pizza
Dr. Rajendra Prasad felicitated for receiving US state honour
న‌ట కిరీటి డా.రాజేంద్ర‌ప్ర‌సాద్‌కి గౌర‌వం
You are at idlebrain.com > News > Functions
Follow Us

12 May 2018
Hyderabad

The Senate and General Assembly of the State of New Jersey have said that they are pleased to honour and salute Dr. Rajendra Prasad. He has been accorded with a Lifetime Achievement Award. A felicitation of the actor was held on Saturday in Hyderabad. Senior artist Kadambari Kiran hosted the event. It was graced by Relangi Narasimha Rao, Anil Ravipudi, Satish Vegesna, Nag Ashwin, Nandini Reddy, among others.

Director Nandini Reddy said, "Rajendra Prasad garu is my childhood friend. Wondering how? He has always been like a friend in my life, as watching his films destresses me and makes me happy. When he talks to others, he observes everybody's face so as to ascertain their expressions. I never imagined that I will meet him in my life."

Director Anil Ravipudi said, "If I am able to make entertaining movies, it's because I grew up watching his movies, learning from them. People call him 'Nata Kireeti'. I think he should be called 'Nava Kireeti', as he is capable of all 'rasas'. 'Maayalodu', 'Appula Appararao', 'Aa Okkati Adakku', 'Aa Naluguru' are just a few examples. He gave memorable performances in a number of movies. He is the most fast-forward artist ever. He will remain updated even after 50 years. He can teach upcoming artists a lot."

Senior director Relangi Narasimha Rao said, "I think I should call Rajendra Prasad garu my better-half. People inquire husband or wife about their spouse. Likewise, wherever I go, people inquire me about Prasad garu! We have done close to 30 movies together. It's a matter of huge pride that our actor has been honoured by the government in a country like the US. It's as big as the President of India standing up while giving the National Award to a Telugu film personality. I have watched 'Mahanati' and I can speak about his performance for one hour. Would any other hero have done the miser's role in 'Edurinti Mogudu Pakkinti Pellam'? In all his 235 movies or so, he has played a multitude of characters. I am very happy that the Senate has given Prasad garu Lifetime Achievement Award. I am very proud."

Director Nag Ashwin said, "When I wrote the 'Mahanati' script, I saw nobody else other than Rajendra Prasad garu who can play the Pedananna's character. Nobody knows what a huge support he was to Keerthy Suresh and the rest of us during the making of 'Mahanati'.

Director Satish Vegesna said, "I regard Rajendra Prasad garu as my Guru. Although I never learned anything from him directly, if I am a writer and a director today, it's because of 'Ladies Tailor'. In my college days, I learned the film's dialogues by heart and would narrate the film to my friends. That's how I slowly became a writer of comedies. I am lucky to be directing him for 'Srinivasa Kalyanam'. As long as Telugu cinema is there, we will smile watching his comedy."

Rajendra Prasad said, "Call it God's blessing or the fortune of my parents, I have received this honour. I am very sensitive by nature. And today, after listening to the speeches of the guests today, I am so moved that it's okay even if I die! In the last 40 years, so many have encouraged and stood with me. NTR garu was like a guru. I had no Godfather in the industry. At that time, it's the media that motivated me with its support. Today's artists hide their emotions. But I have always expressed what I feel. I salute all the directors, right from Relangi Narasimha Rao garu to today's directors like Satish Vegesna and Nag Ashwin for bearing with me. I am glad that these directors and writers are penning roles for me even in the generation of Mahesh Babu, Ram Charan, Jr. NTR and Bunny. It's an achievement for me. The success of 'Mahanati' also proves it," the 'Nata Kireeti' said.

"It feels as if I have restarted my career today! This honour from the Senate and General Assembly of New Jersey has been given to me for a reason. Someone was asking me as to what prompted them to give this man this award. The politicians in the US went to campaign door-to-door during elections there. And in the state of New Jersey, there are a maximum number of Telugus. When the campaigners tried to assess their likes and dislikes, they came to know that Indians are fond of two things: cricket and cinema. And the Telugus told them that, whenever they are homesick, they watch my movies for relaxation. PV Narasimha Rao garu too said that he would watch my movies because I am like a stress-buster. Note that he didn't say he would watch me only because of comedy. You are relieved even if you cry your heart out," he added.

"Upon making several inquiries about me, the concerned legislative bodies decided to honour me because they felt that I am a responsible actor, responsible towards society It's like both MLAs and MPs giving you an honour. It has been 40 years since I started out to act. Normally speaking, I should have bee made to retire by now. But since directors are giving me roles, I am acting as I have no recourse. If I am still acting, it's because of directors. If you want to be in the race, you have to keep running every day. I continue to observe people as an actor. I was down with high fever during the making of a film. My director bolted me inside a room and went away, asking me to take rest. I found a way out and appeared on the sets. I told him that, for me, fever goes away when I work. My films are a must in every home. They are like a must-there object," he added.

He got emotional about mother.

న‌ట కిరీటి డా.రాజేంద్ర‌ప్ర‌సాద్‌కి గౌర‌వం

41 ఏళ్ల సినీ ప్ర‌స్థానంలో న‌వ ర‌సాలున్న ఏ పాత్ర‌నైనా అవ‌లీల‌గా పోషించ‌గ‌ల న‌టుడు న‌ట‌కిరీటి డా.రాజేంద్ర‌ప్ర‌సాద్‌. 237 సినిమాల్లో న‌టించిన ఈయ‌న ఎన్నో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో మెప్పించారు. ఈసెంట్‌గా రాజేంద్ర‌ప్ర‌సాద్‌కి అరుదైన పుర‌స్కారం ద‌క్కింది. అదేంటంటే న్యూజెర్సీ ప్ర‌భుత్వం నిర్వ‌హించిన స‌ర్వేలో స్ట్రెస్ రిలీఫ్ ఆర్టిస్ట్‌గా రాజేంద్ర ప్ర‌సాద్‌నున గుర్తించ‌డంతో ఆయ‌నకు అక్క‌డి జ‌న‌ర‌ల్ అసెంబ్లీ, సెనేట్ లైఫ్ అచీవ్‌మంట్ అవార్డును అందించింది. ఇటీవ‌ల ఈ అవార్డును రాజేంద్ర‌ప్ర‌సాద్ స్వీక‌రించారు. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని శ‌నివారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో రాజేంద్ర‌ప్ర‌సాద్‌ను స‌త్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో ద‌ర్శ‌కుడు రేలంగి న‌ర‌సింహారావు, నాగ్ అశ్విన్‌, స‌తీశ్ వేగేశ్న‌, కాదంబ‌రి కిర‌ణ్, అనిల్ రావిపూడి, నందినీ రెడ్డి, బంద‌రు బాబీ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా...

డా.రాజేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ - ``న‌టుడిగా 41 ఏళ్లు వివిధ పాత్ర‌ల్లో రాణిస్తున్నానంటే కార‌ణం నా ద‌ర్శ‌క నిర్మాత‌లు. న‌న్ను ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కులే. కొత్త త‌రం ద‌ర్శ‌కులు న‌న్ను దృష్టిలో పెట్టుకుని పాత్ర‌ల‌ను క్రియేట్ చేస్తున్నారు కాబ‌ట్టి.. ఈ వ‌య‌సులో కూడా నేను కొత్త పాత్ర‌ల‌తో మెప్పించ‌గ‌లుగుతున్నాను. ఈ జ‌ర్నీలో ఎన్నో అవార్డులు అందుకున్నా.. యు.ఎస్‌లోని న్యూ జెర్సీ గ‌వ‌ర్న‌మెంట్ నుండి అవార్డు అందుకోవడం ప్ర‌త్యేకం అని ఎందుకు అంటున్నానంటే.. న్యూజెర్సీలో తెలుగు ప్రేక్ష‌కులే కార‌ణం. అక్క‌డి రాజ‌కీయ నాయ‌కులు ఓట్లు కోసం వెళ్లిప్పుడు వారు నా గురించి నా సినిమాల గురించి గొప్ప‌గా చెప్ప‌డం వ‌ల్ల‌నే న్యూజెర్సీ జ‌న‌ర‌ల్ అసెంబ్లీ, సెనేట్ నాకు స్ట్రెస్ రిలీవ‌ర్‌గా గుర్తించి నాకు లైఫ్ అచీవ్‌మెంట్ అవార్డును బ‌హూకరించారు. ఈ అవార్డును తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు అంకితం చేస్తున్నాను. తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో.. అన్ని చోట్ల ఉన్న‌ట్లే మంచి, చెడు రెండూ ఉన్నాయి. అంద‌రూ చెడు వైపు కాకుండా మంచి వైపు చూడండి. చెడు కంటే మంచే ఇక్క‌డ ఎక్కువ‌గా ఉంది. అందువ‌ల్ల‌నే మేం ప్రేక్ష‌కుల‌ను ఎంటర్‌టైన్ చేయ‌గ‌లుగుతున్నాం`` అన్నారు.

రేలంగి న‌ర‌సింహారావు మాట్లాడుతూ - ``రాజేంద్ర‌ప్ర‌సాద్ యాక్ట‌ర్‌గా కంటే వ్య‌క్తిగా, మిత్రుడిగా నాతో మంచి అనుబంధం ఉంది. మ‌మ్మ‌ల్ని భార్యాభ‌ర్త‌లంటూ ఉంటారు. ఆయ‌న న‌టించిన 237 సినిమాల్లో నాతోనే 35 సినిమాలు చేశాడు. ఇలాంటి అవార్డు రావ‌డం అరుదైన సంద‌ర్భం. దీన్ని మ‌నం అంద‌రం సెల‌బ్రేట్ చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది`` అన్నారు.

అనిల్ రావిపూడి మాట్లాడుతూ - ``రాజేంద్ర‌ప్ర‌సాద్ న‌వ‌ర‌స నాయ‌కుడు. ఎందుకంటే ఆయ‌న న‌వ‌ర‌సాల‌ను అద్బుతంగా పండించ‌గ‌ల న‌టుడు. అంతే కాకుండా ఆయ‌న చేస్తే ఏ పాత్ర అయినా కొత్త‌గాఉంటుంది`` అన్నారు.

నందినీ రెడ్డి మాట్లాడుతూ ``రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారు నాకంటే వ‌య‌సులో పెద్ద‌వారైనా నా బాల్య‌మిత్రులు. ఎందుకంటే చిన్న‌ప్పుడు ఒత్తిడిలో ఉన్న‌ప్పుడు ఆయ‌న సినిమాలు చూస్తూనే పెరిగాను. ఆయ‌న పాత్ర‌లు గురించి మ‌నం ఎప్ప‌టికీ మాట్లాడుకుంటూనే ఉన్నాం`` అన్నారు.

నాగ్ అశ్విన్ మాట్లాడుతూ - ``త‌న న ట‌న‌తో పాటు సినిమాకు కూడా రాజేంద్ర ప్ర‌సాద్‌గారు త‌న వంతు స‌హ‌కారాన్ని అందిస్తుంటారు. అందుకు ఉదాహ‌ర‌ణ మా మ‌హాన‌టి చిత్ర‌మే. అందులో ఆయ‌న చౌద‌రిగారి పాత్ర‌లో న‌టించ‌డ‌మే కాదు.. ఓ సీనియ‌ర్ యాక్ట‌ర్‌గా మా వెనుకుండి మ‌మ్మ‌ల్ని ముందుకు సాగేలా ప్రోత్స‌హించారు`` అన్నారు.

స‌తీశ్ వేగేశ్న మాట్లాడుతూ ``రాంజేంద్ర‌ప్ర‌సాద్‌గారి లేడీస్ టైల‌ర్ సినిమా చూసే నేను ర‌చ‌యిత‌గా మారాను. నాతో పాటు ఎంతో మందిని ఆయ‌న న‌ట‌న‌తో ఇన్‌స్పైర్ చేశారు`` అన్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో బంద‌రు బాబీ, ర‌మేశ్ చెప్పాల త‌దిత‌రులు పాల్గొన్నారు.



Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved