డి.సురేష్ బాబు మాట్లాడుతూ - ``సెన్సార్ పూర్తి కాగానే స్కెచ్ సినిమా రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తారు. విక్రమ్ నాకు చాలా మంచి స్నేహితుడు. తను చిన్న రేంజ్ నుండి పెద్ద స్టార్‌గా ఎదిగారు. 25 ఏళ్ల క్రితం తనని కలిసినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఇండస్ట్రీకి మంచి సినిమాలు అవసరం. అలా ఉన్నప్పుడు ఆడియెన్స్ థియేటర్‌కి రావాలనుకుంటాడు. లేకుంటే ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడం తగ్గించేస్తారు. తమన్ మంచి మ్యూజిక్ అందించారు. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
విజయ్ చందర్ మాట్లాడుతూ - ``తమిళంలో విడుదలైన స్కెచ్ చిత్రం పెద్ద సక్సెస్ అయ్యింది. తెలుగులో కూడా సినిమా పెద్ద సక్సెస్ సాధిస్తుందని కోరుకుంటున్నాను`` అన్నారు.
తమన్నా మాట్లాడుతూ - ``నాకు స్కెచ్ ప్రత్యేకమైన సినిమా. విక్రమ్‌గారితో పనిచేయాలని కెరీర్ ప్రారంభం నుండి అనుకున్నాను. 10 సంవత్సరాలు తర్వాత ఆయనతో కలిసి నటించే అవకాశం కలిగింది. ఆయన నుండి చాలా విషయాలను నేర్చుకున్నాను. కమర్షియల్ సినిమాలకు నేను పెద్ద ఫ్యాన్‌ని. అలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఆధారంగానే ఈసినిమా చేశారు. కేవలం కమర్షియల్ సినిమాలను ఆదరించే ప్రేక్షకులకే కాదు.. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది. నాకు, విక్రమ్‌గారికి మధ్య ప్రేమ సన్నివేశాలు చాలా చక్కగా వచ్చాయి. ఎంజాయ్ చేస్తూ నటించాను. తమన్ అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు. మెమొరబుల్ మూవీగా నిలిచిపోతుంది. టీంకు థాంక్స్`` అన్నారు.
విక్రమ్ మాట్లాడుతూ - ``తమిళం, కేరళ, కన్నడలో సినిమా పెద్ద హిట్ అయ్యింది. తెలుగులో కూడా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. డి.సురేష్‌బాబుగారు సినిమాను విడుదల చేస్తుండటం ఆనందంగా ఉంది. నేను ఎప్పుడూ విభిన్నమైన సినిమాలు చేస్తుంటాననే సంగతి తెలిసిందే. పద్నాలుగేళ్లు, పదిహేనేళ్ల తర్వాత కమర్షియల్ మూవీ చేశాను. పాత విక్రమ్ వచ్చారని అందరూ అనుకుంటారు. అలాగని రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాదు. నిజ ఘటనలతో తెరకెక్కించిన కమర్షియల్ మూవీ. దర్శకుడు విజయ్ సినిమాను చక్కగా తెరకెక్కించాడు. ముందు నేను రెండు నెలలు పాటు కథ వినలేదు. వినగానే థ్రిల్ అయ్యాను. కమర్షియల్ టైప్‌లో సాగే థ్రిల్లర్ మూవీ ఇది. నా పాత్ర పరంగా కాస్త డిఫరెంట్‌గా ఉండాలని ప్రయత్నించాను. తమన్నాతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. తను మంచి నటే కాదు.. బెస్ట్ డ్యాన్సర్ కూడా. ఇది కమర్షియల్ సినిమానే అయినా రొమాన్స్ సీన్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. చిన్న మెసేజ్ కూడా ఉంటుంది`` అన్నారు.