యువ కథానాయకుడు రాజ్‌తరుణ్ హీరోగా ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్‌లో రాజ్‌తరుణ్ హీరోగా ఈడోరకం-ఆడోరకం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి సూపర్‌హిట్ చిత్రాలు తర్వాత రూపొందిన హ్యాట్రిక్ మూవీ `అంధగాడు`. రచయిత వెలిగొండ శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ సినిమా జూన్ 2న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజై మంచి విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...
దర్శకుడు వెలిగొండ శ్రీనివాస్ మాట్లాడుతూ - ``సినిమాను పక్కా ప్రణాళికతో పూర్తి చేశాం. నేను చెప్పాలనుకున్న విషయాన్ని అనుకున్నట్లుగా ప్రెజంట్ చేయగలిగాను. నన్ను, నా కథను నమ్మి దర్శకుడిగా నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత అనీల్ సుంకర, హీరో రాజ్ తరుణ్‌లకు థాంక్స్. హెబ్బా పటేల్ మరోసారి రాజ్‌తరుణ్‌తో చేసిన కెమిస్ట్రీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమా విడుదలైన తర్వాత వినాయక్‌గారు ఫోన్ చేసి సినిమా చాలా బావుందని అప్రిసియేట్ చేశారు. అలాగే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మగారు అందించిన ప్రశంసలు మరచిపోలేను. వినాయక్, వర్మగారికి స్పెషల్ థాంక్స్. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. సినిమా వీకెండ్స్‌లోనే కాదు, వీక్‌డేస్‌లో కూడా హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అవుతుంది. సినిమా ఇంత పెద్ద రేంజ్‌లో ఆదరించిన ప్రేక్షకులకు థాంక్స్`` అన్నారు.
హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ - ``సినిమా వారాంతపు రోజుల్లోనే కాకుండా ఇప్పుడు కూడా మంచి కలెక్షన్స్‌ను రాబడుతుండటం చాలా మంచి పరిణామం. ఆనందంగా ఉంది. ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్‌లో నాకు హ్యాట్రిక్ మూవీ రావడం సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని ప్రేక్షకులతో పంచుకోవడానికి గురవారం నుండి సక్సెస్ టూర్ ప్లాన్ చేశాం. వైజాగ్ నుండే ఈ సక్సెస్ టూర్‌ను స్టార్ట్ చేస్తాం`` అన్నారు.
హెబ్బా పటేల్ మాట్లాడుతూ - ``2017 నాకు లక్కీ ఈయర్. చాలా మంచి విజయాలను అందుకున్నాను. అలాగే ఇంకా మంచి విజయాలను సాధించాలని భావిస్తున్నాను. సినిమాను ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్`` అన్నారు.
రాజా రవీందర్ మాట్లాడుతూ - ``30 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నాను. ఇంత మంచి క్యారెక్టర్‌ను నాకు ఇచ్చిన వెలిగొండకు, రాజ్‌తరుణ్, అనీల్‌గారికి ధన్యవాదాలు, రుణపడి ఉంటాను. చిరంజీవి, రాధికల వలనే ఇప్పుడు రాజ్‌తరుణ్, హెబ్బా పటేల్ జంట మెప్పిస్తుంది. సినిమా సక్సెస్‌లో భాగమైన అందరికీ థాంక్స్`` అన్నారు.