బాలల దినోత్సవం సందర్భంగా ఇటీవల ఏపీ ప్రభుత్వం మూడు సంవత్సరాలకు కలిపి ఒకేసారి అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. 2014, 2015, 2016 ఏడాదులకగానూ నంది అవార్డులతో పాటు ఎన్టీఆర్ జాతీయ అవార్డు, రఘపతి వెంకయ్య, బి.ఎన్.రెడ్డి అవార్డు, నాగిరెడ్డి - చక్రపాణి స్టేట్ అవార్డులను ప్రకటించింది ప్రభుత్వం అయితే ఈ అవార్డుల విషయంలో సందిగ్ధత నెలకొంది. అవార్డులు వివాదస్పదం వైపుకు దారి తీస్తుంది. ఈ సందర్భంగా నల్లమలుపు బుజ్జి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
నల్లమలుపు బుజ్జి మాట్లాడుతూ 2014 విడుదలై సూపర్‌డూపర్ హిట్ అయిన రేసుగుర్రం చిత్రానికి నంది అవార్డు రాకపోవడం బాధకరం. బాక్సాఫీస్ వద్ద రికార్డు బద్ధలు కొట్టిన చిత్రం గురించి అందరికీ తెలిసిందే. సైమా వేడుకలో అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడిగా ఎంపికైన సంగతి తెలిసిందే. అలాగే ఫిలింఫేర్ ఉత్తమ హీరోగా అవార్డును అందుకున్నారు. జడ్జీలు, కమిటీ సభ్యులను ఎంపిక చేసి చిత్రాన్ని ఒకటి నాలుగు సార్లు చూడాలి. అందులో ఏది బాగుందనేది నిర్ణయించి దానికి అవార్డు ఇస్తే మాలాంటి నిర్మాతలకు చాలా ఆనందంగా ఉంటుంది. నంది అవార్డు మాకు రాలేదనేది కాదు. మంచి చిత్రానికి నంది అవార్డు ఇవ్వాలనేది మా ఉద్దేశం. యావరేజ్ చిత్రమైతే మేము ఇలా మీడియా సమావేశం పెట్టి వాదించాల్సిన అవసరం ఉండేది కాదు. ప్రభుత్వానికి విన్నవించుకునేది ఒక్కటే భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకూడదు. రేసుగుర్రం చిత్రానికి సైమా అవార్డు ఎందుకు వచ్చింది. ఫిల్మ్ ఫేర్ అవార్డు ఎలా వచ్చింది. మీరు కూడా ఏదో అవార్డు ఇవ్వాలి కదా? అధికారికంగా వచ్చి ఉన్నాయి కదా? దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదో అవార్డు ఇచ్చి ఉంటే బాగుండేది.అవార్డు వచ్చే అవకాశం ఉండి కూడా రాలేదనేదే మా బాధ`` అన్నారు.