20 February 2017
                            Hyderabad
                          పియుకే ప్రొడక్షన్స్ పతాకంపై వెంకీ, లాస్య జంటగా ఎల్.రాధాకృష్ణను దర్శకుడుగా పరిచయం చేస్తూ దీపక్ కృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘తొలి పరిచయం’.  ఈ చిత్ర ఫస్ట్ సాంగ్ లాంచ్ సోమవారం హైదరాబాద్ లో రేడియో సిటీ లో జరిగింది.  కార్యక్రమము లో చిత్ర యూనిట్ పాల్గొన్నారు.
                          దర్శకుడు ఎల్.రాధాకృష్ణ మాట్లాడుతూ... ‘ఇటీవల మా చిత్రానికి సంబధించిన ఫస్ట్ లుక్ , ట్రైలర్ ను విడుదల చేసాము. రెండింటికి  మంచి రెస్పాన్స్  వచ్చింది.  పెళ్లి అంటే ఇష్టం లేని ఒక అమ్మాయి, అబ్బాయి ఒకే ఇంట్లో గడపాల్సి వస్తే... ఆ తర్వాత ఏమి జరిగింది అన్నది  చిత్ర కథాంశం. పోలవరం  ప్రాంతంలో షూటింగ్ చేసాము.  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కంప్లీట్ అయ్యాయి. నిర్మాత  ఏ విషయంలోనూ రాజీపడకుండా చిత్రాన్ని నిర్మించారు. రేడియో సిటీ లో ఫస్ట్  సాంగ్ లాంచ్ చేసాము. త్వరలో ఆడియో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాము`` అన్నారు.
                          నిర్మాత  దీపక్‌కృష్ణ మాట్లాడుతూ...``ఫస్ట్  లుక్, ట్రైలర్  ఎంత ఫ్రెష్‌గా ఉందో.. సినిమా కూడా అంతే ఫ్రెష్‌గా ఉంటుంది. డైరెక్టర్ ప్రతి సీన్ చాలా బాగా  చిత్రీకరించారు. రేడియో సిటీ లో ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసాము.  త్వరలో గ్రాండ్ గా   ఆడియో విధుల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము``అన్నారు.
                          మురళీమోహన్, సుమన్, రాజీవ్ కనకాల, రఘుబాబు, ఛత్రపతి శేఖర్, వైవా హర్ష, కళ్లు కృష్ణారావు, ప్రీతినిగమ్, రాగిణి, మధుమణి, సాహితి, దీప్తి, మాధవి, రామిరెడ్డి తదిత రులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫి: శరవణ కుమార్ సి., ఎడిటర్: కృష్ణపుత్ర, మ్యూజిక్: ఇంద్రగంటి, డాన్స్: కృష్ణారెడ్డి, లిరిక్స్: చంద్రబోస్, కాసర్ల శ్యాం, కరుణాకర్, నిర్మాత: దీపక్‌కృష్ణ, దర్శకత్వం: ఎల్.రాధాకృష్ణ.