట్లాడుతూ - ''నా తొలి సినిమా 'హ్యాపీడేస్' తర్వాత పూర్తిస్థాయిలో మరో కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా చేయలేదు. ఇది 15 సినిమా. ఇన్ని సినిమాల్లో నా గుండెకు దగ్గరైన సినిమాల్లో ఇదొకటి. సినిమాను ప్రేక్షకులకు రీచ్ చేయించడానికి రేపటి నుండి రెండు రాష్ట్రాల్లో టూర్‌కి వెళుతున్నాం. యూత్‌ఫుల్ మూవీ. అందరికీ నచ్చుతుంది'' అన్నారు.
డైరెక్టర్ శరణ్ కోపిశెట్టి మాట్లాడుతూ - ''శివ', 'హ్యాపీడేస్' చిత్రాలను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని కన్నడ కిరిక్ పార్టీని తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించాం. ఈ నెల 16న సినిమా విడుదలవుతుంది. తప్పకుండా అందరూ వారిని తెరపై చూసుకునేలా సినిమా ఉంటుంది'' అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ సిమ్రాన్ పరింజ, సంయుక్తా హెగ్డే, అప్పు, జాన్, మౌర్య, రాకేందు మౌళి తదితరులు పాల్గొన్నారు.