pizza
Shankarabharanam (K Vishwananth) Film awards 2017 function at Shilpakala Vedika, Hyderabad
భారతదేశం గర్వించదగ్గ దర్శకుడాయన - టి.సుబ్బరామిరెడ్డి
You are at idlebrain.com > News > Functions
Follow Us

20 June 2017
Hyderabad

''ఆణిముత్యాల్లాంటి సినిమాలు తీసిన కళాతపస్వీ, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్‌ భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడు'' అని టి.సుబ్బరామిరెడ్డి అన్నారు. 'శంకరాభరణం' సినిమాలో శంకరం పాత్రతో బాలనటిగా పరిచయం చేసిన తన గురువు కె.విశ్వనాథ్‌పై ఉన్న గౌరవంతో గురుదక్షిణగా శంకరాభరణం పేరుతో అవార్డును నెలకొల్పారు నటి తులసి. మంగళవారం శిల్పకళావేదికలో కె.విశ్వనాథ్‌ సమక్షంలో అత్యంత వైభవంగా ఈ అవార్డు వేడుక జరిగింది. తెలుగులో ఉత్తమ నటీనటులు, సాంకేతిక నిపుణులకు పురస్కారాలు అందజేశారు. తులసీ, టి.సుబ్బరామిరెడ్డి, శంకరాభరణం రాజ్యలక్ష్మీ, అన్నపూర్ణ, శ్రీలక్ష్మి, జీవిత, శివపార్వతి తదితరులు కె.విశ్వనాథ్‌ని ఘనంగా సత్కరించారు. జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ గాయని ఎస్‌.పి.శైలజకు అందజేశారు.

సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ ''గురువు మీదున్న భక్తితో తులసి గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టింది. ప్రతి ఏడాది ఈ అవార్డు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలి. మహిళ అయినప్పటికీ ఒంటి చేత్తో కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించింది. తన ప్రయత్నానికి అభినందిస్తున్నాను'' అని అన్నారు.

కె.విశ్వనాథ్‌ మాట్లాడుతూ ''తులసీ ఎప్పుడూ తను గొప్ప శిష్యురాలు అని నిరూపించుకుంటూనే ఉంది. ఈ అవార్డు ఫంక్షన్‌ ఘనంగా చేస్తుందని ఊహించలేదు'' అని అన్నారు.

తులసి మాట్లాడుతూ ''నా గురువుకు ఉడతా భక్తితో చేసిన సన్మానం ఇది. ప్రతిభ ఉన్న కళాకారులను ప్రోత్సహించడానికి ఆయన పేరుతో ప్రతి ఏటా ఈ అవార్డు వేడుక నిర్వహిస్తా'' అని తెలిపారు.

అవార్డు విజేతలు:
ఉత్తమ నటుడు ఎన్టీఆర్‌(జనతాగ్యారేజ్‌)
ఉత్తమ నటుడు(క్రిటిక్‌): శర్వానంద్‌
ఉత్తమ దర్శకుడు: కొరటాల శివ(జనతాగ్యారేజ్‌)
ఉత్తమ చిత్రం: దిల్‌ రాజు(శతమానం భవతి)
ఉత్తమ దర్శకుడు: సతీష్‌ వేగేశ్న(జ్యూరీ)
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు: తరుణ్‌ భాస్కర్‌(పెళ్లిచూపులు)
ఉత్తమ సంగీత దర్శకుడు: మిక్కీ.జె.మేమర్‌(శతమానంభవతి)
ఉత్తమ నటి రెజీనా(జ్యో అచ్యుతానంద)
ఉత్తమగేయ రచయిత: రామజోగయ్య శాస్త్రి(జనతాగ్యారేజ్‌)
ఉత్తమ గాయకుడు: హరిచరణ్‌ (కృష్ణగాడి వీరప్రేమగాధ)
ఉత్తమగాయని: గీతామాధురి(జనతాగ్యారేజ్‌)
ఉత్తమ డబ్బింగ్‌ ఇంజనీర్‌: పప్పు
ఉత్తమ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌: ప్రియాంక
ఉత్తమ హాస్యనటుడు: ప్రియదర్శి(పెళ్లిచూపులు)
ఉత్తమ హాస్యనటుడు(జ్యూరీ):జోష్‌రవి
ఉత్తమ కళా దర్శకుడు: రమణ వంక(శతమానంభవతి)
ఉత్తమ ప్రతినాయకుడు: జగపతిబాబు(నాన్నకు ప్రేమతో)
తమిళ అవార్డులు:
ఉత్తమ దర్శకుడు (జ్యూరీ): ఆనంద్‌(మెట్రో)
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు: ధనుష్‌(పా..పాండి).
అంధ కళాకారులు(బెంగుళూరు) చేసి నృత్యాలు, కె.విశ్వనాథ్‌ సినిమాల్లోని పాటలతో ఏర్పాటు చేసిన సంగీత విభావరి ఆహుతులను ఆకట్టుకున్నారు.


Photo Gallery (photos by G Narasaiah)

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved