ప్రభుదేవా, ఐశ్వర్య రాజేష్ తారాగణంగా ప్రమోద్ ఫిలింస్, ట్రైడెంట్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై విజయ్ దర్శకత్వంలో ప్రతీక్ చక్రవర్తి, శృతి నల్లప్ప, ఆర్.రవీంద్రన్ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'లక్ష్మీ' ఈ సినిమా పాత్రికేయుల సమావేశం గురువారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ఈ సందర్భంగా...
ప్రభుదేవా మాట్లాడుతూ - ''దర్శకుడు విజయ్ నాకు సోదరుడితో సమానం. తనతో 'అభినేత్రి' సినిమా చేయడం గొప్ప అనుభవం. తర్వాత మా కాంబినేషన్‌లో అభినేత్రి 2 సినిమా చేద్దామని కూడా అనుకున్నాం. ఆ సమయంలో ఈ స్క్రిప్ట్ విన్నాను. చాలా బాగా నచ్చింది. ఇలాంటి సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా ముఖ్యం. శామ్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. సినిమా చూస్తే రేపు ఆడియెన్స్‌కు అర్థమవుతుంది. డాన్స్ ఫిలిం చేయాలని విజయ్ అంటే.. ఓ రేంజ్‌లో చేయాలని అనుకున్నాను. నిర్మాతలు కూడా నా అభిప్రాయాన్ని అర్థం చేసుకుని మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. డాన్స్ మూవీస్ వచ్చి చాలా రోజులయ్యాయి. ఈ సినిమాలో నటించిన పిల్లలందరూ చాలా బాగా చేశారు. నేను అన్నట్లుగానే సినిమా ఓ రేంజ్‌లో ఉంటుంది. ఇండియా మొత్తం నుండి పిల్లలను ఎంపిక చేశారు. ఈ పిల్లలతో చేయడం మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చింది'' అన్నారు.
దర్శకుడు ఎ.ఎల్.విజయ్ మాట్లాడుతూ - ''ప్రభుదేవా డాన్సింగ్ లెజెండ్. ఆయనతో ఎప్పుడు సినిమా చేసినా ఓ లెర్నింగ్ ఎక్స్‌పీరియెన్స్. మంచి స్క్రిప్ట్ సెన్స్ ఉన్న వ్యక్తి ప్రభుదేవాగారు. నిర్మాతలు శృతి, ప్రతీక్‌లు చక్కగా సినిమా చేశారు'' అన్నారు.
శృతి నల్లప్ప మాట్లాడుతూ - ''ప్రభుదేవాగారితో సినిమా చేయడం నా కల. ఈ సినిమాతో అది నేరవేరినందుకు ఆనందంగా ఉంది'' అన్నారు.
ప్రతీక్ మాట్లాడుతూ - ''మేం ప్రభుదేవా గారితో సినిమా చేయాలని ముందుగా ఏమీ ప్లాన్ చేసుకోలేదు. ఏదో అలా జరిగింది. తెలుగులో మా బ్యానర్‌లో వస్తున్న సినిమా ఇది. భవిష్యత్‌లో తెలుగు, తమిళంలో మరిన్ని సినిమాలు చేస్తాం'' అన్నారు.