శ్రీమతి బొడ్డు లక్ష్మి సమర్పణలో ఈస్ట్‌వెస్ట్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్‌కార్తీక్, సనాఖాన్ హీరో హీరోయిన్లుగా విశాఖ థ్రిల్లర్ వెంకట్ దర్శకత్వంలో వరప్రసాద్ బొడ్డు నిర్మిస్తున్న చిత్రం `మామ..ఓ..చందమామ`. ఈ సినిమా చిత్రీకరణ నవంబర్ 7నుండి ప్రారంభం కానుంది. ఈ సంరద్భంగా సోమవారం హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో...
మరుధూరి రాజా మాట్లాడుతూ - ``కొత్త దర్శక నిర్మాతలు, కొత్త టీంతో కలిసి చేస్తున్న ప్రయత్నం. ప్రొడ్యూసర్ వరప్రసాద్ బొడ్డుగారు ఒక లక్ష్యంతో చేస్తున్న సినిమా ఇది. వైజాగ్‌లో కొరియోగ్రాఫర్‌గా ఎన్నో సంస్థలను నడిపిన వెంకట్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మున్నాకాశీ మంచి ట్యూన్స్‌ను అందిస్తున్నారు. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో పల్లెటూరులోని బంధాలు, అనుబంధాలు గురించి తెలియజేసే చిత్రం`` అన్నారు.
సహ నిర్మాత మురళి సాధనాల మాట్లాడుతూ - ``18 సంవత్సరాలుగా యు.ఎస్‌లోనే ఉంటున్నాతెలుగు సినిమాలను ఫాలో అవుతూ వస్తున్నాం. అలాగే రెండు షార్ట్ ఫిలింస్ కూడా చేశాం. ఆ అనుభవంతో పాటు డైరెక్టర్ వెంకట్ చెప్పిన కథ నచ్చడంతో తెలుగులో సినిమా చేయడానికి రెడీ అయ్యాం. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే బంధాలు, అనుబంధాలతో సాగే చిత్రమిది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పల్లెటూర్లతో పాటు వైజాగ్ లేదా హైదరాబాద్‌లో సినిమాను చిత్రీకరిస్తాం. సినిమా నవంబర్ 7 నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి ఫిభ్రవరిలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.
Glam gallery from the event
హీరో రామ్‌కార్తీక్ మాట్లాడుతూ - ``బ్యూటీఫుల్ లవ్‌స్టోరీ. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్`` అన్నారు.
సనాఖాన్ మాట్లాడుతూ - ``మంచి ఫీల్ గుడ్ ఫ్యామిలీ స్టోరీ. కథ వినగానే నచ్చింది. మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్`` అన్నారు.
దర్శకుడు విశాఖ థ్రిల్లర్స్ వెంకట్ మాట్లాడుతూ - ```వీలైతే ప్రేమతో..` అనే సినిమా తర్వాత నేను డైరెక్ట్ చేస్తున్న చిత్రమిది. ఇప్పుడు రూపొందనున్న మామ..ఓ..చందమామ గ్రామీణ నేపథ్యంలో సాగే బంధాలు, అనుబంధాలు, అప్యాయతలను తెలియజేసేదిగా ఉంటుంది. కథ వినగానే దర్శక నిర్మాతలు సినిమా చేయడానికి అంగీకరించారు. సినిమా అందరికీ నచ్చే మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నాం`` అన్నారు.
ఈ కార్యక్రమంలో కేధారి శంకర్, ఆర్ట్ డైరెక్టర్ ఉత్తర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.