Telugu film industry cautions some of drug addicted film personalities to come out of it
ఆ పది మంది డ్రగ్స్ మత్తును వీడి బయటకు రావాలని కోరుకుంటున్నాం: నిర్మాత అల్లు అరవింద్
`టాలీవుడ్ ఇండస్ర్టీలో కొంత మంది యంగ్ స్టార్స్ డ్రగ్స్ మత్తులో తేలుతున్నట్లు తెలిసింది. అలాంటి వాళ్ల వల్ల మొత్తం ఇండస్ర్టీకే చెడ్డ పేరు వస్తుంది. మత్తులో తేల్తుంది ఆ 10 మందే కావచ్చు. కానీ ఆ ప్రభావం మిగతా వారిపై కూడా పడుతుంది. వాళ్లంతా తక్షణం మత్తు నుంచి బయటకు రావాలి. ఈ విషయాలేవి బయటకు తెలియనవి అనుకుంటున్నారు. కానీ ప్రభుత్వం..సినిమా ఇండస్ర్టీ దీనిని ఓ కంట కనిపెడుతూనే ఉంది. అలాంటి వాళ్లంతా వెంటనే మత్తును వీడి బయటకు రావాలి. లేదంటే పరిణామాలు వేరుగా ఉంటాయని` నిర్మాత అల్లు అల్లు అరవింద్ హెచ్చరించారు. ఇటీవలే టాలీవుడ్ లో కొంత మంది డ్రగ్స్ తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా తెలుగు సినిమా ఫిలిం ఛాంబర్ తరుపున బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అరవింద్ పై విధంగా స్పందించారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ, ` ముంభై నుంచి ఈ కల్చర్ మన ఇండస్ర్టీకి పాకింది. రేవ్ పార్టీలో ఒకరిద్దరు సపరేట్ అయి మిగతా వారిని వారిపట్ల ఆకర్షితులు చేయడం జరుగుతుంది. టేస్ట్ కోసం వెళ్లినా తర్వాత డ్రగ్స్ కు బానిసలవుతున్నారు. కళ్లు మూసుకుని పాలు త్రాగుతున్నాం అనే భ్రమలో ఉంటే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. దీని వల్ల వాళ్ల ఆరోగ్యంతో పాటు..కుటుంబాలు కూడా చిన్నాభిన్నం అవుతున్నాయి. అలాంటి వాళ్లకు డ్రగ్స్ పై అవగాహన కల్పించాలి. ప్రభుత్వం వాళ్లను శిక్షించాలని భావించలేదు. మత్తు నుంచి బయటకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది. అయితే ఇలాంటి వాళ్లందరికీ ఎవరు పంపిణీ చేస్తున్నరన్న దానిపై మాత్రం సీరియస్ గా కసరత్తు చేస్తోంది. దయచేసి ఇలాంటి వాళ్లంతా చెడును వీడి మంచి మార్గంలో కి రావాలని కోరుకుంటున్నా` అని అన్నారు.
నిర్మాత డి.సురేష్ బాబు మాట్లాడుతూ, ` డ్రగ్స్ సోసైటీకి హానికరం. ఇలాంటి మార్గంలో వెళ్లే వాళ్లు కు అవేరనస్ కల్పించాలి. తెలుగు సినిమా ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంది. ఆ వాతావరణం చెడపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది` అని అన్నారు.
`మా` అధ్యక్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ, ` ఎవరికైనా కష్టం వస్తే..వాళ్ల బాధలను పంచుకోవడం అనేది తెలుగు సినిమా ఇండస్ర్టీ ఎప్పటి నుంచో చేస్తున్నదే. ఇప్పుడు హాట్ టాపిక్ అయిన డ్రగ్ మహమ్మారిని కూడా మన దగ్గర నుంచి తరిమేయాలి. దీనిపై అందరికీ అవగాహన కల్పించాలి` అని అన్నారు.
ఈ కార్యక్రమంలో `మా` ఎగ్జిక్యుటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, జనరల్ సెక్రటరీ వి.కె. నరేష్, ట్రెజరర్ పరుచూరి వెంకటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ ఏడిద శ్రీరామ్ పాల్గొన్నారు.