pizza
PSV Garuda Vega 126.18M teaser launch
`పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం` టీజ‌ర్ విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

22 September 2017
Hyderaba
d

యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ హీరోగా, చందమామ కథలు, గుంటుర్ టాకీస్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైన‌ర్ “పి.ఎస్.వి గరుడ వేగ `126.18 ఎం`. జ్యో స్టార్ ఎంట‌ర్‌ప్రైజెస్ బ్యాన‌ర్‌పై కోటేశ్వ‌ర్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం శుక్ర‌వారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగింది. ఈ సంర‌ద్భంగా...

అంబికా కృష్ణ మాట్లాడుతూ - ``చాలా మంది సినిమాల్లో హీరోలుగా చెలామ‌ణి అవుతుంటారు. కానీ విల‌న్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆర్టిస్ట్ రాజ‌శేఖ‌ర్ హీరోగా ఎదిగారు. శేషు వంటి విల‌క్ష‌ణ‌మైన సినిమా చేయాల‌న్నా, ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌ల్లో న‌టించాల‌న్నా రాజ‌శేఖ‌ర్‌గారికే చెల్లింది. గ‌రుడ‌వేగ సినిమాతో ఆయ‌న మ‌ళ్లీ పూర్వ వైభ‌వాన్ని తెచ్చుకోవాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

డా.రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ - ``ఈ సినిమా టీజ‌ర్‌ను నా పిల్ల‌ల‌తో వారి స్నేహితుడు ఒక‌రు చూసి. ఈ సినిమా టీజ‌ర్ మాట్లాడుతుంది. మీ నాన్న‌గారేం మాట్లాడ‌న‌వ‌స‌రం లేదు. నేను చాలా ఫెయిల్యూర్స్‌ను ఫేస్ చేసిన త‌ర్వాత విల‌న్‌గా, క్యార‌క్ట‌ర్ ఆర్టిస్ట్‌గా చేయ‌మ‌ని అడిగారు. నేను కూడా స‌రేనని అనుకున్నాను. ఆ స‌మ‌యంలో నేను 30-40 క‌థ‌ల‌ను విన్నాను. ఓ ఒక్క‌టీ న‌చ్చ‌లేదు. అలాంటి స‌మ‌యంలో ప్ర‌వీణ్ స‌త్తారు ఈ క‌థ‌తో నా వద్ద‌కు వ‌చ్చారు. నేను పీక్స్‌లో ఉన్న‌ప్పుడు ఇలాంటిక‌థతో సినిమా చేయాల‌ని అనుకున్నాను. భారీ బడ్జెట్‌తో, హ‌లీవుడ్ స్టాండ‌ర్డ్స్‌లో సినిమా చేయ‌డానికి నిర్మాత‌లు ఎవ‌రూ ధైర్యం చేయ‌లేక‌పోయారు. నేను ఫెయిల్యూర్స్‌లో ఉండ‌గా ప్ర‌వీణ్ నేను చేయాల‌నుకున్న క‌థ‌తో వ‌చ్చాడు. మ‌రి ఇత‌ను హ్యాండిల్ చేయ‌గ‌ల‌డా అని కూడా అనుకున్నాను. నాకు మీరు న‌టించిన మ‌గాడు సినిమా అంటే ఇష్టం. మిమ్మ‌ల్ని అంత ప‌వ‌ర్‌ఫుల్‌గా చూపిస్తాన‌ని అన్న ప్ర‌వీణ్ స‌త్తారు అద్భుతంగా సినిమాను తెర‌కెక్కించారు. మేన్ బిహైండ్ ది గ‌రుడ వేగ ప్ర‌వీణ్ స‌త్తారు గారే. ప్ర‌వీణ్‌ను జీవిత ముందుకు న‌డిపింది. ఇలాంటి భారీ బ‌డ్జెట్ సినిమాను నాపై న‌మ్మ‌కంతో ఎవ‌రూ నిర్మిస్తార‌ని అనుకుంటున్న త‌రుణంలో మా నాన్న‌గారి స్నేహితుల ద్వారా ప‌రిచ‌యం అయిన కోటేశ్వ‌ర‌రాజుగారు, ఆయ‌న శ్రీమ‌తి హేమ‌గారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను భారీ స్థాయిలో నిర్మించారు. సినిమాను ముందు ఐదారు కోట్ల‌లోనే పూర్తి చేయాల‌నుకున్నాం కానీ చివ‌ర‌కు పాతిక కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్ అయ్యింది. ఇది మా ఇంటిలో పెళ్లిలాంటి సినిమా. పెళ్లికి అందరినీ పిలిచిన‌ట్లు ఈ సినిమాకు అంద‌రినీ పిలిచి చూపిస్తాను`` అన్నారు.

చిత్ర నిర్మాత కోటేశ్వ‌ర్‌ రాజు మాట్లాడుతూ - ``కొర్పొరేట్ స్ట‌యిల్‌ను సినిమాల్లో ఇంప్లిమెంట్ చేస్తూ చేసిన సినిమా ఇది. నేను చ‌దువుకునే రోజుల్లోనే మ‌గాడు సినిమాను మా ఊరి టెంట్‌లో చూసి హీరోగా రాజ‌శేఖ‌ర్‌గారిని ఆరాధించాను. ఇప్పుడు మా జ్యోస్టార్ బేన‌ర్‌పై గ‌రుడ‌వేగ సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది. ఈ సినిమా నిర్మాణం కోసం ముందు ఐదారు కోట్లు అనుకున్న సినిమాను అవుట్‌పుట్ బాగా వస్తుండ‌టంతో మేకింగ్‌లో కాంప్ర‌మైజ్ కాకూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్నాను. ఈ ప్ర‌యాణంలో నా స్నేహితులు నాకు అండ‌గా నిలిచారు. అందరికీ థాంక్స్‌`` అన్నారు.

నిర్మాత కోటేశ్వ‌ర్ రాజు శ్రీమ‌తి హేమ మాట్లాడుతూ - ``ఇలాంటి సినిమాలు చిర‌స్థాయిగా నిలిచిపోతాయి`` అన్నారు.

ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు మాట్లాడుతూ - ``సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాం. ఈ జ‌ర్నీలో నా టీం అందించిన స‌పోర్ట్ మ‌ర‌చిపోలేను. లార్జ్ స్కేల్‌లోని స్క్రిప్ట్ ఇది. ఇలాంటి స్కేల్‌లో సినిమా చేయ‌డానికి రాజ‌శేఖ‌ర్ వంటి హీరో అవ‌సరం అనిపించి ఆయ‌న్ను క‌లిశాను. మ‌గాడు వంటి సినిమా చేస్తాన‌ని ఆయ‌న‌తో అన్నాను. ఆయ‌న నాపై న‌మ్మ‌కంతో సినిమ చేశారు. సినిమా ఇంత బాగా రావ‌డానికి జీవిత‌గారు అందించిన స‌పోర్ట్ మ‌ర‌చిపోలేను. సినిమాను 70 ఎం.ఎం. స్కేల్‌లో చూస్తున్న‌ట్లు గ్రాండ్ విజువ‌ల్స్‌తో భారీగా ఉంటుంది. ఇంత పెద్ద సినిమా కోసం ఏది అడిగితే అది స‌మ‌కూర్చిన నిర్మాత‌ల‌కు థాంక్స్‌`` అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో పూజా కుమార్‌, ఆదిత్‌, భీమ్స్‌, శ్రీచ‌ర‌ణ్‌, శ్రీకాంత్ రామిశెట్టి త‌దిత‌ర చిత్ర యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు.

రాజ‌శేఖ‌ర్‌, పూజా కుమార్‌, ఆదిత్‌, కిషోర్‌, నాజ‌ర్‌, ఆద‌ర్శ్‌, శ‌త్రు, ర‌విరాజ్‌లు ప్రొఫెష‌న‌ల్ కిల్ల‌ర్స్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌నున్నారు. శ్రీనివాస్ అవ‌స‌రాల కామెడి పాత్ర పోషిస్తున్నాడు. అలీ సైకాల‌జిస్ట్ పాత్ర‌లో, పృథ్వీ నింఫోమానియ‌క్ పేషెంట్‌గా, పోసాని కృష్ణ‌ముర‌ళి, షాయాజీ షిండే పొలిటిషియ‌న్స్ పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతంః శ్రీచ‌ర‌ణ్ పాకాల‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ః భీమ్స్‌, సినిమాటోగ్ర‌ఫీః అంజి, గికా చెలిడ్జే, బకూర్ చికోబావా, సురేష్ ర‌గుతు, శ్యామ్‌, ఎడిటింగ్ః ధ‌ర్మేంద్ర కాక‌రాల‌, ఆర్ట్ః శ్రీకాంత్ రామిశెట్టి, స్టంట్స్ః నూంగ్‌, డేవిడ్ కుబువా, స‌తీష్‌, బాబీ అంగారా, నిర్మాత: కొటేశ్వ‌ర్ రాజు, ద‌ర్శ‌క‌త్వం: ప‌్ర‌వీణ్ స‌త్తారు.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved