'బిచ్చగాడు'తో సెన్సేషనల్ హిట్ సాధించి 'భేతాళుడు' 'యెమన్' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విజయ్ ఆంటోని 'ఇంద్రసేన' చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆర్. స్టూడియోస్, విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్ పతాకంపై జి.శ్రీనివాసన్ దర్శకత్వంలో రాధికా శరత్‌కుమార్, ఫాతిమా విజయ్ ఆంటోని సంయుక్తంగా నిర్మించిన 'అన్నాదురై' చిత్రాన్ని తెలుగులో 'ఇంద్రసేన' పేరుతో రిలీజ్ చేశారు. ఈ చిత్రం సక్సెస్‌మీట్ ఆదివారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ ఆంటోని, హీరోయిన్ మహిమా, రచయిత భాషా శ్రీ పాల్గొన్నారు.
విజయ్ ఆంటోని మాట్లాడుతూ ``సినిమాకు స్పందన బావుంది. మహిమ పాత్ర గుర్తుండిపోతుంది. నిర్మాత అత్యధిక థియేటర్లలో సినిమాను విడుదల చేశారు. భాష్యశ్రీ నా ఇంటి మనిషిలాంటివాడు. నా ప్రతి సినిమానూ ఆయన సొంత సినిమాగా భావించి పనిచేస్తున్నారు. మొదటి సినిమా నుంచీ తెలుగు ప్రేక్షకులు సొంత మనిషిలా నన్ను ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ అభిమానం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. పదేళ్ల తర్వాత నేను కనిపించినా ఇదే ప్రేమ చూపిస్తారనే నమ్మకం ఉంది`` అని చెప్పారు.
మహిమ మాట్లాడుతూ ``నా పాత్ర ప్రేక్షకులకు బాగా రీచ్ అయింది. చాలా మందిప్రత్యేకంగా ఫోన్లు చేసి ప్రశంసిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి పాత్రలు మరిన్ని చేయాలని ఆశిస్తున్నాను`` అని తెలిపారు.
నిర్మాత మాట్లాడుతూ ``సినిమా విజయం సాధించడం ఆనందంగా ఉంది. సినిమా చూసిన వారందరూ బావుందని మెచ్చుకుంటున్నారు`` అని అన్నారు.