3 December 2016
                            Hyderabad
                        
                          మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటించిన `పులి మురుగన్` చిత్రాన్ని తోమిచన్ ముల్కపాదమ్ సమర్పణలో శ్రీ సరస్వతి ఫిల్మ్స్ పతాకం పై 
                          `మన్యం పులి` పేరుతో ప్రముఖ నిర్మాత సింధూర పువ్వు కృష్ణారెడ్డి విడుదల చేశారు. డిసెంబర్ 2న మన్యం పులి సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...
                          చిత్ర నిర్మాత సింధూర పువ్వు కృష్ణారెడ్డి మాట్లాడుతూ - ``మన్యం పులి సినిమాకు అన్నీ ఏరియాస్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా మాస్ ఆడియెన్స్ సినిమా ఎక్స్ట్రార్డినరీగా ఉందంటున్నారు. బాహుబలి తర్వాత ఓ మంచి సినిమా చూశామంటున్నారు. ఓ మాస్, యాక్షన్ ప్రధానంగా మోహన్‌లాల్ నటన బావుంది. ఒకే పాత్రలో అన్నీ వేరియేషన్స్ చూపించడం అందరికీ సాధ్యం కాదు. మోహన్‌లాల్ అన్నీ రకాల ఎమోషన్స్ పండిచారు. యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టారు. వెంకేష్, సురేష్‌బాబు, మహేష్‌బాబు సినిమా చూసి బావుందన్నారు. మనం కూడా హాలీవుడ్ సినిమాలు తీయవచ్చునని ఈ సినిమా ప్రూవ్ చేసింది. ఆదివారం, సోమవారం కలెక్షన్స్ పెరుగుతాయనుకుంటున్నాం. మోహన్‌లాల్‌గారు కూడా తెలుగులో వస్తున్న రెస్పాన్స్ చూసి హ్యాపీగా ఫీలైయ్యారు`` అన్నారు. 
                          జగపతి బాబు, కమలినీ ముఖర్జీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు దర్శకుడు : వైశాఖ, కథ: ఉదయకృష్ణ, సంగీతం: గోపీ సుందర్, కెమెరా: షాజీకుమార్, ఎడిటింగ్ః జాన్ కుట్టి, షిజాస్ పి.యూనస్, విజువల్ ఎఫెక్ట్స్ః విజయ్, స్రిస్, పిక్స్ల్, నిర్మాతః సింధూరపువ్వు కృష్ణారెడ్డి, దర్శకత్వంః వైశాక్