pizza
Bharat Ane Nenu success meet
`భ‌ర‌త్ అనే నేను` థాంక్స్ మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

23 April 2018
Hyderabad

సూప‌ర్‌స్టార్ మహేశ్, కియ‌రా అద్వాని జంట‌గా నటించిన చిత్రం `భ‌ర‌త్ అనే నేను`. డి.వి.వి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో దాన‌య్య.డి.వి.వి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమా ఏప్రిల్ 20న విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన థాంక్స్ మీట్‌లో సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌, కొర‌టాల శివ‌, కియ‌రా అద్వాని, దాన‌య్య డి.వి.వి, దేవిశ్రీ ప్ర‌సాద్‌, బ్ర‌హ్మాజీ, రామ‌జోగ‌య్య శాస్త్రి త‌దిత‌రులు పాల్గొన్నారు.

నిర్మాత దానయ్య డి.వి.వి మాట్లాడుతూ - ''సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో నేను మహేశ్‌ అభిమానులు ఓ బ్లాక్‌బస్టర్‌ సినిమా ఇస్తానని మాట ఇచ్చాను. ఈరోజు ఆ మాట నిలబెట్టుకున్నందుకు ఆనందంగా ఉంది. ఇంత మంచి సినిమాను మా బ్యానర్‌లో డైరెక్ట్‌ చేసిన కొరటాల శివగారికి, నమ్మకంతో నటించిన మహేశ్‌గారికి స్పెషల్‌ థాంక్స్‌. సినిమా చూసిన వారందరూ అప్రిసియేట్‌ చేస్తున్నారు. ముఖ్యంగా చిరంజీవిగారు ఫోన్‌ చేసి చాలా మంచి సినిమా తీశానని ఓ పదినిమిషాల పాటు మాట్లాడారు. అలాగే మహిళలందరూ సినిమాను అప్రిసియేట్‌ చేస్తున్నారు. సినిమా చూసిన వారందరూ ఎమోషనల్‌గా మాట్లాడుతున్నారు. నా బ్యానర్‌లో ఇంత మంచి సినిమా, గొప్ప సినిమా చేసినందుకు గర్వంగా ఉంది. ఇంత గొప్ప సినిమా ఇచ్చినందుకు మహేశ్‌, కొరటాల శివగారికి థాంక్స్‌. దేవిశ్రీ ప్రసాద్‌గారు అద్భుతమైన రీరికార్డింగ్‌ ఇచ్చారు. కియరా అద్వాని చాలా చక్కగా నటించారు.మా బ్యానర్‌లో తను మరో సినిమా కూడా చేస్తుంది. తనకు మంచి భవిష్యత్‌ ఉంది. మా సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌. వచ్చే శుక్రవారం తిరుపతిలో సక్సెస్‌ఫుల్‌ ఈవెంట్‌ నిర్వహిస్తున్నాం. మహేశ్‌గారి కెరీర్‌లోనే కాదు.. డైరెక్టర్‌గారి సినిమాలన్నింటిలోనూ ఈ సినిమా బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌'' అన్నారు.

దేవిశ్రీ ప్రసాద్‌ మాట్లాడుతూ - '''భరత్‌ అనే నేను' సినిమా ఇంత పెద్ద విజయాన్ని సాధించినందుకు ఆనందంగా ఉంది. నేను శివగారితో 'జనతాగ్యారేజ్‌' చేస్తున్నప్పుడే ఆయన ఓ లైన్‌ ఇలా అనుకున్నాను. మహేశ్‌గారితో ప్లాన్‌ చేస్తున్నాను అని అన్నారు. వినగానే థ్రిల్‌ అయ్యాను. శివగారు ఆయన పనిచేసిన నాలుగు సినిమాలకు నేను మ్యూజిక్‌ అందించాను. అలాగే మహేశ్‌గారు, శివగారు చేసిన శ్రీమంతుడు సినిమా తర్వాత వారితో కలిసి చేస్తోన్న సినిమా ఇది. సామాన్య పౌరుడు ఎలాంటి విషయాలను కోరకుంటున్నాడో.. ఆ విషయాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. ఇంత మంచి సినిమాలో అవకాశం ఇచ్చినందకు ఆనందంగా ఉంది'' అన్నారు.

డైరెక్టర్‌ కొరటాల శివ మాట్లాడుతూ - ''మంచి ఆలోచనను రాయడం పెద్ద కష్టమైన విషయమేమీ కాదు. కానీ అంత పెద్ద ఆలోచనను పెద్ద హృదయంతో తీసుకోవడం చాలా కష్టం. అనుకున్నంత సులువు కాదు. కమర్షియల్‌ సినిమాను, కామెడీ సినిమాను చూడటం పెద్ద కష్టం కాదు. అయితే ఓ నిజాయతీతో కూడిన ప్రయత్నంను అభినందించి.. పెద్ద సక్సెస్‌ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్స్‌. మా టీం అంతా ఎమోషనల్‌ అవుతున్నాం. ఏడాది కష్టం. ప్రేక్షకులు ఇచ్చిన తీర్పుతో దూది పింజల్లా కష్టం ఎగిరిపోయింది. తెలుగు ప్రేక్షకులందరికీ థాంక్స్‌. నా కంటే నా టీమ్‌ ఈ స్క్రిప్ట్‌ను ప్రేమించారు. మహేశ్‌లాంటి హీరో ఉన్నప్పుడు ఎంతైనా రాయవచ్చు అనిపిస్తుంది. స్క్రిప్ట్‌ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఇంకా ఏదో రాయాలనే స్వార్ధం ఉండేది. ఆయనకు ఏ సీన్‌ చేయాలన్నా ఈజీయే. ఏదో చాలెంజ్‌గా చేయాలని అనుకుంటూ ఉంటారు. ఫైనల్‌గా ఆయన నటనను తెరపై చూసినప్పుడు నేను డైరెక్టర్‌ననే విషయం మరచిపోయాను. నిజంగా ఇంత బాగా చేశారా? ఇన్ని వేరియేషన్స్‌ ఏంటి? అనిపించింది. ఆయన ఇచ్చిన సపోర్ట్‌ మాటల్లో చెప్పలేనిది. భరత్‌ అనే నేను ఇంత అందంగా.. ఇంత పెద్ద రిజల్ట్‌ రావడానికి మహేశ్‌గారే ఇచ్చిన సపోర్టే కారణం. అది లేకుంటే ఇంత మంచి రిజల్ట్‌ అసాధ్యం. నాకు మహేశ్‌తో సినిమా అంటే ఎప్పుడూ స్పెషలే. ఎప్పుడెప్పుడు సినిమా చేద్దామా? అనే కోరిక ఉంటుంది. నేను చేసిన నాలుగో సినిమా. అంతకు ముందు చేసిన సినిమాలన్నింటి కంటే ఎక్కువ బడ్జెట్‌ అయ్యింది. ఎక్కువ రోజులు పనిచేశాం. కాస్ట్‌లీ సినిమా. ఇంత పెద్దగా ఉన్న సరే! ఈ సినిమాతో నాకు పెద్ద రెస్పెక్ట్‌, పేరు రావాలి. సినిమా రిచ్‌గా ఉండాలి. నా బ్యానర్‌లో సినిమా నిలిచిపోవాలని నిర్మాత దానయ్యగారు ప్రతి షెడ్యూల్‌కి చెప్పేవారు. నాకు, మహేశ్‌గారికి పెద్ద సక్సెస్‌ఫుల్‌ సినిమా తీయాలనే టెన్షన్‌ ఉండేది. నేను ఇంటికి వెళ్లిన తర్వాత దానయ్యగారు గుర్తుకొచ్చేవారు. నిజాయతీగా అడుగుతున్నారు.. సరిగ్గా చేస్తున్నామా? లేదా? అని ఆలోచించేవాడిని. దానయ్యగారు సినిమాను నమ్మి ఎంతో సపోర్ట్‌ చేశారు. ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డామో నాకు బాగా తెలుసు. నా సినిమాటోగ్రాఫర్స్‌ నా కంటే ఎక్కువ హోంవర్క్‌ చేశారు. రవిగారు, తిరుగారి నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. దేవిశ్రీగారు నా తొలి సినిమా నుండి నాతో ట్రావెల్‌ చేస్తున్నారు. ఆయన ఉంటే మ్యూజిక్‌ విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉండేవాడిని. సినిమా విడుదలకు రెండు వారాల ముందు ఆయన, ఆయన టీం ఇచ్చిన సపోర్ట్‌ నా జీవితంలో మరచిపోలేను. ఫైనల్‌ అవుట్‌పుట్‌ వరకు దేవిశ్రీ పెట్టే ఎఫర్ట్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన మ్యూజిక్‌తో నా నాలుగు సినిమాలకు ప్రాణం పోశారు. అలాగే రామజోగయ్యగారితో మంచి అనుబంధం ఉంది. సిచ్యువేషన్‌లో నా కంటే ఎక్కువ ఎమోషనల్‌గా ఫీలై మంచి సాహిత్యాన్ని అందిస్తారు. మంచి నటీనటులు, టెక్నీషియన్స్‌ సరిగ్గా లేకపోతే.. మంచి అవుట్‌పుట్‌ రాదు. కియరాగారు కథ వినగానే ఒప్పుకుని.. మహేశ్‌ వంటి సీనియర్‌ హీరోతో కాన్ఫిడెంట్‌గా నటించిన విధానం మా యూనిట్‌ను ఇంప్రెస్‌ చేసింది. అలాగే ప్రకాశ్‌రాజ్‌గారు, శరత్‌కుమార్‌గారు, పోసాని కృష్ణమురళిగారు, జీవాగారు, సితారగారు వంటి మంచి నటీనటులు వర్క్‌ చేశారు. ప్రతి ఒక్కరికీ థాంక్స్‌. రాత్రింబగళ్లు సినిమా కోసం పని చేశాం. ఓ మంచి సక్సెస్‌ను అందించిన ప్రేక్షకులకు జీవితాంతం రుణపడి ఉంటాను'' అన్నారు.

సూపర్‌స్టార్‌ మహేశ్‌ మాట్లాడుతూ - ''ఇంత పాజిటివ్‌ రెస్పాన్స్‌ ఇచ్చినందుకు గ్రేట్‌ఫుల్‌ టు ఆల్‌. నాకు చాలా ఎమోషనల్‌గా ఉంది. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎలా రియాక్ట్‌ కావాలో కూడా తెలియడం లేదు. బ్రహ్మాజీతో పనిచేసిన సినిమాల్లో ఎక్కువ శాతం సినిమాలు విజయాన్ని సాధించాయి. ఇక కియరా అద్వాని చక్కగా నటించింది. తెలుగు ఇండస్ట్రీకి మరో పెద్ద హీరోయిన్‌ వచ్చినందుకు ఆనందంగా ఉంది. శివగారికి రుణపడి ఉంటాను. శ్రీమంతుడు సినిమాకు ముందు కూడా ఇలాంటి ఫేజ్‌ ఉండేది. ఆయన శ్రీమంతుడు వంటి బ్లాక్‌బస్టర్‌ ఇచ్చారు. మళ్లీ నేను పడుతున్న టెన్షన్‌ శివకి తెలుసు. ఓ హీరో అంత టెన్షన్‌లో ఉన్నాడంటే డైరెక్టర్‌కి ఎలా ఉంటుందో నాకు తెలుసు. కానీ అదేమీ కనపడనీయకుండా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఇచ్చినందుకు గ్రేట్‌ఫుల్‌ టు యు శివగారు. నేను ఏ సినిమాకు ఇంత కష్టపడి పనిచేయలేదు. ఎందుకంటే మా సినిమాను ముందు ఏప్రిల్‌ 27న విడుదల చేయాలని అనుకున్నాం. కానీ ఓ వారం ముందుకు జరిగింది. ఏప్రిల్‌ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చాం. ఆరోజు మా అమ్మగారి పుట్టినరోజు. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు నిర్మాతలకు థాంక్స్‌. ఆరోజు అలాంటి నిర్ణయం తీసుకుని రిలీజ్‌ కావడం వల్లేనెమో ఇంత పెద్ద సక్సెస్‌ మాకు వచ్చింది. టెన్షన్‌లో 45 రోజుల పాటు నాన్‌స్టాప్‌గా షూటింగ్‌జరుగుతూనే ఉంది. పగలు షూటింగ్‌ రాత్రిళ్లు డబ్బింగ్‌.. తర్వాత స్పెయిన్‌కు వెళ్లి పాట చేసి.. మళ్లీ వచ్చి సెకండాఫ్‌ డబ్బింగ్‌ కంప్లీట్‌ చేశాను. నాకేమీ అర్థం కాలేదు. అందువల్ల నా ఫ్యామిలీతో బయటకు వెళ్లిపోయాను. వెళ్లినా కూడా శివగారికి ప్రతి గంట ఫోన్‌ చేస్తూనే ఉన్నాను. మొన్ననే ఇంట్లో సినిమా చూశాను. పాటలు అద్భుతంగా చేశాడని ముందే చెప్పాను. సినిమాలోని బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ చూసిన తర్వాత దేవిశ్రీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ కాదు.. స్టోరీ టెల్లర్‌ అని అర్థమైంది. అలాగే రామ్‌జోగయ్యగారు నా సినిమాలన్నింటిలో బెస్ట్‌ లిరిక్స్‌ ఇచ్చారు. దానయ్యగారి రియాక్షన్స్‌ చాలా కొత్తగా ఉంటాయి. నాకు చాలా ఇష్టమైన రియాక్షన్స్‌ ఇస్తుంటాడు. దానయ్యగారితో ఎప్పటి నుండో సినిమా చేయాలనుకున్నాను. ఈ సినిమా చేశాను. సినిమా విడుదలైనరోజు సాయంత్రం కలిసి 'దానయ్యగారు మనం పెద్ద హిట్‌ కొట్టేశామండి' అని అంటే.. ఆయన 'అవుద్దండి.. ఎందుకవదు.. కావాలి కదా.. ఇంత పెద్ద హిట్‌ ఇచ్చాను కదా! మళ్లీ నాతో ఎప్పుడు చేస్తున్నారో చెప్పండి' అన్నారు. ఇంత గొప్ప సినిమా నాకు ఇచ్చినందుకు దానయ్యగారికి థాంక్స్‌. ఆయనతో మళ్లీ మళ్లీ సినిమాలు చేస్తాను'' అన్నారు.

శ్రీమంతుడు సినిమా హిట్‌ తర్వాత గ్రామాలను దత్తత తీసుకున్న మీరు.. ఈ సినిమా హిట్‌ తర్వాత ప్రజల సమస్యలపై వ్యక్తిగతంగా ఏమైనా కేర్‌ తీసుకుంటారా? అని అడిగిన ప్రశ్నకు మహేశ్‌ మాట్లాడుతూ ..'నేను చేయాల్సింది చేస్తూనే ఉంటాను. ఎప్పుడూ చెప్పుకోను. కానీ ఈ సినిమా చేసినందుకు గర్వంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి సినిమాలను మన లైబ్రరీలో పెట్టుకుంటాం. రేపు నా పిల్లలు పెద్దయ్యాక..వాళ్ల పిల్లలకు ఈ సినిమా చూపించుకుంటాను' అన్నారు.

ఈ సక్సెస్‌లో మీ నాన్నగారికి ఎంత శాతం క్రెడిట్‌ ఇస్తారు? అని అడిగిన ప్రశ్నకు 'ఈ సినిమా అనే కాదు..ఈ జీవితమే ఆయనిచ్చింది' అని మహేశ్‌ బదులిచ్చారు.

శ్రీమంతుడు, భరత్‌ అనే నేను తర్వాత మీ కాంబోలో నెక్స్‌ట్‌ మూవీ ఎలా ఉండబోతుంది? అని అడిగితే.. 'లీడర్‌ ఆఫ్‌ ది హౌస్‌ కొరటాల శివగారు మాత్రమే చెప్పగలరు' అని మహేశ్‌ అన్నారు.

ఎన్నో సూపర్‌ హిట్స్‌ చూసిన మీరు.. ఈ సక్సెస్‌తో చాలా హ్యాపీగా ఉన్నారెందుకు? అని అడిగిన ప్రశ్నకు మహేశ్‌ మాట్లాడుతూ ''సూపర్‌హిట్‌ చూశాను. డబ్బులున్నాయి. జీవితం హ్యాపీగా సాగిపోతుంది. గత రెండేళ్లుగా ఆడియెన్స్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌ను రీచ్‌ కాలేకపోయాను. అభిమానులను, ప్రేక్షకులు నిరాశపడ్డారు. ఈ సినిమా విడుదలయ్యే సమయంలో గొప్ప సినిమా చేశామని తెలుసు. కానీ అది ఆడియెన్స్‌ చూసి చెప్పాలి అని వెయిట్‌ చేశాను. ఈ సక్సెస్‌ తర్వాత రిలీఫ్‌గా అనిపించింది' అన్నారు.

ముఖ్యమంత్రి పాత్ర చేయడం ఆషామాషీ కాదు కదా? అన్న ప్రశ్నకు మహేశ్‌ సమాధానం చెబుతూ.. 'ముఖ్యమంత్రి పాత్ర చేయడం నిజంగానే ఆషా మాషీ కాదు. అది నా దర్శకుడు ఇచ్చే ధైర్యంపైనే ఆధారపడి ఉంటుంది. శివగారు స్క్రిప్ట్‌ రాసినతీరు, కథను చెప్పిన విధానం నాకు నచ్చాయి. గొప్ప సినిమా చేస్తున్నామని అర్థమైంది. అలాగే టీజర్‌, ట్రైటర్‌, సాంగ్స్‌కు వచ్చిన రెస్పాన్స్‌ చూసి హ్యాపీగా ఫీలయ్యాం. ఈ సినిమా పట్ల గర్వంగా అనిపించింది' అన్నారు.

మీ అమ్మగారు సినిమా చూశారా? అని మహేశ్‌ను ప్రశ్నిస్తే.. 'సినిమా ఏప్రిల్‌ 20న రిలీజ్‌ అంటే 17 నుండే చిన్న వణుకు స్టార్ట్‌ అయ్యింది. శివగారు పోస్ట్‌ ప్రొడక్షన్‌లో బిజీగా ఉన్నారు. ఆయన్ను డిస్ట్రబ్‌ చేయడం ఇష్టం లేక 19 సాయంత్రం మా అమ్మగారిని వెళ్లి కలిశాను. మా అమ్మ చేతి కాఫీ అంటే ఎంతో ఇష్టం. ఆమె చేతితో కాఫీ తాగిన తర్వాత తిరిగి వస్తున్నప్పుడే నా టెన్షన్‌ అంతా పోయింది. అమ్మ ఆశీర్వాదమే అందుకు కారణం' అన్నారు.

నాన్నగారు(కృష్ణ) సినిమా చూశారా? అనే ప్రశ్నకు మహేశ్‌ మాట్లాడుతూ 'నా సినిమా సక్సెస్‌ అయినప్పుడు ఆయన ముఖంలో సక్సెసే చెబుతుంది. సినిమా ఆయన చూశారు. ఆయనకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్‌ ఓత్‌ అని ఓ టీజర్‌ను రిలీజ్‌ చేసినప్పుడు ... ఆయన నాకు ఫోన్‌ చేసి అచ్చం మన వాయిస్‌లాగే ఉంది అన్నారు. అది వినగానే చాలా బాగా నచ్చింది. అలాగే అన్నయ్య(రమేశ్‌బాబు)కి కూడా సినిమా బాగా నచ్చింది. ఎంజిఆర్‌, శివాజీగణేషన్‌లు గుర్చొచ్చారని నాకు అన్నయ్య చెప్పారు. అదే నా లైఫ్‌లో బిగ్గెస్ట్‌ కాంప్లిమెంట్‌' అన్నారు.

ట్రాఫిక్‌ సమస్యలు, చదువు సమస్యలను సినిమా చూపించిన మీరు బ్లాక్‌ మనీ అనే సమస్యను ఎందుకు టచ్‌ చేయలేదు? అని కొరటాల శివను అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. 'ప్రపంచంలో చాలా సమస్యలున్నాయి. అన్నింటినీ టచ్‌ చేయలేం. బ్లాక్‌ మనీ అనేది నా కథకు సంబంధం లేని అంశం.. అలాగే ముఖ్యమంత్రి పరిధిలోకి రాని అంశం. అందుకని ఆ సమస్యను సినిమాలో టచ్‌ చేయలేదు. మన నిజ జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలను టచ్‌చేసి పాజిబుల్‌ సొల్యూషన్స్‌ ఇవ్వాలనేదే నా ఉద్దేశం` అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved