తాప్సీ పన్ను మాట్లాడుతూ - `` సాధారణంగా ఇప్పటి వరకు నేను నటించిన చిత్రాల్లో నాకు ఓ హీరో ఉంటాడు. కానీ ఈ చిత్రంలో నాకు నలుగురు హీరోలున్నారు.నేను మొదటిసారి చేసిన హారర్ కామెడీ చిత్రమిది. ప్రతి క్యారెక్టర్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. తప్పకుండా సినిమా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుంది`` అన్నారు.
నిర్మాత విజయ్ చిల్లా మాట్లాడుతూ - ``ఈ కథను దర్శకుడు మహి చెప్పేటప్పుడు హారర్ కామెడి జోనర్ అన్నాడు. కానీ కథలో మనుషులను చూసి దెయ్యం భయపడుతుంది అనే పాయింట్ నాకు నచ్చింది. సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. అక్కడ నుండి దర్శకుడు మహినే నటీనటులను సినిమాలో నటించేలా ఒప్పించాడు. సినిమా టెక్నికల్‌గా బావుంటుంది. శ్రీనివాస్ రెడ్డి, తాగుబోతురమేష్, వెన్నెలకిషోర్ సహా అందరికీ థాంక్స్. బాగా సపోర్ట్ చేశారు. సినిమాను ఆగస్ట్ 18న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.
దర్శకుడు మహి వి.రాఘవ్ మాట్లాడుతూ - ``నేను దర్శకుడిగా, రచయితగా కథను 50 శాతం రాస్తే, మిగిలిన 50 శాతం నటీనటులే వారి నటనతో పూర్తి చేస్తారు. అలా మంచి ఆర్టిస్టులు ఈ సినిమాకు కుదిరారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే నేను దెయ్యాలను పెద్దగా నమ్మను. అందుకే హారర్ కామెడీ సినిమా కథ రాయగలిగాను. సాధారణంగా దెయ్యాలకు మనుషులు భయపడుతుంటారు. కానీ దెయ్యాలు మనుషులకు భయపడితే అనే పాయింట్‌తో కథను డెవలప్ చేశాను. వెన్నెలకిషోర్‌గారు ఇందులో చాలా టఫ్ రోల్ చేశాడు. పటాస్ సినిమా సమయంలో శ్రీనివాసరెడ్డి నటన నాకు బాగా నచ్చింది. అందుకే ఈ సినిమాలో తనను తీసుకున్నాను. తను క్యారెక్టర్‌ను బాగా ఇంప్రవైజ్ చేయగలడు. ముందు ఓ క్యారెక్టర్‌కు తాగుబోతు రమేష్‌ను తీసుకోకూడదని అనుకున్నాం. కానీ చివరకు తను తప్ప, మరెవరూ ఆ క్యారెక్టర్ చేయలేరనిపించి తననే తీసుకున్నాం. షకలక శంకర్ తనదైన స్టైల్‌లో నవ్విస్తాడు. ఈ నలుగురు నటులు ఒకరిని మించి ఒకరు బాగా చేయాలని ప్రయత్నించారు. అనీష్ సినిమాటోగ్రఫీ, కె సంగీతం, ఎడిటింగ్ ఇలా బలమైన టెక్నికల్ టీం కూడా తమ వంతు సహకారాన్ని అందించారు`` అన్నారు.
Tapsee Glam gallery from the event
శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ - ``భలే మంచి రోజు వంటి మంచి సినిమా చేసిన విజయ్‌గారు ఓ రోజు నన్ను సినిమా చేస్తున్నాం. అందులో నువ్వు నటించాలని అన్నారు. దర్శకుడెవరని అన్నాను. ఆయన న్యూజిలాండ్‌లోని మహిగారితో మాట్లాడించారు. ఆయన హారర్ కామెడి జోనర్ అనగానే ముందు చేయకూడదని అనుకున్నాను. కానీ ఆయన రివర్స్‌లో మనుషులకు దెయ్యాలు భయపడతాయని అన్నారో ఆ పాయింట్ నచ్చడంతో చేయడానికి ఒప్పుకున్నాను. సినిమాలో కథే హీరో. మంచి క్యారెక్టర్ చేశాను. ఈ సినిమాను హారర్ కామెడి అంటున్నారు, కానీ ఇందులో మంచి ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుది. ఆ పాయింట్ ప్రేక్షకులకు తప్పకుండా నచ్చతుంది. టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుండి పోస్టర్స్, మోషన్ పోస్టర్స్ ఇలా అన్నింటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది`` అన్నారు.
వెన్నెలకిషోర్ మాట్లాడుతూ - ``భలే మంచి రోజు సినిమాలో నేను ఓ చిన్న పాత్ర చేశాను. అదే పరిచయంతో నిర్మాతగారు నన్ను పిలిచి ఈ క్యారెక్టర్ గురించి చెప్పారు. ఇందులో నా క్యారెక్టర్ చాలా సెటిల్‌డ్‌గా ఉండి ప్రేక్షకులను నవ్విస్తుంది. 100 శాతం సినిమా అందరికీ నచ్చుతుంది`` అన్నారు.