pizza

“Every person is a walking story” - Mayasabha articles
“ప్రతి మనిషీ నడయాడే కథ!” – మయసభ వ్యాసాలు
- Deva Katta

Article #4: Shatru
ఆర్టికల్ #4: శత్రు

You are at idlebrain.com > news today >

18 August 2025
Hyderabad

“Every person is a walking story” - Mayasabha articles
“ప్రతి మనిషీ నడయాడే కథ!” – మయసభ వ్యాసాలు
- Deva Katta


Introduction
Behind Mayasabha’s success are underdogs whose grit and passion kept them chasing cinema against all odds. This article series celebrates those journeys—how each cast and crew member was chosen, the struggles that shaped them, and how one project’s nationwide acclaim became the turning point of their careers. Because every person you meet is a walking story—sometimes all it takes is one opportunity for the world to listen.

మయసభ విజయం వెనకున్న సైన్యం, సంవత్సరాలుగా కష్టాలు, అడ్డంకులు ఎదుర్కొంటూ సినిమా తప్ప వేరే జీవితమే లేదని బతుకుతున్న అండర్‌డాగ్స్. వారి ప్రయాణానికి నివాళిగా ఈ వ్యాసాలు రాస్తున్నాను. వారిని తీర్చిదిద్దిన జీవిన పోరాటాలు, మయసభలో వారి ఎలా ఎంపిక, ఈ విజయంలో వారి పాత్ర ఈ వ్యాసాల్లో ప్రధాన అంశాలు. ప్రతి మనిషి ఒక నడిచే కథ—ఆ కథని ప్రపంచం వినడానికి, ఒకే ఒక్క అవకాశం చాలు.

Don’t encourage piracy. Please watch #Mayasabha only on SonyLiv

Born into a farming family, Shatru hails from the Godavari districts. His family had been settled in Orissa for the past three generations. Despite this background, Shatru dared to dream of becoming an actor after performing in a few school stage shows. The dream seemed “unachievable,” but he dared to try and moved to Hyderabad in 2005. While studying in college, he simultaneously kept giving auditions—armed with that “OG old photo album” (clicked in a basic photo studio).

He played small roles as a henchman in a few movies but kept hoping for better roles. Even though things weren’t moving in the right direction for a long time, his passion never died. Starting from movies like Legend and Aagadu, the journey continued through Krishnagadi Veera Prema Gaadha, Rangasthalam, Pushpa... with Krishnagadi Veera Prema Gaadha being the breakthrough in his career.

When we were looking for Vakada Mahesh, whose character arc peaks in the second season though it remains a little subtle in season one, we wanted someone to carry the role with heroic dignity. Shatru has always been a spontaneous actor with great potential. The moment my partner Kiran mentioned his name, I was sold.

Interesting snippet: When we were negotiating back and forth with Sony’s commercial team, there was a moment when their casting budget wasn’t sufficient to accommodate well-known stars like Aadhi, Nasser, Saikumar gaaru, etc. As a result, we were also compelled to audition Shatru for the KKN character—and he delivered a brilliant performance there too. If the commercials hadn’t worked out, we would have cast him as KKN. Despite that glimmer of hope and the eventual disappointment, he approached his character with impeccable conviction and dedication.

Shatru is an immensely interesting actor. He doesn’t talk much or ask any questions. The moment we say “action,” he’s just magical in front of the camera. As far as I remember, he was always one of those “first take itself OK” kind of actors. In this journey, we realised Shatru has immense potential to convincingly portray any character you challenge him with. He starts by developing an apt body language, look, and vocal representation of the character—without much instruction from the directors. He just comes in and surprises you in front of the camera. He processes everything very internally. That’s why he looks so authentic as Vakada Mahesh in Mayasabha.

He was a great addition to our casting palette. I thank him for accommodating this work despite being very busy with films.

Mentioning just a few of Shatru’s magical moments in the show:

1. The way he walks into the rice mill, pulls the chair from the side, and sits across from Chaudhary the mill owner with his legs crossed and eyes glancing down—was brilliant to see without having instructed him anything before the shot. He just came in as a complete package in front of the camera, with all the mannerisms and gestures that elevated the character.

2. Even a very simple close-up of his face transmits a lot of story and mood—especially when his brother murders Raja Rathnam Naidu and flips the power dynamics in Vijayawada.
May the success of Mayasabha bring more and more challenging roles his way—to bring out the unexplored actor in him, waiting to erupt like a volcano. Wishing Shatru a great career ahead.

Kudos to Shatru and his story! – “Every person is a walking story.”

Don’t encourage piracy. Please watch #Mayasabha only on SonyLiv

“ప్రతి మనిషీ నడయాడే కథ!” – ఆర్టికల్ #4: శత్రు

శత్రు గోదావరి జిల్లాలో ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. కానీ వారి కుటుంబం గత మూడు తరాలుగా ఒరిస్సాలో స్థిరపడి పోయారు. ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా కూడా, స్కూల్ డేస్‌లో కొంతకాలం స్టేజ్ మీద నటించి, తరువాత సినిమా నటుడవాలనే ఆశయం పెంచుకున్నాడు. ఆ కల ఎంత దూరంగా ఉన్నా, ఆశతో పట్టుదలతో ప్రయత్నాలు కొనసాగించాడు. 2005లో హైదరాబాద్‌ వచ్చేశాడు.

డిగ్రీ చదువుతూనే, స్టూడియోలో తీయించిన "ఓల్డ్ స్కూల్" ఫోటో ఆల్బమ్‌ పట్టుకుని ఆడిషన్లు చేసేవాడు. చిన్న చిన్న హెంచ్ మాన్ పాత్రలు చేశాడు, కానీ ఎదో ఒక మంచి ఛాన్స్ వస్తుందనే ఆశతోనే ఉండేవాడు. చాలా కాలం గుర్తింపు రాకపోయినా, సినిమాలపై ఉన్న ప్రేమ మాత్రం అస్సలు తగ్గలేదు.

లెజెండ్, ఆగడు లాంటి సినిమాలతో మొదలైన ఈ జర్నీ కృష్ణగాడి వీర ప్రేమగాథ, రంగస్థలం, పుష్ప వరకు వచ్చింది. ఇందులో కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమా తనకి టర్నింగ్ పాయింట్ అయింది.

"వాకాడ మహేష్" పాత్ర మొదటిసీజన్‌లో బాగా సబ్టిల్‌గా ఉంటుంది, కానీ రెండో సీజన్ లో చాలా పీక్ అందుకుంటుంది. ఈ పాత్రకి నటుడిని వెతుకుతున్నప్పుడు ఓ హీరోయిక్ డిగ్నిటీతో అప్రోచ్ చేసే యాక్టర్ కోసం వెతుకుతున్నాం. నా పార్ట్‌నర్ కిరణ్ శత్రు పేరును చెప్పగానే, వెంటనే ఒప్పేసుకున్నాను.

ఇంటరెస్టింగ్ విషయమేంటంటే: సోనీ కమర్షియల్ టీమ్‌తో మేము చర్చలు జరుపుతున్న సమయంలో, వారి క్యాస్టింగ్ బడ్జెట్, ఆది, నాసర్, సాయికుమార్ గారిలాంటి పెద్ద స్టార్లను తీసుకునేందుకు సరిపోలేదు. దాంతో శత్రు గారిని "KKN" పాత్రకి కూడా ఆడిషన్ చేయాల్సి వచ్చింది. తను ఆ పాత్ర ను కూడా చాలా అద్భుతంగా చేశాడు. కమర్షియల్‌గా సెటిల్ కాకపోయుంటే, ఆయనే "KKN" అయ్యేవారు🙂. ఆ చిన్న ఆశ… తర్వాత నిరాశ అయినా, తన పాత్రను పూర్తి నమ్మకం, డెడికేషన్‌తో చేసారు.

శత్రు చాలా ఇంట్రెస్టింగ్ నటుడు. ఎక్కువ మాటలు చెప్పడు, ప్రశ్నలు అడగడు. "యాక్షన్" అనగానే స్క్రీన్ మీద ఒక అథెంటిక్ అండ్ మేజికల్ యాక్టర్ కనిపిస్తాడు. తనతో ప్రతి షాటు ఫస్ట్ టేక్‌లోనే ఒకే అయ్యేది. పాత్రకు తగ్గ బాడీ లాంగ్వేజ్‌, లుక్‌, వాయిస్—all naturally—డెవలప్ చేసుకొస్తాడు. డైరెక్టర్స్ ఎక్కువ చెప్పాల్సిన అవసరం ఉండదు. కెమెరా ముందు సర్పైజ్ చేస్తాడు.

శత్రు మా క్యాస్టింగ్‌కు ఓ మంచి అదనపు విలువ. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, మయసభకి టైమ్ కేటాయించినందుకు కృతజ్ఞతలు.

శత్రు మేజికల్ మోమెంట్స్ కొన్ని:

1. రైస్ మిల్‌కి వచ్చి, సైడ్‌ నుంచి కుర్చీ లాగి, లెగ్ క్రాస్ చేసి మిల్ ఓనర్ చౌదరి ఎదుట కూర్చొని, కళ్ళతో కిందకి చూసే స్టయిల్—ముందుగానే ఏం చెప్పకపోయినా, కెమెరా ముందు పూర్తిగా క్యారెక్టర్‌గా దిగి వచ్చినట్టనిపించింది.

2. తన అన్న రాజరత్నం నాయుడుని చంపే సీన్ లో శత్రు ముఖం మీద కాప్చర్ చేసిన ఒక సింపుల్ క్లోస్‌ అప్ కూడా ఎంతో స్టోరీ చెబుతుంది.

మయసభ విజయంతో శత్రు గారికి ఇంకా గొప్ప పాత్రలు రావాలని ఆశిస్తున్నాం. తనలోని అపారమైన టాలెంట్ ని వెలికి తీసే పాత్రలు రావాలని కోరుకుంటున్నాం. అలాంటి పాత్రలతో ఎక్స్ప్లోడ్ అవడానికి ఒక అగ్నిపర్వతంలా ఎదురుచూస్తున్నాడు శత్రు!

బిగ్ సెల్యూట్ టు శత్రు! - “ప్రతి మనిషీ నడయాడే కథ!”

పైరసీ ని అరికట్టండి. సోనీ లివ్ లో “మయసభ” చూడండి!

- Deva Katta

Other articles from "Mayasabha - Every Person is a Walking Story series:

3.Tanya Ravi Chandran
2.Chaitanya Rao
1.Aadhi Pinisetty



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved