6 December 2017
Hyderabad
గోపీచంద్ కథానాయకుడిగా ఏ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ "ఆక్సిజన్". గోపీచంద్ సరసన రాశీఖన్నా, అను ఏమాన్యూల్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మించారు. గతవారం విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు అందుకొంటూ విజయపధంలో దూసుకెళుతోంది. అయితే.. సినిమా ముఖ్యాంశమైన "టొబాకో నియత్రత్వం" కాన్సెప్ట్ ను మెచ్చిన స్టేట్ హెల్త్ అసోసియేషన్ మరియు "IDA", "Tobacco Intervention Initiative" సంస్థల కోసం నేడు "ఆక్సిజన్" స్పెషల్ షో హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ జ్వాల చైతన్య, డాక్టర్ సుధీర్ రెడ్డి, డాక్టర్ సత్యేంద్ర, డాక్టర్ పి.కరుణాకర్, డాక్టర్ ఎ.శ్రీకాంత్ మరియు హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎస్.నాగరాజులతోపాటు చిత్ర దర్శకుడు జ్యోతికృష్ణ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు జ్యోతికృష్ణ మాట్లాడుతూ.. "సినిమా విడుదలైనప్పుడు మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. చాలా ఏరియాస్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే.. విజయవాడ స్టేట్ హెల్త్ అసోసియేషన్ నుంచి శివశంకర్ గారు ఫోన్ చేసి "మేం చేయాల్సిన పనిని మీ సినిమా ద్వారా మీరు చేశారు" అంటూ ఒక అభినందన లేఖ పంపారు. అలాగే.. ఇప్పుడు మా చిత్రాన్ని చూసిన "IDA" అసోసియేషన్ మెంబర్స్ అందరికీ కృతజ్నతలు. ఈ చిత్రానికి చాలా అవార్డ్స్ ఎక్స్ ఫెక్ట్ చేస్తున్నాను. ఈ తరానికే కాదు భవిష్యత్ తరాలకు కూడా చాలా ముఖ్యమైన సినిమా "ఆక్సిజన్"" అన్నారు.