‘బాహుబలి’ చిత్రంలో రాజమాత శివగామిగా అలరించిన రమ్యకృష్ణ ఇప్పుడు ‘మాతంగి’గా ప్రేక్షకులను అలరించబోతున్నారు. కన్నన తమ్మార్కులమ్ దర్శకత్వంలో మలయాళంలో రూపుదిద్దుకొన్న ‘మాతంగి’ చిత్రాన్ని రమ్యకృష్ణ సోదరి వినయ్ కృష్ణన్ తెలుగులోకి అనువదిస్తున్నారు. రమ్మకృష్ణ ప్రధాన పాత్రధారిణిగా వెయ్యి ఎపిసోడ్స్‌తో ఇంతకుముందు ‘వంశం’ సీరియల్‌ను నిర్మించారు వినయ్ కృష్ణన్. తెలుగు నేటివిటీకి అనుగుణంగా సినిమాలో కొన్ని మార్పులు చేసినట్లు ఆమె చెప్పారు. రమ్మకృష్ణతో పాటు ఇద్దరు చిన్నారులు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. డిసెంబర్ 15న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా...
నందినీ రెడ్డి మాట్లాడుతూ - ``రమ్యకృష్ణగారికి వినయ్ కృష్ణన బిగ్గెస్ట్ క్రిటిక్. ఆమెకు అంత పట్టాన ఏదీ నచ్చదు. ఇక మాతంగి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారంటే సినిమాలో తప్పకుండా విషయం ఉంటుంది. ఇక రమ్యకృష్ణగారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆహ్వానం లాంటి సినిమా చేయాలన్నా, నీలాంబరిగానైనా, శివగామిగానైనా ఏదీ చేసినా..సినిమా చూస్తే తను తప్ప మరెవరూ ఈ సినిమా చేయలేరనిపిస్తుంది. ఇప్పుడు మాతంగిగా మన ముందుకు వచ్చారు. ఈ లుక్ చూస్తుంటే నాకు అమ్మోరు సినిమా గుర్తకొస్తుంది. ఎన్నో షేడ్స్ ఉన్నాయి. మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ సినిమా కావాలి`` అన్నారు.
రమ్యకృష్ణ మాట్లాడుతూ - ``సన్ టీవీలో ప్రొడక్షన్‌ను చాలా రోజులుగా చేస్తున్నాం. తెలుగులో మేం తొలిసారి చేస్తున్న చిన్న ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని తెలుగు ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని భావిస్తున్నాను. అన్ని ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమా డిసెంబర్ 15న విడుదలకానుంది. ఈ సినిమాను తెలుగు ఆడియెన్స్‌కు నచ్చేలా ఎడిట్ చేసింది కృష్ణవంశీగారే. తప్పకుండా సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది`` అన్నారు. ఈ చిత్రానికి రచన: వెన్నెలకంటి, సంగీతం: రతీష్ వేగ, నిర్మాత: వినయ్ కృష్ణన, దర్శకత్వం: కన్నన తమ్మార్కులమ్. బాలీవుడ్ నటుడు ఓంపురి ఇందులో కీలక పాత్ర పోషించారు. జయరామ్, షీలూ అబ్రహాం, సంపత రాజ్, సిద్దిఖి, అక్షర కపూర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి రచన: వెన్నెలకంటి, సంగీతం: రతీష్ వేగ, నిర్మాత: వినయ్ కృష్ణన, దర్శకత్వం: కన్నన తమ్మార్కులమ్.