pizza
'Saptagiri LLB Trailer Is Impressive. Film Will Become A Big Hit' - Mega Power Star Ram Charan
'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' ట్రైలర్‌ చాలా బాగుంది.. తప్పకుండా సినిమా పెద్ద హిట్‌ అవుతుంది - మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

28 November 2017
Hyderaba
d

Comedy King Saptagiri's 'Saptagiri LLB' Produced by Dr. K Ravi Kirane under his Sai Celluloid Cinematic Creations Pvt Ltd in Charaen Lakkakula's Direction is gearing up to release worldwide on Dec 7th. Mega Power Star Ram Charan released theatrical trailer of 'Saptagiri LLB' on monday. Hero Saptagiri, Director Charaen Lakkakula, Music Director Vijay Bulganin, Producer Dr.K Ravi Kirane were present during the launch.

On this occasion Mega Power Star Ram Charan says, " I like Saptagiri a lot. We worked together for a film. He is a matured comedian. Very good person. Trailer of this film is very good. It is even better than Hindi version's trailer. Film looks colorful with quality. Definitely film will become a big hit. I watched songs also.Songs look good too. Bulganin is a talented music director. He composed a song for my birthday. I wish along with mega fans, all heroes fans should encourage this film and make this film a big hit so that it will make more money for producer."

Hero Saptagiri says, " I am very happy today. Everyone will take Chiranjeevi garu as inspiration to achieve something in life. I am very lucky that I was born as a mega fan. I will never forget the support Pawan Kalyan garu, Ram Charan garu, Sai Dharam Tej garu is giving for a mega fan like me to stand as a Hero in this industry. This film will make all mega fans proud. Thanks to Ram Charan garu for launching the trailer of 'Saptagiri LLB' ".

Producer Dr.Ravi Kirane says,"Thanks to Ram Charan garu for making time for us and launched the trailer in his busy schedule. Everyone says Ram Charan garu is a good human being. I witnessed his good nature today. Today will remain as a memorable day in my life."

Director Charaen Lakkakula says, " Thanks to Mega Power Star Ram Charan garu for launching our trailer. I worked as a co-director for 'Racha'. I travelled for one year with Ram Charan garu. He is very easy going, jovial on sets. He is a great person who is very good at heart. I am very happy that such a good person launched the trailer of my film 'Saptagiri LLB' ".

Music Director Vijay Bulganin Says, " I composed a song on the occasion of Ram Charan gari birthday. Jani Master choreographed the song. Charan garu watched the song and appreciated me. I will never forget his appreciation for my 'Saptagiri LLB' songs."

'Sapthagiri LLB' is slated to release worldwide on December 8th

Along with Comedy King Saptagiri, Kashish Vohra will be seen as female lead.

Dialogues : Paruchuri Brothers
Music : Vijay Bulganin
Co-Director : Rajasekhar Reddy Pulicherla
Photography : Saarangam S.R
Editing : Goutham Raju
Art : Arjun
Lyrics : Chandra Bose, Kandikonda
Production Executive : Bhikshapati Tummala
Producer : Dr. Ravi Kirane
Direction : Charaen Lakkakula

'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' ట్రైలర్‌ చాలా బాగుంది.. తప్పకుండా సినిమా పెద్ద హిట్‌ అవుతుంది - మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌

కామెడీ కింగ్‌ సప్తగిరి కథానాయకుడిగా సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై లిమిటెడ్‌ పతాకంపై చరణ్‌ లక్కాకుల దర్శకత్వంలో డా.రవికిరణ్‌ నిర్మిస్తున్న చిత్రం 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్‌ 7న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌కి రెడీ అవుతోంది. కాగా, ఈ చిత్రం థియేట్రికల్‌ ట్రైలర్‌ను మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ సోమవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో సప్తగిరి, దర్శకుడు చరణ్‌ లక్కాకుల, సంగీత దర్శకుడు విజయ్‌ బుల్గానిన్‌, నిర్మాత డా. రవికిరణ్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ మాట్లాడుతూ ''సప్తగిరి అంటే నాకు చాలా ఇష్టం. ఇద్దరం కలిసి ఒక సినిమా చేశాం. మెచ్యూర్డ్‌ కమెడియన్‌ అతను. చాలా మంచి వ్యక్తి. ఈ సినిమా ట్రైలర్‌ చాలా బాగుంది. హిందీ ట్రైలర్‌ కంటే తెలుగులో బాగా చేశారు. క్వాలిటీగా, చాలా కలర్‌ఫుల్‌గా వుంది. తప్పకుండా సినిమా పెద్ద హిట్‌ అవుతుంది. పాటలు కూడా చూశాను. చాలా బాగున్నాయి. బుల్గానిన్‌ మంచి టాలెంట్‌ వున్న మ్యూజిక్‌ డైరెక్టర్‌. గతంలో నా బర్త్‌డేకి ఒక పాట కూడా చేశాడు. ఈ సినిమాని మెగా అభిమానులే కాకుండా మిగతా పెద్ద హీరోల అభిమానులు కూడా చూసి పెద్ద హిట్‌ చెయ్యాలని, నిర్మాతకు మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

హీరో సప్తగిరి మాట్లాడుతూ ''ఈరోజు చాలా ఆనందంగా వుంది. జీవితంలో ఎదగాలంటే చిరంజీవిగారిని ఆదర్శంగా తీసుకుంటారు. నేను మెగా అభిమానిగా పుట్టడం నా అదృష్టం. ఒక మెగా అభిమాని హీరోగా ఎదగడం కోసం పవన్‌కళ్యాణ్‌గారు, రామ్‌చరణ్‌గారు, సాయిధరమ్‌ తేజ్‌గారు అందిస్తున్న సహకారాన్ని ఎప్పటికీ నేను మర్చిపోలేను. మెగా అభిమానులందరూ గర్వపడేలా, వారి గౌరవం నిలబెట్టేలా ఈ సినిమా వుంటుంది. 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' ట్రైలర్‌ రిలీజ్‌ చెయ్యాల్సిందిగా కోరగానే ఎంతో మంచి మనసుతో అంగీకరించిన రామ్‌చరణ్‌గారికి నా ధన్యవాదాలు'' అన్నారు.

నిర్మాత డా.రవికిరణ్‌ మాట్లాడుతూ ''ఎంతో బిజీ షెడ్యూల్‌లో వున్నప్పటికీ మాకు టైమ్‌ కేటాయించి ట్రైలర్‌ లాంచ్‌ చేసిన రామ్‌చరణ్‌గారికి ధన్యవాదాలు. రామ్‌చరణ్‌గారు గుడ్‌ హ్యూమన్‌ బీయింగ్‌ అంటారు. అది ఈరోజు కళ్ళారా చూశాను. ఇది నేను జీవితంలో మర్చిపోలేని రోజు'' అన్నారు.

దర్శకుడు చరణ్‌ లక్కాకుల మాట్లాడుతూ ''మా ట్రైలర్‌ని రిలీజ్‌ చేసిన మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌గారికి చాలా థాంక్స్‌. 'రచ్చ' సినిమాకి నేను కో డైరెక్టర్‌గా పనిచేశాను. రామ్‌చరణ్‌గారితో సంవత్సరం పాటు ట్రావెల్‌ చేశాను. లొకేషన్‌లో చాలా జోవియల్‌గా వుంటూ అందరితో సరదాగా మాట్లాడే మంచి మనసున్న వ్యక్తి. చాలా గ్రేట్‌ పర్సన్‌. ఆయన ట్రైలర్‌ లాంచ్‌ చేయడం చాలా ఆనందంగా వుంది'' అన్నారు.

సంగీత దర్శకుడు విజయ్‌ బుల్గానిన్‌ మాట్లాడుతూ ''రామ్‌చరణ్‌గారి బర్త్‌డే సందర్భంగా ఒక పాట కంపోజ్‌ చేశాను. ఆ పాటకు జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేశారు. ఆ పాట చూసి చరణ్‌గారు నన్ను ఎంతో మెచ్చుకున్నారు. 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' పాటలు చూసి అప్రిషియేట్‌ చెయ్యడం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను'' అన్నారు.

డిసెంబర్‌ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రంలో కామెడీ కింగ్‌ సప్తగిరి సరసన కశిష్‌ వోరా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్‌, సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌, కో-డైరెక్టర్‌: రాజశేఖర్‌రెడ్డి పులిచెర్ల, ఫొటోగ్రఫీ: సారంగం ఎస్‌.ఆర్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: అర్జున్‌, పాటలు: చంద్రబోస్‌, కందికొండ, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: భిక్షపతి తుమ్మల, నిర్మాత: డా. రవికిరణ్‌, దర్శకత్వం: చరణ్‌ లక్కాకుల.

 



Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved