ఆల్ ఇండియా స్టార్ శ్రీదేవి ప్రధాన పాత్రలో రవి ఉద్యవార్ దర్శకత్వంలో మ్యాడ్ ఫిలింస్, థర్డ్ ఐ పిక్చర్స్ పతాకాలపై నిర్మాణం జరుపుకుంటున్న విభిన్న కథా చిత్రం 'మామ్‌స. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో...
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ - ''ఇండియాలో అన్ని జనరేషన్స్‌కి తెలిసిన ఒకే ఒక పేరు శ్రీదేవి. ఛైల్డ్ ఆర్టిస్ట్ నుంచి మామ్ వరకు జర్నీ చేయడమంటే మామూలు విషయం కాదు. శ్రీదేవితో 24 సినిమాలు చేసిన ఏకైక దర్శకుడిని నేనే. శ్రీదేవి డేట్స్ ఇచ్చి, సురేష్‌బాబు ఫైనాన్స్ చేసి, కోన కథ అందిస్తే శ్రీదేవి సిల్వర్ జూబ్లీ మూవీ చేస్తాను. ఏదైనా సినిమా రిపోర్ట్ విన్న తర్వాత బాగుందని తెలిస్తే వెళతాం. కానీ, శ్రీదేవి సినిమాలో వుందని తెలిస్తే ఆలోచించకుండా వెళ్తాం. ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ గ్లామర్‌గా వుంటుంది. యాక్టింగ్ ఇరగ్గొడుతుంది. హండ్రెడ్ పర్సెంట్ డాన్స్ బాగా చేస్తుంది. ఇన్ని క్వాలిటీస్ వున్న తర్వాత హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది. ఇంత కాలం తర్వాత మామ్ అనే సినిమా సెలెక్ట్ చేసుకుందంటే దానికి కారణం తనకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం వున్న స్టోరీ, డైరెక్టర్ దొరికాడు. కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా సూపర్‌హిట్ అవుతుంది'' అన్నారు.
స్టార్ ప్రొడ్యూసర్ డి.సురేష్‌బాబు మాట్లాడుతూ - ''దేవత, ముందడుగు, తోఫా.. ఇవన్నీ మా నాన్నగారు తీసారు. అప్పుడు నేను ఊరికే పక్కన నిలబడి వుండేవాడ్ని. నేను డైరెక్షన్ నేర్చుకుంది కూడా ఆ సినిమాల టైమ్‌లోనే. బోనీకపూర్ నాకు సోదరుడులాంటివారు. నేను బోనీపూర్ చేసిన సినిమాలన్నింటినీ చూస్తుండేవాడిని. ఈ సినిమాను బోనీ చేశాడంటే ఇది గ్రేట్ ఫిలిం. బిగ్గర్ మూవీస్ చేయడం నేను ముందు బోనీ దగ్గరే చూసేవాడిని. అంత డబ్బు ఎందుకు ఖర్చు పెడుతున్నావని అంటే సినిమాలు తప్పకుండా హిట్ అవుతాయని అనేవాడు. బోనీకపూర్ ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అంటే తను తప్పకుండా బాహుబలి సినిమాను నిర్మించగలడు. నాకు బ్రహ్మాపుత్రుడు చిత్రాన్ని హిందీలో తీయాలన్నా తనే చెప్పేవాడు. తమిళ సినిమాలన్నీ చూసి చెబుతుండేవాడు. నాకు మంచి అడ్వజైర్‌గా వర్క్ చేశాడు. మామ్ సినిమా తప్పకుండా మంచి హిట్ సాధిస్తుందనే నమ్మకం ఉంది. శ్రీదేవి సూపర్‌స్టార్. సినీ ప్రేక్షకులకు డ్రీమ్ గర్ల్. రషెష్ చూశాను. తను ఎక్సలెంట్‌గా నటించింది. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌లో సినిమా ఉంటుంది'' అన్నారు.
కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ - ''బోనీ కపూర్ ఏ సినిమా తీసినా మేకింగ్‌లో టాప్ క్లాస్‌గా తీస్తాడు. ఆయన సినిమాల మేకింగ్‌లో లాభనష్టాలు చూసుకోడు. తన సినిమాలంటే క్వాలిటీలో టాప్ క్లాస్‌గా ఉండాలని చూసే నిర్మాత. ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశాడు. సక్సెస్‌ఫుల్ రైటర్ అయిన కోన వెంకట్ కథ అందించిన ఈ సినిమాలు విడుదలైన అన్ని భాషల్లో తప్పకుండా పెద్ద సక్సెస్ సాధిస్తుంది. శ్రీదేవి నటనలో, అందంలో, యాక్టింగ్‌లో తిరుగులేని స్టార్. అప్పట్లో శ్రీదేవి ఎలా ఉండేవారో ఇప్పటికీ అలాగే ఉన్నారు. మన జీవితంలో అమ్మ పాత్ర ఎంత గొప్పదో తెలిసిందే. అటువంటి అమ్మ పాత్రపై తీసిన సినిమాలో శ్రీదేవిగారు అద్భుతంగా నటించారు. సినిమా తప్పకుండా పెద్ద హిట్ సాధిస్తుంది'' అన్నారు.
కోన వెంకట్ మాట్లాడుతూ - ''దేవుడు అన్ని చోట్ల ఉండకుండా అమ్మను సృష్టిస్తాడనేది ఎంత నిజమో, మామ్ సినిమా చేయడానికి శ్రీదేవిగారిని క్రియేట్ చేశారనేది అంతే నిజం. మేం సినిమా చూసిన ప్రతిసారి మా ఎమోషన్స్ తగ్గలేదు. 2013లో న్యూయార్క్‌లో బోనీ కలిసిన తర్వాతే ఈ సినిమా స్టార్ట్ అయ్యింది. ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమా తర్వాత నచ్చి చేసిన సినిమా ఇది. అందరూ చూసి గర్వించే సినిమా ఉంటే తప్ప శ్రీదేవిగారు సినిమా చేయరని బోనీగారు అప్పుడే చెప్పారు. నా దగ్గరొక పాయింట్ ఉంది సార్ అని లైన్ చెప్పాను. ఆయనకు అది నచ్చింది. తన నటనతో ప్రాణం పోశారు. ఆమె నటన అద్భుతంగా ఉంది. బోనీకపూర్‌గారు ది బెస్ట్ అవుట్‌పుట్ కోసం కాంప్రమైజ్ కాని నిర్మాత. ఆయనలాంటి నిర్మాత, శ్రీదేవి వంటి నటి, మంచి దర్శకుడు దొరకడం అదృష్టం.ఈ సినిమాలో భాగమవడం గర్వంగా ఉంది. సినిమా జూలై 7న విడుదల కానుంది. తెలుగు ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది. ఈ సినిమాతో శ్రీదేవిగారు జాతీయస్థాయిలో ఎన్నో అవార్డులు అందుకుంటారని కచ్చితంగా చెప్పగలను'' అన్నారు.
చిత్ర నిర్మాత బోనీ కపూర్ మాట్లాడుతూ - ''మంచి టాలెంట్ యొక్క కాంబినేషన్‌తో ఈ సినిమాను రూపొందించాం. నా భార్య శ్రీదేవి ఈ సినిమాకు ప్రాణం. ఆమె లేకుండా ఈ సినిమా సాధ్యమయ్యేది కాదు. ఈ సినిమా ఆమె కోసమే, ఆమె గురించే. శ్రీదేవి చాలా రకాల పాత్రలు చేసింది. ఇప్పటి వరకు ఆమె చేసిన పాత్రలన్నింటిని మించే పాత్ర మామ్ సినిమాలో శ్రీదేవి చేసింది. కొత్త నటిలా ఫీలై నటించారు. ఇప్పటి వరకు శ్రీదేవి చేయనటువంటి పాత్ర'' అన్నారు.
శ్రీదేవి మాట్లాడుతూ - ''ఈరోజు నాకు చాలా స్పెషల్ డే. మామ్ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందనేది ప్రేక్షకులే నిర్ణయిస్తారు. అయితే ఓ నటిగా నాకు శాటిస్పాక్షన్ ఇచ్చిన సినిమా మామ్. మా ఆయన బోనీ కపూర్‌గారు ఇంత మంచి గిఫ్ట్ ఇవ్వడం నా అదృష్టం. ఎ.ఆర్.రెహమాన్, నవాజుద్దీన్, అక్షయ్ ఖన్నా, డైరెక్టర్ రవి సహా ఒక బ్రిలియంట్ టీంతో వర్క్ చేశాను. ఇదొక సింపుల్ స్టోరీ. ఎమోషనల్ ఫ్యామిలీ సబ్జెక్ట్. అమ్మ, కూతురుకి సంబంధించిన సినిమా. ఈ లోకంలో అమ్మ ప్రేమ కంటే ఏదీ విలువైనది కాదు. సినిమా చూస్తే అర్థమవుతుంది. ఎమోషనల్ సినిమాయే కాదు, థ్రిల్లింగ్, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అందరికీ సినిమా తప్పకుండా నచ్చుతుంది'' అన్నారు.