రామ్ కార్తీక్, సనా ఖాన్ హీరో హీరోయిన్లుగా శ్రీమతి బొడ్డు శ్రీలక్ష్మి సమర్పణలో.. ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై వరప్రసాద్ బొడ్డు నిర్మిస్తున్న చిత్రం `మామ చందమామ`. మురళి సాధనాల ఈ చిత్రానికి సహ నిర్మాత. ఈ చిత్రం డిసెంబర్ 15న విడుదలవుతోంది. ఈ చిత్రంలో సన హీరోయిన్. సుమన్, జీవా, గీతాంజలి తదితర సీనియర్ ఆర్టిస్టులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో..
హీరో రామ్ కార్తీక్ మాటాడుతూ.. ``డిసెంబర్ 15న సుమారుగా 15 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో మా సినిమా `మామ చందమామ` సినిమా విడుదలవుతుంది. అలాగే అన్ని సినిమాలు హిట్ కావాలని కోరుకుంటున్నాను. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన చిత్రమిది.
'ఇట్స్ మై లైఫ్, దృశ్యకావ్యం, ఇద్దరి మధ్య' చిత్రాల తర్వాత నేను నటించిన సినిమా 'మామ ఓ చందమామ'. అమెరికాలో స్థిరపడిన వరప్రసాద్-మురళి ఈ చిత్రాన్ని మన సంస్కృతీసంప్రదాయాలకు అద్దం పట్టేలా ప్రకృతి అందాల నడుమ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించారు. మా దర్శకుడు థ్రిల్లర్ వెంకట్ ప్రతి ఫ్రేమ్ ను ఎంతో అందంగా తీర్చిదిద్దారు. సుమన్, గీతాంజలి వంటి సీనియర్ ఆర్టిస్టులతో నటించడం మంచి అనుభూతినిచ్చింది. ఇందులో నేను చేసిన 'చంటి' పాత్ర నా కెరీర్ కి మంచి బ్రేక్ అవుతుంది. అలాగే మా సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను``అన్నారు.
సనా మాటాడుతూ `' నేను ముంబైలో పుట్టి పెరిగాను. తెలుగులో తెలుగులో దిక్కులు చూడకు రామయ్యా, కత్తి సినిమాల్లో నటించాను. మామ చందమామ నాకు మూడో సినిమా. గత చిత్రాలకు భిన్నంగా విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన చిత్రమిది. సినిమాను రాజమండ్రి, కాకినాడ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఆ ప్రాంతాల్లో జరిగిన షూటింగ్ ఎన్నో మధురానుభూతులు ఇచ్చింది. ఈ సినిమాలో నా పాత్ర పేరు కీర్తి. అల్లరిచిల్లరగా తిరిగే ఒక స్వచ్ఛమైన అమ్మాయి పాత్రను నేను ఎంతగానో ఎంజాయ్ చేశాను. లవ్, రొమాన్స్, కామెడీ, యాక్షన్ వంటి అంశాలన్నీ సమపాళ్లలో మేళవించి రూపొందించిన 'మామ ఓ చందమామ' టైటిల్ కి తగ్గట్టుగా బావుంటుంది. ఫీల్ గుడ్ ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి`` అన్నారు.