వి.కె.ఎ.ఫిలింస్ బ్యానర్‌పై ఆశిష్‌రాజ్, సిమ్రన్ జంటగా నటించిన చిత్రం 'ఇగో'. విజయ్ కరణ్, కౌశల్ కరణ్, అనిల్ కరణ్ నిర్మాతలు. సుబ్రమణ్యం ఆర్.వి. దర్శకుడు. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో బుధవారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మారుతి టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా...
మారుతి మాట్లాడుతూ - ''ఈ బ్యానర్‌పై సుబ్బు డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. మంచి ప్యాషన్ ఉన్న డైరెక్టర్. మంచి కథను తయారు చేసుకున్నాడు. తనకు మంచి నిర్మాతలు దొరికారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. అశిష్ చక్కగా యాక్ట్ చేశాడు. హీరోయిన్ అందంగా కనపడుతుంది. నటీనటులు, టెక్నిషియన్స్ అందరూ చేసిన హార్డ్ వర్క్ తెరపై కనపడుతుంది'' అన్నారు.
చిత్ర దర్శకుడు ఆర్.వి.సుబ్రమణ్యం మాట్లాడుతూ - ''మారుతిగారు నా మెంటర్. సినిమా పూర్తి కావస్తుంది. సినిమా బాగా వచ్చింది. టీజర్ అందరికీ నచ్చి ఉంటుంది. ట్రైలర్ ఇంకా బావుంటుంది. అశిష్ అద్భు
తంగా, మన పక్కింటి కుర్రాడిలా నటించాడు. ఎడిటర్ శివగారు చాలా హార్డ్‌వర్కర్. ఎంతో సపోర్ట్ చేశారు. అలాగే నిర్మాతలు కథ వినగానే నన్ను నమ్మి అవకాశం ఇచ్చారు. వారికి రుణపడి ఉంటాను. నేను వారికి చెప్పిన దానికంటే పది రెట్లు బాగా తీశాను. తప్పకుండా సినిమా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుంది'' అన్నారు.
ఎడిటర్ శివ మాట్లాడుతూ - ''నిర్మాతలకు ధన్యవాదాలు. మా సినిమా టైటిలే ఇగో కానీ టెక్నిషియన్స్‌కు ఇగో లేదు. అందుకే సినిమా బాగా వస్తోంది'' అన్నారు.
నిర్మాతలు విజయ్ కరణ మాట్లాడుతూ - ''మా బ్యానర్‌లో వస్తోన్న రెండో చిత్రం. తప్పకుండా అందరూ ఆదరిస్తారని భావిస్తున్నాను'' అని తెలిపారు.
అనిల్ కరణ్ మాట్లాడుతూ - ''భవిష్యత్తులో కూడా మంచి సినిమాలనే ప్రేక్షకులకు అందిస్తాం'' అన్నారు.
కౌశల్ కరణ్ మాట్లాడుతూ - ''మా యూనిట్‌ను ఆశీర్వదించడానికి వచ్చిన మారుతిగారికి థాంక్స్. తప్పకుండా అందరికీ నచ్చుతుంది'' అన్నారు.
రాజ్ కరణ్ మాట్లాడుతూ - ''ఈ చిత్రంలో నేను హీరో ఫ్రెండ్‌గా నటించాను. సినిమా షూటింగ్‌ను ఎంజాయ్ చేశాను'' అన్నారు.
హీరోయిన్ సిమ్రన్ మాట్లాడుతూ - ''దర్శక నిర్మాతలకు థాంక్స్. మంచి యూనిట్‌తో పనిచేశాను. ఎంజాయ్ చేస్తూ నటించాను'' అన్నారు.
హీరో అశిష్ రాజ్ మాట్లాడుతూ - ''నిర్మాతలు మా మావయ్యలు. మంచిసినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో నా క్యారెక్టర్ పేరు గోపి. సుబ్రమణ్యంతో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. చాలా ఇగో ఉన్న యువకుడిగా కనపడతాను'' అన్నారు.
ఈ కార్యక్రమంలో అశోక్‌కుమార్, స్నిగ్ధ తదితరులు పాల్గొన్నారు.