మాస్ హీరో గోపీచంద్, హ్యాట్రిక్ డైరెక్టర్ సంపత్ నందిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సూపర్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ `గౌతమ్ నంద`. శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో గోపీచంద్ సరసన హన్సిక-కేథరీన్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ విడుదల కార్యక్రమం హీరో గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 12న జరిగింది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు టీజర్‌ను విడుదల చేశారు.
కేథరీన్ మాట్లాడుతూ - ``గౌతమ్‌నంద నాకు ప్రత్యేకమైన సినిమా. దర్శకుడు సంపత్‌నంది సినిమాను చాలా స్టయిలిష్‌గా తెరకెక్కించారు. గోపీచంద్ వంటి మంచి కోస్టార్‌తో సినిమాలో యాక్ట్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది`` అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ - ``టీజర్‌ను మించి సినిమా ఉంటుంది. సినిమాను జూలైలో విడుదల చేస్తాం. మరో వారంలో ఆడియో విడుదల కార్యక్రమం ఉంటుంది`` అన్నారు.
దిల్‌రాజు మాట్లాడుతూ - ``దర్శకుడు సంపత్ నంది వరుసగా మంచి సక్సెస్‌లను సాధిస్తున్నాడు. టీజర్ బావుంది. గోపీచంద్‌ను సంపత్ కొత్తగా చూపిస్తున్నాడు. ఈ సినిమాలో గోపీ హీరోగానే కాకుండా నెగటివ్ రోల్‌లో కూడా నటిస్తున్నాడు. సినిమాకు మంచి టెక్నిషియన్స్ కుదిరారు. సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది`` అన్నారు.
Catherine Tresa Glam gallery from the event
దర్శకుడు సంపత్ నంది మాట్లాడుతూ - ``ఇంతకు ముందు హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ కథలు రాసేవాడిని, గౌతమ్ నంద కథలోనే హీరోయిజం ఉంది. సాలిడ్ కంటెంట్‌కు, మంచి విజువల్స్ తోడైతే సినిమా బాగా వస్తుందనడానికి మా సినిమాయే నిదర్శనం. సినిమాటోగ్రాఫర్ సౌందర్‌రాజన్‌గారు చాలా చక్కగా పిక్చరైజ్ చేశారు. ప్రతి షాట్ స్టైలిష్‌గా ఉంటుంది. గోపీచంద్‌గారు ఇచ్చిన సపోర్ట్‌తో సినిమాను ఇంత బాగా తీయగలిగాను. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కించారు. కేథరీన్, హన్సికలు గ్లామర్‌తో పాటు పెర్‌ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్స్‌లో మెప్పిస్తారు. జూలైలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.
హీరో గోపీచంద్ మాట్లాడుతూ - ``కథ వినగానే సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. నా కెరీర్‌లో ఈ చిత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్ మూవీ అవుతుంది. రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయడం ఇదే ప్రథమం. రెండు సాంగ్స్ పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నెలలో ఆ సాంగ్స్‌ను పూర్తి చేసి జూలైలో సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాం. ఈ నిర్మాతలతో శంఖం సినిమాకు పనిచేశాను. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను రూపొందించారు. సౌందర్‌రాజన్ సినిమాటోగ్రఫీ, థమన్ మ్యూజిక్ సహా మంచి టీం కుదిరింది`` అన్నారు.