నారారోహిత్, సందీప్‌కిషన్, సుధీర్‌బాబు, ఆది హీరోలుగా భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించిన చిత్రం 'శమంతకమణి'. ఈ చిత్రం జూలై 14న విడుదలైంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో...
సుధీర్‌బాబు మాట్లాడుతూ - ``మరోసారి నన్నెంటో చూపించిన సినిమా ఇది. ఎమోషన్ సీన్స్‌కు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సెకండాఫ్‌లో పబ్‌లోని సన్నివేశానికి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. పినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్`` అన్నారు. దర్శకుడు శ్రీరామ్‌కి, నిర్మాత ఆనంద్‌ప్రసాద్‌గారికి థాంక్ష్. వర్షాలు పడుతున్నా వైజాగ్ వంటి సెంటర్‌లో సినిమా హౌస్‌పుల్‌గా రన్ అవుతుంది. ఈ సినిమాలో నటించిన నా మిత్రులకు థాంక్స్. భవిష్యత్‌తో వీరితో తప్పకుండా కలిసి సినిమా చేస్తాను`` అన్నారు.
ఆది మాట్లాడుతూ - ``సినిమా విడుదలై ఆరు రోజులవుతుంది. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమా ఆదరిస్తున్న వారికి, సపోర్ట్ చేసిన వారికి థాంక్స్. సినిమాకు చాలా మంచి మౌత్ టాక్ వచ్చింది. శ్రీరామ్ ఆదిత్య స్క్రిప్ట్‌ను నమ్మి నలుగురు హీరోలు సినిమాలో నటించాం. ఈరోజు ఇంత మంచి రిజల్ట్ రావడం ఆనందంగా ఉంది. భవ్య క్రియేషన్స్ సినిమాను చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేసింది. సెకండ్ వీక్‌లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ సినిమాలో చేసిన కార్తీక్ క్యారెక్టర్ చాలా మెమొరబుల్. నేచురల్‌గా చేశానని మెచ్చుకుంటున్నారు. అందరూ బాగా నటించారు. కుటుంబమంతా కలిసి చూసే సినిమా ఇది. ఓ సినిమాలో యూనిట్ అందరికీ మంచి పేరు రావడం అనేది రేర్‌గా జరుగుతుంది`` అన్నారు.
సందీప్‌కిషన్ మాట్లాడుతూ - `` మాసినిమాను ప్రోత్సాహించిన అందరికీ థాంక్స్. ముఖ్యంగా నలుగురు హీరోలు కలిసి ఎందుకు చేస్తున్నారు అనేలా కాకుండా నలుగురు కలిసి చేయడం బావుందని అందరూ ఎంతో ప్రోత్సహించారు. అందరికీ కృతజ్ఞతలు. శమంతకమణి సినిమాతో ఇక్కడ నుండి ప్రతి సినిమా మంచి సినిమా కావాలి. ప్రతి సినిమా పేరు తెచ్చే సినిమా కావాలని మొదలు పెట్టిన జర్నీ. ఇలాంటి ఒక మంచి సినిమా కుదరడం. నలుగురు హీరోలు దగ్గరవడం. సినిమాకు ఆడియెన్స్ ఇచ్చిన రెస్సాన్స్ చూస్తే మా అందరి గెలుపుగా భావిస్తున్నాం. ధైర్యం చేసి నమ్మి, మమ్మల్ని అందరినీ ఒప్పించారు. మా నిర్మాతలకు థాంక్స్`` అన్నారు.
నారా రోహిత్ మాట్లాడుతూ - ``సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా చేయడానికి ముఖ్య కారణం కథ. ఇలాంటి ఓ క్యారెక్టర్‌ను నాకు ఇచ్చినందుకు శ్రీరామ్ ఆదిత్యకు థాంక్స్. ఇలాంటి ఓ సినిమాను నిర్మించినందుకు నిర్మాత వి.ఆనందప్రసాద్‌గారికి, ఆయనకు అండగా నిలిచిన అన్నే రవిగారికి, దర్శకత్వ శాఖకు, మణిశర్మగారికి, సమీర్ రెడ్డిగారికి అందరికీ థాంక్స్`` అన్నారు.
శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ - ``చాలా మంది సినిమా చూసి ట్విట్టర్‌లో మెసేజ్‌లు పెడుతున్నారు. సినిమా చూసిన వారందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి సినిమా ఇంకా రావాలని అంటున్నారు. నా కలను నిజం చేసిన మా హీరోలకు స్పెషల్ థాంక్స్. అందరూ కో ఆపరేట్ చేశారు. రాజేంద్రప్రసాద్‌గారికి థాంక్స్. ప్రతి నటీనటులు, టెక్నిషియన్స్‌కు థాంక్స్. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి డిపార్ట్‌మెంట్‌కు మంచి పేరు వచ్చింది. ఆనంద ప్రసాద్‌గారికి థాంక్స్. ఆయన ముందు ఈ ఐడియాను నమ్మి మా అందరికీ ఎనర్జి ఇచ్చారు`` అన్నారు.
వి.ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ - ``ఈ చిత్రం భవ్య క్రియేషన్స్‌ను మరో మెట్టు పైకి తీసుకెళ్ళింది. లౌక్యం తర్వాత 100 శాతం ఆడియెన్స్ బావుందని చెప్పిన చిత్రమిది. కుటుంబమంతా కలిసి చూసేలా మంచి కథతో ముందుకు వచ్చిన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య, సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డి, మణిశర్మగారికి, ప్రవీణ్‌పూడిగారికి, నలుగురు జెమ్స్‌లాంటి హీరోలకు థాంక్స్. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక ఆర్టిస్ట్, టెక్నిషియన్‌ను అభినందిస్తున్నాను. మా హీరోల డేట్స్ బట్టి టీంతో ప్రేక్షకులను కలిసేలా ఓ విజయయాత్రను ప్లాన్ చేస్తున్నాం. తర్వలోనే వివరాలను తెలియజేస్తాం`` అన్నారు.