The theatrical trailer of actress Samantha Akkineni’s upcoming movie ‘U Turn’ is launched on Friday in the presences of cast, crew and the audience in Cinemax.
Speaking on the occasion actress Samantha said, “Thanks to the media and everyone who have supported this event during the hard times because of Kerala floods and demise of former PM AB Vajpayee. But ours is a small film and hope everyone will understand. ‘U Turn’ is an honest attempt and everyone who has worked for this film gave their one hundred percent. I’m confident that it is a good film and we have made a good product. I hope all liked the trailer and I believe it is an honest representation of what you can expect in the film. This is the first time, I have worked with new producers and it’s a comfortable experience. My director Pawan Kumar is very supportive despite being a big director in Kannada. I would like to continue to work with him in future. Thanks to Aadhi Pinisetty and Rahul Ravindran for being part of this film and they added so much value to it. Cinematographer Niketh has a long way to go in the industry.”
Director Pawan Kumar said, “I met Samantha about three years back. It’s been a great journey to come to Telugu industry and do this film. I was born in Ananthapur. My mom is a Telugu and I grew watching a lot of Telugu films. It’s a coincidence that today is my mom’s birthday and my first Telugu film trailer is launched on this very day. ‘U Turn’ making was fun and answering Samantha’s questions is kind of learning process for me. We have got a great cast for the film.”
Speaking Rahul said, “I and Samantha have worked together about 10 years back. She is a completely different person now and an incredible performer. Aadhi, I’m a huge fan of his voice, amazing voice he has and last time he did a police offer role in ‘Vyshali.’ That film was a super hit and hopefully this film will also have the same result.”
Aadhi Pinisetty said, “It was pleasure working with this team and I can say one of my best working experiences due to a lot of reasons. After the first day shoot, I decided to blindly follow director Pawan, whatever he says. Coming to Samantha, though we worked in ‘Rangasthalam’ I did not get to know as a performer or a person but she is one of the best human beings I ever met and one of the best actresses."
The trailer launch event was attended by Aadhi Pinisetty, Rahul Ravindran, director Pawan Kumar, cinematographer Niketh Bommi, producers Srinivasaa Chhitturi and Rambabu Bandaru
Crew:
Story & Direction: Pawan Kumar
Producers: Srinivasaa Chitturi and Rambabu Bandaru
Banners: Srinivasaa Silver Screen and VY Combines
Music: Poorna Chandra Tejaswi
Cinematography: Niketh Bommi
Art Director: AS Prakash
Editor: Suresh Arumugam
PRO: Vamsi-Shekar
యు టర్న్ ట్రైలర్ విడుదల
సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నటిస్తోన్న యు టర్న్ సినిమా ట్రైలర్ ను సినీమాక్స్ లో చిత్రయూనిట్ సమక్షంలో విడుదల చేసారు.
ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. ఓ వైపు మాజీ ప్రధానమంత్రి వాజ్ పెయి మరణం.. మరోవైపు కేరళ వరదలు ముంచెత్తుతున్న ఈ సమయంలో కూడా తమ సినిమా ప్రెస్ మీట్ కు వచ్చినందుకు మీడియా అందరికి ధన్యవాదాలు. కానీ మాది చిన్న సినిమా.. అందరూ అర్థం చేసుకుంటారనే ఆశిస్తున్నాను. యు టర్న్ అనేది ఓ హానెస్ట్ సినిమా.. దీనికి పని చేసినవాళ్లంతా వందశాతం తమ కృషి పెట్టారు. ఇది మంచి సినిమా అని.. మేం మంచి ప్రయత్నం చేసామనే అనుకుంటున్నాం. కెరీర్ లో తొలిసారి కొత్త నిర్మాతలతో పని చేస్తున్నాను.. చాలా కంఫర్ట్ గా ఉంది. మా దర్శకుడు పవన్ కుమార్ కూడా అద్భుతంగా పని చేసాడు. కన్నడలో పెద్ద దర్శకుడు అయినా కూడా ఇక్కడ బాగా సపోర్ట్ చేసాడు. ఫ్యూచర్ లో మరో సినిమా కూడా చేయాలని కోరుకుంటున్నాను. రాహుల్ రవీంద్రన్, ఆది పినిశెట్టి ఈ చిత్రానికి మరింత స్టార్ పవర్ అందించారు. సినిమాటోగ్రఫర్ నికేత్ ఇండస్ట్రీలో చాలా దూరం వెళ్తాడని ఆశిస్తున్నాను అని చెప్పారు.
దర్శకుడు పవన్ కుమార్ మాట్లాడుతూ.. సమంతను మూడేళ్ల కింద కలిసాను. ఆమెతో ప్రయాణం అద్భుతంగా ఉంది.. తెలుగు ఇండస్ట్రీ కూడా చాలా బాగుంది. నేను పుట్టింది అనంతపూర్ లో. మా అమ్మ తెలుగు.. అందుకే తెలుగు సినిమాలు చూస్తూనే పెరిగాను. ఈ రోజు మా అమ్మగారి పుట్టినరోజు.. అదే రోజు నా తొలి తెలుగు సినిమా ట్రైలర్ విడుదల కావడం నిజంగా యాదృశ్చికమే. యు టర్న్ ఆసక్తికరంగా ఉంటూనే నవ్విస్తూ.. ఎన్నో ప్రశ్నలకు సమాధానంగా నిలుస్తుంది. మంచి క్యాస్టింగ్ తోనే ఈ సినిమాను తెరకెక్కించాం అన్నారు.
రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ.. పదేళ్ల కింద నేను, సమంత కలిసి పనిచేసాం. అప్పటికి ఇప్పటికీ సమంత నటిగా పూర్తిగా మారిపోయింది. గొప్ప నటిగా ఎదిగింది. ఆది వాయిస్ కు నేను పెద్ద ఫ్యాన్. ఆయన స్వరం అందంగా ఉంటుంది. వైశాలి సినిమాలో ఆయన చివరిసారిగా పోలీస్ ఆఫీసర్ గా నటించారు. మళ్లీ ఇన్నాళ్లకు నటిస్తున్నారు. ఇది కూడా సూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్నాను అన్నారు.
ఆది పినిశెట్టి మాట్లాడుతూ.. ఈ సినిమాకు చాలా మంచి అనుభవాన్ని ఇచ్చింది. దానికి చాలా కారణాలున్నాయి. ఇలాంటి టీంతో మళ్లీ మళ్ళీ పని చేయాలని ఉంది. తొలి రోజు షూటింగ్ పూర్తి కాగానే గుడ్డిగా దర్శకున్ని నమ్మేసాను. పవన్ కుమార్ ఏం చెబితే అది చేసాను. సమంత విషయానికి వస్తే.. రంగస్థలంలో కలిసి పని చేసినా కూడా ఆమె నటన గురించి కానీ.. ఆమె గురించి కానీ పూర్తిగా తెలియలేదు. కానీ ఇప్పుడు తెలిసింది.. సమంత మంచి మనిషి కూడా. ఈమె లాంటి బెస్ట్ యాక్ట్రెస్ ను ఇప్పటి వరకు కలవలేదు అన్నారు.