అల్లు శిరీష్, సురభి, అవసరాల శ్రీనివాస్, శీరత్ కపూర్ ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం `ఒక్క క్షణం`. . వి.ఐ.ఆనంద్ దర్శకుడు. చక్రి చిగురుపాటి నిర్మాత. సినిమా డిసెంబర్ 28న విడుదలైంది. శనివారం సినిమా సక్సెస్‌లో భాగంగా చిత్రయూనిట్ థాంక్స్ మీట్‌ను నిర్వహించారు. ఇందులో అల్లు శిరీష్, దర్శకుడు విఐఆనంద్, నిర్మాత చక్రి చిగురుపాటి సహా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..
అల్లు శిరీష్ మాట్లాడుతూ - ``ఒక్కక్షణం` సినిమాను ప్రేక్షకులు చాలా పెద్ద హిట్ చేసినందుకు వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. నా తొలి సినిమా`గౌరవం` బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ సాధించలేదు. దాంతో ఏదైనా కొత్తగా చేద్దామనే ఆలోచన తగ్గిపోయింది. తర్వాత చేసిన కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు వంటి కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను చేశాను. మళ్లీ ధైర్యం తెచ్చుకుని ఏదైనా కొత్తగా చేస్తే ఆడియెన్స్ ఆదరిస్తారనిపించింది. ఆ ప్రయత్నంలో భాగంగా `ఒక్కక్షణం` సినిమా చేశాను. నమ్మకంతో ఈ సినిమా చేశాను. ఈ రోజు నా నమ్మకం నిజమైంది. 2017లో ఈ సినిమాకు నాకు ఓ మెమరబుల్ మూవీగా నిలిచింది. నా కెరీర్‌లో 2017కి చాలా ప్రత్యేకత ఉంది. 1971 బియాండ్ బోర్డర్ సినిమాలో మోహన్‌లాల్‌గారి పక్కన మంచి సపోర్టింగ్ పాత్రలో నటించాను. ఆ సినిమాలో నా క్యారెక్టర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే డిసెంబర్ 28న `ఒక్కక్షణం` విడుదలైంది. మొత్తంగా చూస్తే ఇది నా ఐదవ సినిమా. ఈ సినిమాకు వచ్చినంత రెస్పాన్స్ ఏ సినిమాకూ రాలేదు. సినిమా చూసిన వారందరూ అప్రిసియేట్ చేశారు. ఇంత మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. అలాగే నాతో వర్క్ చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు. భవిష్యత్‌లో కూడా మంచి సినిమాలు చేయాలనే కాన్ఫిడెన్స్ ఇచ్చిన అందరికీ థాంక్స్`` అన్నారు.
దర్శకుడు విఐ.ఆనంద్ మాట్లాడుతూ - ``డిసెంబర్ 28న విడుదలైన `ఒక్కక్షణం` సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులు సహా అందరికీ థాంక్స్. ఈ సినిమాను కాంప్రమైజ్ కాకుండా నిర్మించిన నిర్మాతలకు, సహకారం 1అందించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు థాంక్స్`` అన్నారు.
శీరత్ కపూర్ మాట్లాడుతూ - ``2018 ఏడాదిని మాకు ఒక్కక్షణం సక్సెస్‌తో స్వాగతం పలికిన ప్రేక్షకులకు థాంక్స్. అలాగే సినిమా సక్సెస్‌లో భాగమైన యూనిట్‌కు థాంక్స్`` అన్నారు.