సూపర్‌స్టార్ రజనీకాంత్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం '2.0'. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'రోబో' చిత్రానికి సీక్వెల్‌గా '2.0' చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, కరణ్ జోహర్ సమర్పణలో సుభాష్ కరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వేల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంతేకాకుండా పూర్తిగా త్రిడి ఫార్మాట్‌లో చిత్రీకరణ జరుపుకున్న తొలి భారతీయ సినిమా '2.0' కావడం విశేషం. ఈ చిత్రానికి 4డి ఫార్మాట్‌లో సౌండ్ డిజైన్ చేయడం మరో విశేషం. ఈ చిత్రాన్ని నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు వెర్షన్‌ను ఎన్.వి.ఆర్. సినిమా పతాకంపై ప్రముఖ నిర్మాత ఎన్.వి.ప్రసాద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. కాగా, ఈ చిత్రం ట్రైలర్‌ను నవంబర్ 3న చెన్నైలో విడుదల చేశారు. ఈ సందర్భంగా...
హీరోయిన్ ఎమీ జాక్సన్ మాట్లాడుతూ ''నేను చాలా నెర్వస్‌గా ఉన్నా. రజనీకాంత్‌గారితో కలిసి పనిచేయడం చాలా గొప్ప గౌరవం. దర్శకనిర్మాతల వల్లనే నా కల నెరవేరింది. యానిమేట్ చేసిన రోబోలాగా నటించాను. రోబోలాగా డ్యాన్స్ చేయమన్నారు. చిట్టి, నా పాత్రలు చాలా బాగా ఉన్నాయి. శంకర్ మూడేళ్ల ముందు చెప్పిన కథ ఈ రూపం రావడానికి వేల మంది పనిచేశారు. రజనీగారితో, అక్షయ్ గారితో నేను పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. నీరవ్‌గారితో మూడో సినిమా చేస్తున్నా. ముత్తురాజ్‌గారు చాలా కష్టపడ్డారు. 4డీ గురించి కూడా నాకు తెలియదు. ఆంటోనీతో నాలుగో సినిమా చేశాం. రెహమాన్‌గారు చాలా మంచి ట్యూన్స్ ఇచ్చారు. సుభాష్ కరణ్‌కి థాంక్స్'' అని అన్నారు.
ఎడిటర్ ఆంటోనీ మాట్లాడుతూ ''శంకర్‌గారితో ఐదు సినిమాలు చేయడం ఆనందంగా ఉంది'' అని అన్నారు.
వీఎఫ్‌ఎక్స్ శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ ''అసాధ్యమైన విషయాలనే శంకర్‌గారు ఆలోచిస్తారు. విజువల్ ఎఫెక్ట్స్‌కి సంబంధించి శంకర్‌గారికి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. చాలా ఎక్కువ గైడ్ చేసేవారు 25 టీమ్స్‌గా మేం చేశాం. వీఎఫ్‌ఎక్స్ స్టూడియోలు అన్నిటికీ థాంక్స్. రజనీగారికి, అక్షయ్‌గారికి, రెహమాన్‌గారికి ధన్యవాదాలు. రసూల్‌గారు 4డీ సౌండ్ చేయడం చాలా గొప్ప విషయం'' అని అన్నారు.
యాక్షన్ సిల్వ మాట్లాడుతూ ''శంకర్ సార్ శిల్పిలాంటివాడు. ప్రతి సీన్‌నీ చెక్కాలనుకుంటారు. ఆయనతో నేను శివాజీకన్నా ముందు ఓ సినిమా, శివాజీ చేశాను. అప్పట్లో నేను పీటర్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్‌గా ఉన్నాను. నన్ను మాస్టర్‌ని చేసి నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రజనీసార్ చాలా చిన్న వ్యక్తుల నుంచి కూడా నేర్చుకోవాలనే స్వభావం ఉన్న వ్యక్తి. ఆయనకు నాలుగు కుట్లు పడేంత గాయమైనప్పటికీ వాటన్నిటినీ పట్టించుకోకుండా షూటింగ్ చేశారు. అక్షయ్‌కుమార్‌గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ముంబైలో స్టంట్ యూనియన్‌కు ఆయనే ఇన్‌స్యూరెన్స్ చేసిచ్చారు'' అని అన్నారు.
కెమెరామేన్ నీరవ్ షా మాట్లాడుతూ ''2డీలో సినిమా తీసి త్రీడీకి మారిస్తే అంత నాణ్యత కనిపించదు. అలాగని త్రీడీలో తీయడం కూడా సులభం కాదు. చాలా కష్టతరమైన అంశం. ఈ సినిమా విషయంలో నాకు చాలెంజ్ కన్నా లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్ ఎక్కువగా అనిపించింది. కథ విన్నప్పుడు తల ఊపానుకానీ, ప్రయాణంలోనే ఎక్కువ నేర్చుకున్నా'' అని అన్నారు.
ప్రొడక్షన్ డిజైనర్ ముత్తురాజ్ మాట్లాడుతూ ''నా సినిమా కెరీర్‌లో ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ చిత్రమిది. చాలా గొప్ప ఎక్స్‌పీరియన్స్. త్రీడీ కోసం చేస్తున్నప్పుడు చాలా కొత్తగా అనిపించింది. చాలా నేర్చుకున్నా. రజనీకాంత్‌గారి ఫ్యాన్ అయిన నేను ఆయనతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. నా అసిస్టెంట్లు చాలా కష్టపడ్డారు. అందరికీ ధన్యవాదాలు. టీమ్‌కి క తజ్ఞతలు. ఈ సినిమా కథ వినగానే ముందు ఈ సినిమా ప్రాపర్టీస్ చేశాం. రోబోటిక్ ఆర్మ్స్ చేశాం. ఇన్‌సెట్స్‌లో బర్డ్ వంటివన్నీ, నెమలి వంటివన్నీ చేశాం. చాలా ఆర్మీ ట్యాంకర్లు, స్ట్రైకర్లు వంటివన్నీ చేశాం. దాదాపు ఏడాదిన్నర మెషిన్లు చేశాం. వీటితో సెట్‌కి సంబంధం లేవు. కేవలం రెండు టీమ్‌లు దీనికోసమే పనిచేశాయి'' అని అన్నారు.
అక్షయ్ కుమార్ మాట్లాడుతూ ''2, 3 గంటలు ప్రాక్టీస్ చేసి తమిళ్‌లో రాసుకుని మాట్లాడుతున్నా. ఆనందంగా ఉంది. రజనీసార్, శంకర్‌సార్, రెహమాన్‌గారితో కలిసి '2.0'లో నా పేరు కూడా ఉండటం ఆనందంగా ఉంది. ఈ సినిమాకోసం నన్ను అప్రోచ్ అయిన టీమ్‌కి ధన్యవాదాలు'' అని అన్నారు. అనంతరం విశాల్ అడిగిన ఫిట్‌నెస్‌కు సంబంధించిన ప్రశ్నకు అక్షయ్ సమాధానమిస్తూ ''నాకు నా జిమ్ ఉంది. నేను ప్రతి రోజూ ఉదయం 4 గంటలకు లేస్తా మా నాన్న ఆర్మీలో ఉండేవారు. నా చిన్నతనం నుంచి చేస్తున్నా. నా లైఫ్ స్టైల్ నాకు ఇష్టం. ఎవరూ నన్ను ఇలాగే చేయమని ఫోర్స్ చేయలేదు. నా జీవితంలో ప్రతి రోజూ నేను సన్‌రైజ్‌ని చూస్తాను. నేను ప్రతి రోజునూ, ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తాను. నాకు నా శరీరమే దేవాలయం. మా నాన్న నాకు అదే నేర్పించారు. నాకు విశాల్ గురించి తెలుసు. తను అన్నం తినడని నాకు తెలుసు. వాళ్ల అమ్మకు అది నచ్చదని కూడా నేను చదివా. కనీసం ఆదివారమైనా అన్నం, దోసలు, ఇడ్లీలు తినాలని ఆశిస్తున్నా'' అని అన్నారు. క తిక అనే ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ''ఈ సినిమా వల్ల నేను చాలా నేర్చుకున్నా. శంకర్ నా ద ష్టిలో సైంటిస్ట్. ఆయన డైరక్టర్ మాత్రమే కాదు, ఆయన దగ్గర చాలా నేర్చుకున్నా. మూడున్నర గంటలు కూర్చుని మేకప్ చేసుకోవడం, ఏడాదిన్నర దాన్ని తీసుకోవడం నేను మర్చిపోలేను. నేను గత 28 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నాను. ఇన్నేళ్లుగా వేసుకున్న మేకప్ మొత్తం ఈ సినిమాకు వేసుకున్న మేకప్‌తో సరితూగదు. ఈ సినిమా నాకు ఇచ్చినందుకు శంకర్‌గారికి ధన్యవాదాలు'' అని అన్నారు.
ఎ.ఆర్.రెహమాన్ మాట్లాడుతూ ''ఈ సినిమాలో ముందు మేం పాటలు లేవనుకున్నాం. కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోరే అనుకున్నాం. కానీ ఇప్పుడు నాలుగు పాటలున్నాయి. ఇందిరలోకం.. అనే పాటకోసం దాదాపు 12, 13 ట్యూన్ల తర్వాత శంకర్‌గారు ఈ ట్యూన్ సెలక్ట్ చేశారు. ముందు రీరికార్డింగ్‌ని కీబోర్డ్, కంప్యూటర్స్‌లో కంపోజ్ చేశాం. నెల రోజుల క్రితం 100 మంది ఆర్కెస్ట్రా లండన్లో, ముంబైలో 40 మంది, చెన్నైలో ఇంకొంతమందితో చేశాం. అయినా విజువల్స్ కొన్నిటిని చూసినప్పుడు నేను చేసిన సంగీతం చాల్లేదనిపించింది. ఇప్పుడు ఇంకా చేశాం. సినిమాకన్నా వారం రోజుల ముందు రీరికార్డింగ్‌లో కొంత భాగాన్ని రిలీజ్ చేస్తాం. ఒక పర్సనాలిటీ లైక్ చేయాలంటే వాళ్లు.. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారు. వాళ్ల జీవితం ఎలా ఎగ్జాంపుల్‌గా ఉంది వంటి విషయాలను గురించి ఆలోచిస్తాం. నాకు రజనీకాంత్‌గారు చాలా రకాలుగా స్ఫూర్తినిచ్చారు. ఆయన స్పిరిచువాలిటీగానీ, ఆయన సినిమాలోని చిన్న చిన్న డైలాగులుగానీ నాకు ఇష్టం. ఈ వయసులోనూ ఇలాంటి సినిమాలు చేయాలని ఆశ ఉండటం చాలా గొప్ప. చిన్నతనం నుంచి సంగీత రంగంలో ఉండటం వల్ల నేను 40 ఏళ్లప్పుడు రిటైర్ కావాలని అనుకున్నా. అప్పుడే 'రోబో' సినిమా చేస్తున్నా. ఆ సెట్‌కి వెళ్లి రజనీకాంత్‌గారిని చూశాక , ఆఫ్ సెట్, ఆన్ సెట్ ఆయన్ని చూశాక నా మనసు మారింది. ఇవాళ నేను సంగీత రంగంలో ఉండటమే గొప్ప కటాక్షంగా భావిస్తున్నా. నా తండ్రి ద్వారా వచ్చిన గౌరవంగా భావిస్తున్నా. ఆ గౌరవాన్ని స్వీకరించి సర్వీస్ చేస్తున్నా. మా నాన్నకి, గాడ్‌కీ సంగీతంతో సంగీతం చేస్తున్నా. '2.0'కి పనిచేసిన అనుభవం అనేది 8 సినిమాలు చేసినట్టు అనిపిస్తోంది. నాలో చాలా మార్పు వచ్చింది. నేను 3 ఏళ్లు ముందు వేరు., 2 ఏళ్ల ముందు వేరు. ఇప్పుడు వేరు. ఇందాకే చెప్పినట్టు గత రెండు నెలలుగా సినిమాలోని ఎఫెక్ట్స్ చూసినప్పుడు నా సంగీతం వాటి ముందు చాల్లేదనిపించింది. అందుకే ఇంకా క షి చేశా. ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్ చాలా పెద్ద ఇన్‌స్పయిరింగ్ రోల్ చేశారు. సుభాష్ కరణ్‌గారు, రసూల్ పూకొట్టి, ఇంకా చాలా చాలా మంది క షి చేశారు. 'ఇందిర లోకం' పాట రాసిన కీర్తిశేషులు ముత్తకుమార్‌కీ, మా అబ్బాయి ఎ.ఆర్.అమీన్‌కీ థాంక్స్'' అని అన్నారు.
రసూల్ పూకొట్టి మాట్లాడుతూ ''శంకర్ నాకు ఫోన్ చేసి స్టోరీని నెరేట్ చేశారు. ఫ్లోర్ స్పేస్ సౌండ్ స్క్రీన్ నుంచి ఆడియన్స్ వరకు వెళ్లడాన్ని ఆయన వివరించారు. అదంతా విని నాకు వెన్నులో చలి మొదలైంది. ప్రపంచ సినిమాలో ఇలాంటిది చేయడం ఇదే తొలిసారి. రెండేళ్లు నేను, శంకర్ కలిసి పనిచేసి దీన్ని రియాలిటీకి తీసుకొచ్చాం. చాలా మంది మాకు సాయం చేశారు. సాఫ్ట్ వేర్ డెవలపర్స్ సాయం మర్చిపోలేం. ఎందరో మమ్మల్ని అలోగరిథమ్ ఆఫ్ సినిమా ప్రొజెక్షన్‌ని రీరైట్ చేయడానికి అనుమతించారు. స జనకారుల ఆలోచనలను అంతే గొప్పగా అర్థం చేసుకునే నిర్మాత చాలా ముఖ్యం. నిర్మాతకు ధన్యవాదాలు. ఇండియన్ సినిమా స్టాల్వార్ట్స్ ఎందరో ఇక్కడున్నారు. ధ్వని విషయంలో చోటుచేసుకున్న చారిత్రాత్మక విషయానికి ఈ ప్రదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రత్యక్ష సాక్షులు. కొత్త ఫార్మాట్‌కి సాక్షులు. త్రీడీ సౌండ్‌లో ఉన్న అన్నిటికన్నా అడ్వాన్స్డ్ లెవల్ ఇది. అలోగరిథమ్స్ మార్చి దాన్ని రియాలిటీలోకి తీసుకొచ్చాం. ఈ ఫార్మాట్ వల్ల మూవీ మరింతగా ఆడియన్స్ మైండ్‌కి చేరుతుంది. ఇంత గొప్ప అచీవ్‌మెంట్లో భాగం కావడం ఆనందంగా ఉంది. నా టీమ్‌కి, లైకా టెక్నికల్ టీమ్‌కి ధన్యవాదాలు. ఇది తలైవర్ సినిమా'' అని అన్నారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్ మాట్లాడుతూ ''ఆల్ ఇండియా మీడియాను ఒక రూఫ్ కింద చూడటం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా సూపర్‌డూపర్ హిట్ అవుతుంది. సుభాష్‌కరణ్‌కి, శంకర్‌కి అడ్వాన్స్ కంగ్రాట్స్. నిర్మాత 600 కోట్లు పెట్టారు. శంకర్‌ని నమ్మి పెట్టారు. అంతేగానీ నామీదో, అక్షయ్‌కుమార్ మీదో కాదు. ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్, నిర్మాతల ఎక్స్‌పెక్టేషన్స్‌ని ఎప్పుడూ రీచ్ అవుతూనే ఉన్నారు శంకర్. కొన్నిసార్లు తప్పి ఉండవచ్చు. అయినా అతను మెజీషియన్. అతను చాలా గొప్ప డైరక్టర్. ఏదో రూ.600కోట్లు పెట్టినంత మాత్రాన ఈ సినిమా హిట్ అని నేను చెప్పడం లేదు. అందరూ కష్టపడతారు. అయినా అన్నిసార్లు వర్కవుట్లు కావు. కొన్నిసార్లు ఏవో మేజిక్‌లు వర్కవుట్లు అవుతాయి. ఈ సినిమాలో అలాంటి మేజిక్‌లున్నాయి. ఈ సినిమాకు మోర్ ప్రమోషన్లు అవసరం లేదు. అసలు ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలామంది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తారు. మంచికి తోడుగా ఉండే మీడియా తప్పకుండా ఎంకరేజ్ చేస్తారు. చిల్డ్రన్‌కీ, ఇంటలెక్చువల్స్ కీ, సూడో ఇంటలెక్చువల్స్‌కీ నచ్చుతుంది. ఇందులో అన్ని అంశాలున్నాయి. ఈ విశ్వం మానవులకు మాత్రమే కాదు. పశుపక్ష్యాదులకు కూడా. అలాంటి పలు విషయాలను, సందేశాత్మకంగా చెప్పారు శంకర్. పర్యావరణాన్ని, సొసైటీని మోడ్రన్ టెక్నాలజీ ఎలా స్పాయిల్ చేస్తుందో ఇందులో చాలా బాగా చెప్పారు. శంకర్‌గారు ఏమనుకున్నారో దాన్ని తేగల సత్తా ఆయనకుంది. అందుకే ఆయన కథ చెప్పినప్పుడు 'ఇదెలా వర్కవుట్ అవుతుంది?' అని గానీ, ఇంకేమీ గానీ అడగలేదు. ఎవరు నిర్మిస్తున్నారు అని మాత్రం అడిగాను. 'శివాజీ' చేసేటపుడు ఆ సినిమాకు అనుకున్న బడ్జెట్ కన్నా రెట్టింపయింది. విడుదల సమయంలో ఇంకా ఎక్కువైంది. కానీ ఆ సినిమాకు అంత కన్నా ఎక్కువ మొత్తం కలెక్షన్లు వచ్చాయి. 'శివాజీ' ఎంత కలెక్ట్ చేసిందో, అంత బడ్జెట్ వేశారు 'రోబో'కి. సన్ పిక్చర్స్ వాళ్లు.. దానికన్నా 20-30 పర్సెంట్ బడ్జెట్ ఎక్కువయింది. అయినా కలెక్ట్ అయింది. 'రోబో' కలెక్ట్ చేసినంత ఈ సినిమాకు వస్తే చాలు అని '2.0' మొదలుపెట్టాం. అందుకే ముందు రూ.300కోట్లు అనుకున్నాం. ఇప్పుడు డబుల్ అయింది. తప్పకుండా అంతకు డబుల్ కలెక్ట్ చేస్తుంది. 'కబాలి' ఒక షెడ్యూల్ చేసిన తర్వాత నాకు అనారోగ్యం వచ్చింది. '2.0' కోసం 5 రోజులు షూట్ చేశా. 7, 8 రోజులైంది. అప్పటికే నాకు ఆత్మవిశ్వాసం పోయింది. 'నేను జస్టిఫై చేయలేను. ఖర్చుపెట్టిందంతా ఇచ్చేస్తాను. నేను చేయలేను' అని శంకర్‌ని పిలిచి చెప్పా. 'మీరు జస్ట్ అలా రండి. మీరు కన్ను చూపించండి.. మిగిలింది మొత్తం మనం చేద్దాం' అని అన్నారు. బాడీ సూట్ వద్దు అని అన్నారు. కానీ నేనే.. ఆ బాడీ సూట్ నేను వేసుకుంటా అని అన్నాను. 'కబాలి' కోసం మలేషియాకి వెళ్లినప్పుడు ఆరోగ్యం ఇంకా చాలా పాడయింది. అప్పుడు డాక్టర్ నాలుగైదు నెలలు రెస్ట్ కావాలన్నారు. ఆ విషయం నిర్మాతకు తెలిసి మా ఇంటికి వచ్చి 'నాలుగు నెలలు కాదు, నాలుగు సంవత్సరాలు వెయిట్ చేస్తా. నాకు డబ్బులు కాదు. మీతో సినిమా ముఖ్యం' అని అన్నారు. అలాంటి ఒక ఫ్రెండ్ దొరకడం, ఓ కోహినూర్ డైమండ్ దొరికినట్టు. ఈ ప్రపంచంలో నాకు మంచి ఫ్రెండ్ దొరికారు. శంకర్ త్వరలో కమల్‌హాసన్‌తో చేసే 'ఇండియన్2' చాలా గొప్పగా ఉంటుంది. ఈ సినిమా చాలా లేట్ అయింది, ఎందుకు లేట్ అయింది అని చాలా మంది అడిగారు. కానీ కాస్త లేట్ అయినా, కరెక్ట్‌గా రావాలి. వస్తే, ష్యూర్‌గా కొట్టాలి. నేను.. సినిమా గురించి చెప్పాను. సినిమా గురించి మాత్రమే చెప్పా. ప్రజలు నమ్మారు. హిట్ అని నిర్ణయించారు. రిలీజ్ చేయడమే బాకీ. ఈ సినిమాను, తమిళ్ ఇండస్ట్రీని ప్యాన్ ఇండియా స్థాయిని మించి ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లారు శంకర్. శంకర్, రాజమౌళి, రాజ్‌కుమార్ హిరానీ లాంటివారు జెమ్స్ ఆఫ్ ఇండస్ట్రీ. వాళ్లందరినీ చాలా గొప్పగా చూసుకోవాలి. నీరవ్ షా చాలా ఈజ్‌తో చేశారు. నీరవ్‌షా చూడ్డానికి, ఆయన చేసే పనికీ సంబంధమే ఉండదు. ఎమీ జాక్సన్ మొత్తం ఆ సూట్‌లోనే ఉండేవారు. అక్షయ్‌కుమార్‌కి హ్యాట్సాఫ్. ఆయన్ని ఢిల్లీలో చూసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఆస్కార్ రెహ్మాన్‌కే ఈ సినిమా రీరికార్డింగ్ చేయడం చాలా ఛాలెంజ్. అసిస్టెంట్ డైరక్టర్లు పడ్డ కష్టం చాలా గొప్పది. శంకర్‌గారు చాలా గొప్ప స్థాయికి వెళ్లాలి'' అని అన్నారు.
ఈ సందర్భంగా కొందరు సెలబ్రిటీలు శంకర్‌ను కొన్ని ప్రశ్నలడిగారు. వాటికి శంకర్ సమాధానాలిచ్చారు. మరోవైపు ఆయన కూడా తన స్పీచ్ ఇచ్చారు.
ప్రశ్నలు - సమాధానాలు!
రాజమౌళి ప్రశ్న: ఇంత పెద్ద బడ్జెట్ సినిమాను తీస్తున్నప్పుడు ప్రెజర్‌ను ఎలా మేనేజ్ చేశారు? రోబో తర్వాత రజనీగారి ఫ్యాన్స్‌కి ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువుంటాయి. వాటిని ఎలా మీట్ చేయబోతున్నారు? శంకర్: నేను రాజమౌళిగారికి పెద్ద ఫ్యాన్‌ని. ఆయన ఇండియన్ సినిమాకు చాలా గౌరవం తెచ్చిన వ్యక్తి. ప్రెజర్‌ని హ్యాండిల్ చేయడం అనేది ఇంకా ఎక్కువ పనిచేయడమే. సినిమాకు సంబంధించిన ప్రతి ఫ్యాక్ట్‌ని ఎనలైజ్ చేస్తాను. అన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని ఆలోచిస్తాను. ఎక్స్‌పెక్టేషన్ గురించి చెప్పేటప్పుడు '2.0'లో రజనీసార్‌ని వసీగా, చిట్టిగా, 2.0గా, జెయింట్ చిట్టిగా చూస్తాం. ఇంకా కొన్ని సర్‌ప్రైజ్‌లున్నాయి. ఎక్స్‌పెక్టేషన్‌ని మీట్ అవుతుందని నేను నమ్ముతున్నా.
శివరాజ్ కుమార్:మీకు ఇలాంటి ఐడియాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?టైటిల్స్ అంత యాప్ట్ గా ఎలా పెడుతున్నారు? మీకు కుదిరితే భవిష్యత్తులో మీతో ఒక సినిమా చేయాలని ఉంది. శంకర్: ఇలాంటి ఆలోచనలు గాలి నుంచి వస్తాయా? పైనుంచి వస్తాయా? అనేది నాకు తెలియదు. కానీ ఆడియన్స్‌కి ఏదో కొత్తగా చూపించాలని ఆలోచిస్తాను. ఆ ఆలోచనల నుంచే వస్తాయేమో. ఇక కథ గురించి ఆలోచించేటప్పుడే సరైన టైటిల్ వస్తుంది. ఒకవేళ రాకపోతే ఎనలైజ్ చేసి పెట్టడమే. '2.0' విషయానికి వస్తే.. ఈ టైటిల్ గురించి మాట్లాడాంటే.. మామూలుగా టెక్నికల్ లాంగ్వేజ్‌లో చెప్పేటప్పుడు వెర్షన్ సెకండ్ అని, ఇంకోటని అంటారు. 2.0 అని అంటే ఏ లాంగ్వేజ్ అయినా తప్పకుండా రీచ్ అవుతుందనిపించింది. అందుకే పెట్టాను. కన్నడ సూపర్‌స్టార్ అయి ఉండి ఆయన నాతో పనిచేయాలనుకోవడం చాలా గౌరవంగా భావిస్తున్నా. తప్పకుండా చేస్తాను.
అభిమానుల ప్రశ్నలు!
ఇన్ని ప్రెజర్స్‌ని దాటుకుని మిమ్మల్ని ఎక్కువ మోటివేట్ చేసిందేంటి?
- ఆడియన్స్ నన్ను మోటివేట్ చేశారు.
ఫిఫ్త్ ఫోర్స్ గురించి మాట్లాడారు. అలాగంటే ఏంటి?
- మనకు నాలుగు ఫోర్స్ తెలుసు. ఐదో ఫోర్స్ అనేది నెగటివ్ ఎనర్జీ. దాన్ని ఎలా కొలవాలని అందరూ పరిశోధనలు చేస్తున్నారు. అదే ఫిఫ్త్ ఫోర్స్.
3.0 వస్తుందా?
- 3.0 కోసం చిన్న చిన్న ఐడియాస్ మైండ్‌లో ఉన్నాయి. కానీ ఈ సినిమా తర్వాత దాని కథ వర్కవుట్ అయితే చేస్తాను.
కన్నడ నటుడు ఉపేంద్ర ప్రశ్న: నాలాంటి డైరక్టర్ కమ్ హీరోకి, శంకర్‌గారు, రజనీగారు ఏమైనా టిప్స్ ఇస్తారా? శంకర్: నేనేంటి ఆయనకు టిప్స్ ఇచ్చేది. ఆయన గొప్ప డైరక్టర్. ఆయన 'ఉపేంద్ర', 'ఎ' అనే సినిమాలు నాకు నచ్చిన సినిమాలు. ఇన్‌స్పయిరింగ్‌గా ఉంటాయి. 'ఎ' సినిమా ఫస్ట్ సీనే క్లైమాక్స్‌లా ఉంటుంది. ఎవరికైనా వర్తించే సూత్రం ఒకటే. మీకు కన్వినియంట్ నిర్మాత, ప్రొడ్యూసర్, టెక్నీషియన్స్‌తో పనిచేయవద్దు. సరైన సబ్జెక్ట్‌ని ఎంపిక చేసుకుని, దానికి తగ్గ టెక్నీషియన్స్‌ని ఎంపిక చేసుకుని పనిచేస్తే అన్ని సినిమాలు విజయం సాధిస్తాయి.
ఇక '2.0' సినిమా విషయానికి వస్తే...
'ఇలా జరిగితే ఎలా ఉంటుంది' అనే ఊహే ఈ కథ. ఇది పూర్తి స్థాయి యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైన్‌మెంట్. సినిమా అనేదాన్ని కూడా దాటి... త్రీడీ, 4డీ అనే కొత్త అనుభవం ఉంటుంది. సుభాస్కరన్ లేకపోతే ఈ సినిమా లేదు. ఇండియన్ సినిమాను ఇంత బడ్జెట్ తో ఎవరూ నిర్మించరు. కేవలం సినిమా మీద ప్యాషన్‌తోనే ఆయన ఈ సినిమాను నిర్మించారు ఈ సినిమాకు చాలా గొప్ప బలం రజనీకాంత్‌గారు. ఆయన ఏం చేసినా, అట్రాక్టివ్‌గా, వ్యత్యాసంగా, స్టైల్‌గా, మాస్‌గా ఉంది. ఇన్నేళ్లుగా ఆయన నటించినప్పటికీ, ఇప్పటికీ ఆయన పెరాార్మేెన్స్ చాలా ఫ్రెష్‌గా ఉంది. ఈ సినిమా ప్రారంభించినప్పుడు రజనీగార్‌కి కాస్త అనారోగ్యంగా ఉంది. ఢిల్లీలో యాక్షన్ డైరక్టర్లు, వీఎఫ్ ఎక్స్ డైరక్టర్లు, అక్షయ్ కుమార్, చాలా మంది కార్పెంటర్లు, జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. దాదాపు ఆరు నెలల ముందే ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ అది. దాదాపు 500-1000 మంది అక్కడ ఉన్నారు. ఆ సమయంలో రజనీకి అనారోగ్యంగా ఉన్నప్పటికీ 47 డిగ్రీల ఎండ, 12 కిలోల బరువు వేసుకుని క్లైమాక్స్ చేశారు. ఒక రోజైతే ఆయనకు దెబ్బ తగిలింది కూడా నాకు తెలియదు. ఎవరో వచ్చి చెప్పారు. ఆయన్ని కూర్చోపెట్టి.. ప్యాంట్ కాస్త పైకి తీసి చూస్తే రెండు ఇంచ్‌లు తెగిన విషయం తెలిసింది. ఆయన్ని బతిమలాడి హాస్పిటల్‌కి పంపాం. ఇలాంటి డెడికేషన్ వల్లనే ఆయన సూపర్‌స్టార్ అయ్యారు. అక్షయ్‌గారు ఈ సినిమాకు పడ్డంత ఎప్పుడూ కష్టపడి ఉండరు. థిక్ డ్రస్, విగ్, కళ్లకు లెన్స్, ప్రోస్తటిక్ మేకప్.. అంత కష్టపడి చేశారు. ఆరు నెలలకు ముందు నుంచే రెహ్మాన్‌గారు మరలా మరలా మ్యూజిక్ చేస్తూనే ఉన్నారు. ఈ సినిమాకు చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంతా పాటల్లాగానే ఉన్నాయి. ఈ సినిమా కోసం నాతోపాటు కుక్కల్లాగా, దెయ్యాల్లాగా కష్టపడింది మా అసోసియేట్ డైరక్టర్ పప్పు. తన కష్టం చాలా గొప్పది. శరత్, ప్రశాంత్, నీలేష్, కార్తిక్, గోవర్ధన్.. వీళ్లందరూ నాతో పాటు నాలుగేళ్లు కష్టపడ్డారు. ప్రొడక్షన్ డిజైనర్ ముత్తురాజ్‌గారు ప్రీ ప్రొడక్షన్‌లో చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టారు. సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, మరీ ముఖ్యంగా వీఎఫ్ ఎక్స్ లో ఆయన భాగం ఎక్కువ. వీఎఫ్‌ఎక్స్ శ్రీనివాసన్ కథ నుంచి ఫస్ట్ కాపీ వరకు కాన్‌స్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆంటోనీ, యానిమేషన్‌ని, తర్వాత షూట్‌ని, ఇప్పుడు సీజీని... మొత్తం మూడు రకాలుగా ఎడిట్ చేశారు. నీరవ్ షా, జయమోహన్, ఎమీ, కరుణా మూర్తి... ఇలా ప్రతి ఒక్కరూ ఎంతెంతో కష్టపడ్డారు. అసాధారణమైన క షి చేశారు. మీడియాకు నా విన్నపం... ఇలాంటి సినిమాలను సపోర్ట్ చేయండి. వేలమంది టన్నుల కొద్దీ కష్టపడ్డారు. మీడియా సపోర్ట్ చేస్తే, మన ఊరిలోనూ ఇలాంటి సినిమాలను చేయగలం అని ప్రపంచానికి చెప్పగలం. ఇలా చాలా సినిమాలు వస్తాయి'' అని అన్నారు.
4డీ గురించి దర్శకుడు శంకర్ మాట్లాడుతూ ''ఈ సినిమా కథను రాసేటప్పుడు ఎలాగైనా ఇది త్రీడీలో వస్తేనే బావుంటుందని అనుకున్నా. సౌండ్ మాత్రం 4 డీలో ఉండాలని అనుకున్నా. నా ఎన్నో ఏళ్ల కల అది. మామూలుగా మనం సినిమా చూసేటప్పుడు చుట్టుపక్కల నుంచి, పై నుంచి స్పీకర్ల ద్వారా శబ్దాలను వినొచ్చు. కానీ కాళ్ల కింద కూడా స్పీకర్లు ఉంటే... నేల మీద జరిగే అంశాలకు కూడా సౌండ్ కల్పిస్తే బావుంటుందని ఆశించాను. రసూల్ పూకుట్టి కూడా దానికి ఎంతగానో సహకరించారు. కేవలం 4డీ సౌండ్ ని అందించడం మాత్రమే కాదు.. 4,5 స్టూడియోలో ఉన్న అన్నీ సిస్టమ్స్ ని ఆయన స్టూడియోకి తెచ్చారు. ఈ సినిమా చూసిన తర్వాత మేం పడ్డ కష్టం అర్థమవుతుంది. ఎగ్జిబిటర్లకు నేను రిక్వస్ట్ చేసేది ఒక్కటే.. దయచేసి త్రీడీ థియేటర్లను ఎక్కువ చేయండి. ఈ సినిమా ఫుల్ ఎఫెక్ట్ తెలియాలంటే 4డీ సౌండ్ సిస్టమ్‌లోనూ, త్రీడీలోనూ చూస్తేనే అందుతుంది'' అని అన్నారు