సప్తగిరి కథానాయకుడిగా నటించిన చిత్రం `సప్తగిరి ఎల్.ఎల్.బి`. సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రై లిమిటెడ్ బ్యానర్‌పై చరణ్ లక్కాకుల దర్శకత్వంలో డా.రవికిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మించిన చిత్రం 'సప్తగిరి ఎల్.ఎల్.బి'. ఈ సినిమా డిసెంబర్ 7న వరల్డ్‌వైడ్‌గా విడుదలైంది. ఈ సందర్భంగా ప్రీమియర్ షో అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...
చిత్ర నిర్మాత డా.రవికిరణ్ మాట్లాడుతూ - ``సప్తగిరి ఎల్.ఎల్.బి చిత్రానికి హిట్ టాక్ రావడం ఎంతో హ్యాపీగా ఉంది. సాధారణంగా ఏదో సినిమా తీయాలని కాకుండా ఓ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా తీయాలనే ఉద్దేశంతో ఈ సినిమాను చేశాం. నా ప్రొడక్షన్‌లో వచ్చిన సప్తగిరి ఎక్స్‌ప్రెస్ కంటే ఈ సినిమాకు అన్ని వ్యవహరాలను దగ్గరుండి చూసుకున్నాను. ఇలాంటి సబ్జెక్ట్‌ను చెప్పాలనుకుంటే ఇమేజ్ ఉన్న హీరో కంటే, ఇమేజ్ లేని నటుడైతేనే బావుంటుందని సప్తగిరితో సినిమా చేశాను. పరుచూరి బ్రదదర్స్‌గారు మంచి డైలాగ్స్ రాశారు. మాతృకలోని ఫ్లెవర్ పాడుకాకుండా తెలుగు నెటివిటీకి మార్చి రాయడానికి చాలా హార్డ్ వర్క్ చేశాం. శివప్రసాద్‌గారు, సాయికుమార్‌గారు, సప్తగిరిగారు..మూడు పిల్లర్స్‌లా ఈ సినిమాకు వర్క్ చేశారు. ఓ మంచి సినిమాను నిర్మించినందుకు నిర్మాతగా సంతోషంగా ఉన్నాను. భవిష్యత్‌లో కూడా ఇలాంటి మంచి మెసేజ్ ఉన్నచిత్రాలనే నిర్మిస్తాను. ఇక సినిమాలో నటించడం అనేది యాదృచ్చికంగానే జరిగింది. మరి భవిష్యత్‌లో నటిస్తానా? లేదా? అనేది చెప్పలేను. అంతా! ఆ భగవంతుడి చేతిలో ఉంది. చిన్నప్పుడు స్టేజ్ ఆర్టిస్ట్ కావడంతో ఆ అనుభవం ఇక్కడ పనికొచ్చింది. సినిమాకు సినిటోగ్రఫీ, రీరికార్డింగ్ పెద్ద ప్లస్ అయ్యాయి. సప్తగిరితో మూడో సినిమా చేస్తానని ఇప్పుడే చెప్పలేను. కథ డిమాండ్ చేస్తే తనతో చేస్తాను. లేదా మరో హీరోతో అయినా చేయడానికి నేను సిద్ధమే. జాలీ ఎల్.ఎల్.బి 2 సినిమాను నిర్మించను. దర్శకుడు చరణ్, సప్తగిరి సహా అందరికీ సమిష్టి కృషే ఇది. నాది ఆదిలాబాద్ జిల్లా. నేను పుట్టి పెరిగిన ఊరు కావడంతో పాటు..అక్కడి రైతుల ఆత్మహత్యలు నన్ను కలిచివేసింది. కాబట్టి వారి సమస్యలను ఈ సినిమా ద్వారా తెరపై చూపాలనుకున్నాను. `ఫిదా` తర్వాత తెలంగాణలో అందమైన లోకేషన్ ఉన్న పల్లెటూరిని మా సినిమాలోనే చూపించాం`` అన్నారు.